తేది : 22.10.2020 పత్రికా ప్రకటన ఎడమ చేత్తో ఇచ్చి కుడి చేత్తో రెట్టింపు గుంజుకోవటమే జగన్ రెడ్డి సంక్షేమం వాహన మిత్ర లబ్దికి రెట్టింపు జరిమానాల పేరుతో టోపీ కింజరపు అచ్చెన్నాయుడు మోటారు వాహన చట్టంలో సవరణలు తీసుకొచ్చి కోటి 31 లక్షల మంది వాహన దారుల మీద భారం వేసి రవాణా రంగాన్ని జగన్ ప్రభుత్వం సంక్షోభంలో నెట్టడం దుర్మార్గం. చంద్రబాబు నాయుడు హయాంలో రవాణా రంగాన్ని బలోపేతం చేసి వాహనదారుల రక్షణకు చర్యలు తీసుకుంటే జగన్ ప్రభుత్వం జరిమానాలతో అస్తవ్యస్తమైన రోడ్లతో అడుగడుగునా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతుంది. వాహనదారులు తప్పనిసరిగా నిబంధనలు పాటించేలా చంద్రబాబునాయుడు హయాంలో చర్యలు తీసుకుంటే జగన్ ప్రభుత్వం జేబులు నింపుకునేందుకు జరిమానాలు పెంచారు. వాహన మిత్ర పేరుతో ఎడమ చేతితో రూ. 10 వేలు ఇస్తూ కుడి చేత్తో రూ.30 వేలు గుంజుకుంటున్నారు. 16 నెలల్లో రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఒక్క రోడ్డు వేయలేదు. కనీసం ఉన్న రోడ్లకు మరమ్మత్తులు చేయకుండా ప్రజల ప్రాణాలు బలి తీసుకుంటున్నారు. జరిమానాలపై చూపుతున్న శ్రద్ద ప్రజల ప్రాణాలపై చూపడం లేదు. టిడిపి హయాంలో ఐదేళ్ళలో రూ.25 వేల కిలోమీటర్ల సిమెంట్ రోడ్లు, 2,500 కిలోమీటర్ల మేర రాష్ట్ర రహదారులు అభివృద్ధి చేయడం జరిగింది. బినామీలకు కాంట్రాక్టులు అప్పగించడంపై, కమిషన్ ల కోసం కాంట్రాక్టులు ధారాదత్తం చేయడంపై చూపుతున్న శ్రద్ద రహదారుల అభివృద్ధిపై చూపడం లేదు. ప్రభుత్వం పెంచిన డీజిల్, పెట్రోల్, డీజిల్, నేచురల్ గ్యాస్ ధరలు తగ్గించి రవాణ రంగాన్ని ఆదుకోవాలి. వాహనదారులపై విధించిన భారీ జరిమానాలను వెంటనే రద్దు చేసి సంక్షోభంలో ఉన్న రవాణా రంగాన్ని ఆదుకోవాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తోంది.. కింజరపు అచ్చెన్నాయుడు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు #acchennaidu #tdp #jagangovernment https://www.instagram.com/p/CGpKP8nMOoO/?igshid=bybrknhlaltu











