ఏంటి! రావణునికి ఇలాంటి తమ్ముడు ఉన్నాడా? లోకమంతా పూజించి కొనియాడబడిన వైశ్రవణుడు!
Hey guys, ఈ రోజు మనం కొలంబియాలో ఉన్న పురాతన విగ్రహాలను చూడబోతున్నాము. ఇక్కడ ఉన్న విగ్రహాలు దాదాపు వేయ్యి సంవత్సరాలు పురాతనమైనవి, ఇంకా అవి మన ఇండియన్ culture తో కనెక్ట్ అవుతుంది. ఉదాహరణకి, కొలంబియాలో San Agustin Archeological Parkలో ఉన్న ఈ మర్మమైన SpaceMan ని చూడండి. ఇది సౌత్ అమెరికాలో, city చాలా దూరంగా ఒక మారుమూల ప్రాంతంలో ఉంది, ఇక్కడ వందలాది విగ్రహాలు ఉన్నప్పటికీ ఇది ఒక్కటే మన దృష్టిని ఆకర్షిస్తుంది.
ఎవరు ఇతను? first దీన్ని చూడగానే ఇది ఒక పురాతన వ్యోమగమిగా అంటే ఒక astronaut గా అనిపిస్తుంది, ఎందుకంటే అతను ఒక హెల్మెట్ లేదా కవచం లాంటిది వేసుకుని ఉన్నాడు, ఇంకా అతని కళ్ళు, నోరేమో rectangular షేప్ లో ఉంది, ముక్కు అస్సలు లేదు. అతని తల ఇంకా బాడీ సైజ్ చూడండి, ఇవి రెండు సంబంధం లేకుండా ఉంది, శరీరం చిన్నగా తల చాలా పెద్దగా ఉంది, ఇంకా అతను షూస్ వేసుకున్నట్టు స్పష్టంగా కనిపిస్తుంది.
But చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, అతను ఒక పొడవైన సిలిండర్ లాంటిది పట్టుకుని ఉన్నాడు, అది ఒక tool లాగా ఉంది, చూడండి అది అతని పాదం కిందనుండి భూమి లోపలకి వెళ్తుంది. ఇది చాలా ఇంటరెస్టింగ్ ఐన విషయం, దీని గురించి archeologists and historians దగ్గర ఎలాంటి సమాధానం లేదు. ఇక్కడ ఉన్న టూర్ గైడ్ లకు కూడా దీని గురుంచి తెలియలేదు, అది ఒక musical instrument ఫ్లూట్ అని అంటున్నారు.ఒకవేళ ఇది ఫ్లూట్ అయితే భూమి లోపలికి వెళ్లే విధంగా అంత పొడవుగా ఎందుకు ఉంది?
అలా వెళ్లినా కూడా అందులో నుండి ఎలా music వస్తుంది? ఇది ఏంటని చెప్పండి. ఈ ప్రశ్నకు ఏ ఒక్క సమాధానం లేదు, కానీ మన సంస్కృతిలో దాదాపు ఇలాంటి పోలికలు ఉన్న ఇద్దరు దేవుళ్ళు ఉన్నారని చెప్తున్నారు. మొదటి దేవుడు స్వర్ణాకర్షణ భైరవ. ఈయన తన ఆయుధంతో భూమిలో నుండి direct గా బంగారం తీయడం వల్ల ఈయన్ని బంగారానికి అధి దేవత అని అంటారు. మరొక ముఖ్యమైన దేవత ఎవరంటే, వైశ్రవణ. అతను రాక్షస రాజు రావణుడికి అన్నయ్య వరస అవుతాడు. ఎవరీ వైశ్రవణ?
అతను ఏమి చేస్తాడు? అతను కూడా సంపదలకు అధిపతి, ముఖ్యంగా బంగారానికి. ఈయన దగ్గర కూడా భూమి లోపలికి వెళ్లే విధంగా ఒక ఆయుధం ఉంది. కానీ ఇండియా కొలంబియాల మధ్య పది వేల మైళ్ళ దూరం ఉంది అని గుర్తుపెట్టుకోండి, సో ఒక హిందు దేవత కొలంబియా లో ఎలా చెక్కబడింది?ఇది ఒక valid ఐన ప్రశ్నే, దీనిని మనం logicగా చూసి understand చేసుకుందాం. ఇండియాలో ఈ వైశ్రవణుడిని ఏ విధంగా చూపించారని కొంచం చూడండి. ఈ విగ్రహం దాదాపు పదహారు వందల సంవత్సరాలు పాతది, అతనిని సంపదకు సూచకంగా గుండ్రటి కుండాలాంటి నాభితో ఉన్నాడు చూడండి.
ముఖ్యంగా అతని చేతిలో ఉన్న రాడ్ లాంటి పరికరం సాధారణంగానే భూమిలోకి వెళ్లడమే. ఇప్పుడు మనం ఈ వైశ్రవణుడు థాయిలాండ్ లో ఎలా పరిణామం చెందాడో అని చూదాం. పురాతన కాలంలో హిందూత్వం థాయిలాండ్ వరకు వ్యాపించి ఉండడంతో, వైశ్రవణుడిని ఇక్కడ చాలా సన్నగా, చాలా ఉగ్ర దేవతగా చెక్కారు. కానీ భూమి లోకి వెళుతున్న పరికరం మాత్రం అలాగే వుంది చూడండి. ఇంకా ఆశ్చర్యమైన విషయం ఏంటంటే, అతను థాయిలాండ్ లో ఉన్న ఉడాన్ థాని అనే ప్రాంతానికి official emblem గా అంటే అధికారిక చిహ్నంగా ఈయన్ని పెట్టుకున్నారు.
కేవలం అతని ఆకారం మాత్రమే మారలేదు, అతని పేరు కూడా థాయిలాండ్ లో పరిణామం చెందింది. వైశ్రవణుడిని థాయిలాండ్ లో వైస్సావన అని పిలుస్తారు, పేరు మారినప్పటికీ కానీ కథ మాత్రం ఒక్కటే, సో ఇద్దరు ఒకరే. హిందూత్వం ఇంకా దూరంగా చైనా వరకు వ్యాపించినప్పుడు, వైశ్రవణుడిని ఈ విధంగానే చెక్కారు. ఇవి చైనాలో ఉన్న యునాన్ ప్రావిన్స్‌లో ధరణి స్తంభాలు అని పిలువబడే ఈ పురాతన స్తంభాలు ఉన్నాయి, ఇవి వెయ్యి సంవత్సరాల కంటే పాతవి, ఇక్కడ కూడా మూలాంశాలన్నీ నెమ్మదిగా మారుతున్నప్పటికీ భూమిలోకి వెళుతున్న స్థూపాకార లాంటి పరికరం మాత్రం అలాగే వుంది.ఇది కూడా చైనా Yunnan provinceలో ఉన్న మియిన్ అనే గుడిలో ఉన్న వైశ్రవణుడు యొక్క మరొక విగ్రహం.
తరువాత హిందూత్వం ఇంకా వ్యాపించి జపాన్ వరకు చేరిన తరువాత, అతను ఎలా ఉన్నాడో చూడండి. Archaeologistsలు మరియు historiansలు జపాన్ లో ఉన్న వైశ్రవణుడు ఇంకా హిందూ పురాణాలలో ఉన్న వైశ్రవణుడు ఒక్కటే అని ఒప్పుకున్నారు, థాయిలాండ్ లో అతని పేరు వైశ్రవణుడు నుండి వేస్సావనగా మారి, జపాన్ లో ఇంకొంత మారి బిశామోన్ గా పిలవబడుతున్నాడు. పేర్లు పలువిధాలుగా మారినా కూడా, భూమిలోకి వెళ్లి బంగారం తీసే ఆ సిలిండర్ లాంటి పరికరం మాత్రం మారన్ లేదు.
కానీ ఇక్కడ వైశ్రవణుడు, శరీరం అంతా కవర్ అయ్యే సూట్ లాంటి కవచం వేసుకుని ఉన్నాడు, ఇంకా ఒక హెల్మెట్ షూస్ కూడా వేసుకుని ఉన్నాడు. సో ఇండియా నుండి జపాన్ వరకు వైశ్రవణుడు ఏ విధంగా మార్పు చెందడో అని మనం చూడగలిగాము, దీనికి పూర్తి ఆధారాలు కూడా ఉన్నాయి. మీరు వికీపీడియాలో కి వెళ్ళి వైశ్రవణ అని చూస్తే, మీకు ఈ విషయాలు అన్ని కనపడతాయి, అతని పేరు వైశ్రవణ నుండి వేస్సావన గా, బిశామోన్ గా, బిషమోంటెన్ గా ఎలా మరిందో తెలుస్తుంది. Mainstream historians దీనిని ఒప్పుకుంటున్నారు. Experts లు ప్రముఖమైన హిందు సంస్కృతి అనే ఈ కల్చర్ జపాన్ దగ్గర ఆగింది అని అనుకుంటారు.
- Praveen Mohan Telugu












