పురాతన రంధ్రాల వెనుక రహస్య సైన్స్ దాగి ఉందా? కొనసాగుతున్న కంబోడియా రహస్యాలు!!
Hey guys, ముందు వీడియోలో, Cambodiaలో Preah Vihear అని పిలువబడే 1000 సంవత్సరాల పురాతన గుడిని చూసాము, అక్కడ అనేకమైన రాళ్లకు ఉన్న వింత రంధ్రాలను నేను మీకు చూపించాను. ఇక్కడున్న రాళ్లలో చాలా రకాల రంధ్రాలు కట్ చేసారు ఇంకా ఈ రంధ్రాలను వేయడానికి కారణం, దీని వెనుక ఉన్న మర్మం ఇప్పటి వరకు రహస్యంగా ఉంది. ఈ రహస్యాన్ని బయటికి తీసుకురావాలంటే, మనం ఇప్పుడు పాతకాలంలో వేసిన ఈ tiles లను చూడాలి.
ప్రతి tileను ఇసుకరాయితో square shapeలో చేసారు, ఇంగ్లీష్ లో దీన్ని sandstone అని అంటారు, కానీ వీటికి మధ్యలో ఒక circular hole ఉంది చూడండి. ఇందులో ఆశ్చర్యమేంటంటే, ఈ holes ఒకటి రెండు రాళ్ళలో లేదు, చెప్పాలంటే కొన్ని tilesలల్లో కూడా లేవు, ఇవే ఈ మొత్తం ప్రాంతంలో మనకు కనిపిస్తుంది. ఒక్కొక్క square tile కూడా మిగిలిన tiles లాగానే ఒకే sizeలో ఉన్నాయి, ప్రతి ఒక tilesల మధ్యలో ఒక holeను వేశారు.
ఇప్పట్లో మనం చేసే విధంగా ఆ కాలంలో ఉన్న పాతకాలపు స్థపతిలు tiles లను manufacturing చేసేవాళ్లా? ఈ విధమైన ప్రతిరూపాన్ని మనం ఇంకా ఎలా explain చేయగలం? ఈ ప్రాంతంలో ఉన్న అన్ని tiles లకు ఖచ్చితమైన అదే లక్షణాన్ని కలిగి ఉందని మీరు చూడవచ్చు. మీరు ఈ టైల్స్‌ను చూస్తూ దాని పైన నడిస్తే, అదో ఒక అద్భుతమైన mass manufacturing factoryలో నడుస్తున్నట్లు ఉంటుంది. కానీ మధ్యలో ఈ holes లను ఎందుకు వేశారు? Archeologistsలు దీనికి చాలా simple అయిన explanationను ఇస్తున్నారు.
రాళ్లతో చేసిన blocks లను easyగా move చేయడం చాలా కష్టం, ఎందుకంటే దాన్ని పట్టుకోవడానికి మనకి ఏ grip ఉండదు కాబట్టి పాతకాలపు స్థపతిలు కొండల నుండి రాతి బ్లాకులను cut చేసి తీసుకువచ్చేటప్పుడు వాటిపై holesలను వేశారు, ఎందుకంటే స్థపతిలు ఆ holes లోపల ఒక కర్రను పెట్టి వాటిని easy గ తీసుకువెళ్లేవారు. కొన్ని documentariesలో కూడా ఈ rectangular blocksలలో ఇన్ని రంధ్రాలను ఎలా వేశారని explanetions ఉన్నాయి, అందువల్లే వాళ్ళు వీటిని easyగా move చేయగలిగారని చెప్తున్నాయి.
ఈ documentaryలలో ఉన్న explanationsఅన్ని నమ్మేటట్టుగానే ఉన్నాయి, కానీ అన్ని blocksలలో ఈ holes ఉన్నాయా? ఇదే గుడి complex లో ఉన్న ఇంకొక place కి వెళ్లి అక్కడ నేలపైన ఉన్న tiles లను చూద్దాం. ఇక్కడ నేలపైన ఉన్న ఈ blocks లను చూద్దాం, వీటిపైన ఎలాంటి holes లేవు, కానీ ఈ surfaceలో వాళ్ళు ఏం చేశారని చూడండి. మనం వీటిపై నడిచేటప్పుడు కింద పడకుండా ఉండడానికి ఎలా పని చేశారో కదా, ఇక్కడ గరుగ్గా ఉన్నదంతా మన grip కోసమే.
ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ దారంతా అన్ని చోట్లలో grip కోసమే వేశారు. ఈ ప్రదేశం మొత్తం ఇలాంటి రాళ్లతో తయారు చేసారు, అది కూడా ఈ surface roughగా ఉండడానికే చేసారు. దీన్ని roughగా మార్చడానికి sandpaper లేదా acid treatment లాంటి ఏదో ఒక విచిత్రమైన processని use చేసుంటారు, లేకపోతే ఒక deviceనైనా use చేసుంటారు. దీనిని నమ్మలేక పోతున్నాను. అవును, ఈ రోజు మన దగ్గర రగ్గులు ఉన్నాయి, భారతదేశంలో archeology department వాళ్ళు maintain చేసే place లను చూస్తే.
for example తాజ్ మహల్లో లేదా క్కుతుబ్ మీనార్ లో చూసుకుంటే, కొన్ని స్థలాల్లో మనుషులు జారిపడకుండా ఉండడానికి ఇలాంటి carpets లను use చేస్తున్నార, కానీ ఈ carpet 1000 సంవత్సరాల paathadaina kuda ippatlo unna modern carpet లు పది సంవత్సరాలకు తర్వాత నశించిపోతాయి కానీ, ఇవి ఎప్పటికైనా కొత్తవిగానే ఉంటాయి. అందుకే మనం పాతకాలపు స్థపతులను గౌరవిస్తున్నాం, వాళ్ళు కాలం కూడా నాశనం చేయలేని వస్తువులను నిర్మించారు, అయితే పురాతన బిల్డర్లు అక్కడ నేల పైన ఉన్న tilesలకు రంధ్రాలు వేసినట్టుగా, ఈ బ్లాకులకు ఎందుకు రంధ్రాలు వేయలేదు?
రంధ్రాలను వేయకుండ వీటిని పైనుండి ఎలా తీసుకోచుంటారు? ఈ mainstream archeologists ల theory తో నాకు satisfied లేదు, అయితే ఈ రంధ్రాలకు వేరే ఒక కారణం ఉండుంటుందేమో. నేను ఈ గోడలను పరిశీలించి చూసినప్పుడు, ఈ రంధ్రాలన్నీ చాలా చాలా వింతగా ఉన్నాయి ఇంకా ఈ explanationలకు వ్యతిరేకంగా ఉన్నాయి. డాక్యుమెంటరీలలో ఏం ఉందంటే, ఈ రాళ్ళపైన రంధ్రాలను వేసి చెక్క కర్రలను దాని లోపల పెట్టి రెండువైపుల ఉన్న వ్యక్తులు రెండువైపుల నెట్టడమో లేదా లాగడంతో చేస్తారు.
అయితే, ఈ రంధ్రాలను చూడండి, ఇవి ఎక్కువ లోతు లేకుండా ఉన్నాయి. ఎక్కువ లోతు లేదు కాబట్టి దీని లోపల ఒక కర్రను పెట్టి వీటిని జరపగలమా లేదా అని కూడా నాకు సందేహంగా ఉంది. ఇలాంటి రాళ్లను జరపాలంటే ఈ రంధ్రాలను symmetricallyగా drill చేయాలి, ఒకటి నాలుగు ముళ్ళల్లో వెయ్యాలి, లేకపోతే correct గా center లో వెయ్యాలి. కానీ ఈ బ్లాక్‌లలో ఉన్న రంధ్రాలు విచిత్రంగా ఉన్నాయి, కొన్ని రంధ్రాలేమో మూలలో ఉన్నాయి, కొన్నేమో మూలల్లో లేవు. కొన్ని blocks లలో చాలా రంధ్రాలను వేశారు.
ఇంకా అదే size లో ఉన్న blocks లలో చాలా తక్కువ రంధ్రాలు వేశారు, అంతెందుకు కొన్ని వాటిల్లో అసలు రంధ్రాలే లేవు, ఇంకొక విషయం ఏంటంటే ఈ అనేక రంధ్రాలు అందాన్ని దెబ్బతీస్తున్నాయి, గుడి గోడలు అసలు చూడడానికి ఎలా ఉండాలి అలంకరించబడి అందంగా ఉండాలి కదా. కానీ నిజం చెప్పాలంటే, ఈ గోడలకు ఈ రంధ్రాలు ఉండడం అసలు బాగాలేదు. అయితే, ఈ రంధ్రాలను ఖచ్చితంగా వేరే ఏవో కొన్ని ముఖ్యమైన ప్రయోజనాల కోసమే వేసుంటారు. కానీ అది ఏంటనే మనకు తెలియడంలేదు? కానీ నేను ఇదే complexలో ఉన్న ఇంకొక గుడికి వెళ్ళేటప్పుడు ఇక్కడున్న రహస్యం ఇంకా లోతుగా పోతుంది.
- Praveen Mohan Telugu















