మా తెలుగు తల్లికి మల్లె పూదండా మా కన్న తల్లికి మంగళారతుల
To our Mother Telugu a garland of jasmines, devoted we are to our great Mother who birthed us
కడుపులో బంగారు కను చూపులో కరుణా చిరునవ్వులో సిరులు దొరలించు మా తల్లి
With gold in thy belly and grace in thine eyes, our Mother whose smile wealth poureth forth
గల గలా గోదారి కదలి పోతుంటేను బిర బిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటే
Full of life and vigour is river Godavari, full of elation the river Krishna floweth
బంగారు పంటలే పండుతాయి మురిపాల ముత్యాలు దొరలు తాయి
Crops of gold shall they yield bountifully, glinting and shining gems shall roll forth
అమరావతీ నగర అపురూప శిల్పాలు, త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు
The exotic sculptures of Amaravati, the riveting choral voice of Tyāgayya
తిక్కయ్య కలములో తియ్యందనాలు నిత్యమై నిఖిలమై నిలచి యుండే దాక
The wondrous writings of Tikkayya, gloriously withstood the tests of time.
రుద్రమ్మ భుజ శక్తి మల్లమ్మ పతిభక్తి తిమ్మరుసు ధీయుక్తి కృష్ణరాయని కీర్తి
Rudramma's strength and Mallamma's fidelity, Timmarasu's courage and Krishnadevaraya's glory
మా చెవుల రింగుమని మారు మ్రోగే దాక, నీ పాటలే పాడుతాం నీ ఆటలే ఆడుతాం జై తెలుగు తల్లీ! జై తెలుగు తల్లీ!!
Until our ears ring with pleasantries, we’ll sing thy songs, we'll play thy games. victory, victory to our Mother Telugu!
- Shankarambāḍi Sundarācāri, 1942











