#Vishal #TFPC #ALAlagappan #MansoorAliKhan #SVeShekher ప్రముఖ నటుడు విశాల్ అరెస్ట్ గత కొంతకాలంగా తమిళ నిర్మాత మండలిలో నెలకొన్న విబేధాలు ఇప్పుడు తారాస్థాయికి చేరాయి.పైరసీ సినిమాల వెబ్సైట్ తమిళ్‌రాకర్స్‌లో విశాల్‌కు షేర్ ఉందంటూ ప్రముఖ నిర్మాత అజగప్పన్ ఆరోపించారు. మీటూ ఉద్యమం పై స్పందించిన విశాల్ సమస్యలను పట్టించుకోవడం లేదని,పైరసీని అడ్డుకోవడంలో విఫలమయ్యారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఈ నేపధ్యంలో కొందరు తమిళ నిర్మాతలు విశాల్ ను నడిగర్ సంగం లోకి రానివ్వకుండా కార్యాలయానికి తాళం వేశారు.దాంతో ఆగ్రహించిన విశాల్ తాళం పగులకొట్టి లోపలికి వెళ్లే ప్రయత్నం చేయడంతో పరిస్థితి అదుపుతప్పింది. దీనితో రంగంలోకి దిగిన చెన్నై పోలీసలు విశాల్‌ను అరెస్ట్ చేశారు.ఇది ఇలా ఉండగా రేపు కోలీవుడ్ లో ఏకంగా 9సినిమాలు విడుదలవుతుండడంతో ఒకేసారి ఇన్ని సినిమాల విడుదలకు పర్మిషన్ ఎలా ఇస్తారని చిన్న నిర్మాతలు విశాల్ పై మండి పడుతున్నారు.












