నాగరాజు హత్య: బూస్ట్ లో నిద్రమాత్రలు కలిపి ఇచ్చిన జ్యోతి
హైదరాబాద్: నాగకర్ కర్నూల్ పట్టణంలో స్వాతి కేసును మరిచిపోకముందే జ్యోతి ఘటన వెలుగు చూసింది. స్వాతి తన భర్త సుధాకర్ రెడ్డిని హత్య చేసేందుకు యాసిడ్ ను ఉపయోగిస్తే నాగరాజును హత్య చేసేందుకు భార్య జ్యోతి బూస్ట్ లో నిద్రమాత్రలను కలిపింది.
జ్యోతిని నాగరాజు ఐదేళ్ళ క్రితం వివాహం చేసుకొంది. అయితే నాగరాజుతో వివాహం కాకముందే కార్తీక్ తో జ్యోతికి ప్రేమాయణం ఉంది. దీంతో భర్తను అడ్డు తొలగించుకొంటే తమ బంధానికి అడ్డు ఉండదని భావించారు. ఈ మేరకు ప్లాన్ చేశారు.
డిసెంబర్ 19న, కార్తీక్ నిద్రమాత్రలను జ్యోతికి ఇచ్చాడు. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా పోలీసుల దృష్టి నేరాలపై ఉండదని ప్లాన్ చేశారు. డిసెంబర్ 30వ, తేదిన రాత్రి నాగరాజుకు బూస్ట్ లో నిద్రమాత్రలు కలిపి ఇచ్చింది. ఈ మాత్రల కారణంగా మత్తులోకి జారిన నాగరాజును హత్య చేశారు.
అయితే నాగరాజు చనిపోయాడో లేదోనని భావించి దిండును ముఖం పెట్టి ఊపిరి సల్పకుండా చేశారు. మృతదేహన్ని నాగరాజు తన స్నేహితులు నరేష్, యాసిన్, దీపక్ లతో కలిసి కారులో చౌటుప్పల్ సమీపంలో వేశారు. జ్యోతి కాల్ డేటా ఆధారంగా పోలీసులు ఈ కేసును చేధించారు.
నాగరాజు హత్య: బూస్ట్ లో నిద్రమాత్రలు కలిపి ఇచ్చిన జ్యోతి was originally published on Telugunewsonline