seen from China
seen from United States
seen from United States
seen from United States

seen from Malaysia
seen from United Kingdom
seen from United Kingdom
seen from China

seen from United States

seen from United States

seen from United States
seen from Netherlands
seen from United Kingdom

seen from United States
seen from United States
seen from United States
seen from China

seen from Malaysia
seen from United States
seen from United States
తిరుపతి శ్రీగోవిందరాజస్వామి ఆలయం లో నిత్యాన్నదానం ప్రారంభించిన టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర రెడ్డి, ఈవో ఏవీ ధర్మారెడ్డి
అన్నదాన కార్యక్రమాన్ని మరింత విస్తరిస్తాం…టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర రెడ్డి ఈ రోజు నుంచి ప్రతి రోజు రెండువేల మంది భక్తులకు సరిపడేలా శ్రీగోవింద రాజస్వామి ఆలయం వద్ద నిత్యాన్నదానం ఏర్పాటు చేయడం జరిగింది… తిరుమలలో రోజూ లక్ష మంది నిత్యాన్నదాన పథకం ద్వారా భోజనం చేస్తున్నారు. గతంలో నేను టీటీడీ పాలక మండలి అధ్యక్షుడుగా ఉన్నప్పుడు తిరుమల వచ్చిన ప్రతి భక్తుడూ అన్నదానంలో భోజనం తినే ఏర్పాటు చేశాం. అదే సమయంలో తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయం వద్ద కూడా నిత్యాన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించాం.. తర్వాత ఒంటిమిట్టలో కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది.. ఈ రోజున తిరుపతి గోవిందరాజ స్వామి ఆలయం వద్ద ప్రారంభించడం సంతోషంగా ఉంది… ఇక్కడ ప్రతి రోజూఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అన్నదాన కార్యక్రమం కొనసాగుతుంది…
Read the full article
అట్టహాసంగా తిరుపతి ఆవిర్భావ వేడుకలు ప్రారంభం
పుణ్యక్షేత్రంలో అలరించిన ఆధ్యాత్మిక శోభయాత్ర ఇక ప్రతి ఏడాది ఫిబ్రవరి 24న ఆచారంగా తిరుపతి పుట్టినరోజు టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి కనువిందు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలను తలపించేలా తిరుపతి 894వ ఆవిర్భావ వేడుకలు శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా టీటీడీ ఆధ్వర్యంలో చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తిరుపతి గోవిందరాజస్వామివారి ఆలయ ప్రాంగణంలో ఉత్సవాలను ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ జగద్గురువు రామానుజాచార్యులు తిరుపతిని 1130వ సంవత్సరం ఫిబ్రవరి 24న శంకుస్థాపన చేసి గోవిందరాజపురంగా నామకరణ చేశారని అనంతరం నేడు తిరుపతిగా భాసిల్లుతున్నదన్నారు. ఇక నుంచి ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 24న సాంప్రదాయంగా, ఆచారంగా తిరుపతి పుట్టిన రోజు వేడుకను టీటీడీ క్యాలెండర్ లో భాగం చేస్తామని వెల్లడించారు. తిరుపతి నగరం ప్రపంచానికి ఓ ఆదర్శ నగరం కావాలని ఆకాంక్షించారు. టీటీడీ ఈవో ఎవి ధర్మారెడ్డి మాట్లాడుతూ, ప్రపంచ నలుమూలల నుంచి శ్రీవారి దర్శనానికి తిరుపతి మీదుగా తిరుమలకు చేరుకుంటారని తెలిపారు. భక్తులకు మరింత ఆధ్యాత్మిక ఆనందాన్ని కలిగించేందుకు తిరుపతి నగరాన్ని కూడా తిరుమల తరహాలో సుందరంగా తీర్చిదిద్దేలా చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. అలరించిన ఆధ్యాత్మిక శోభా యాత్ర తిరుపతి ఆవిర్భావ వేడుకల సందర్భంగా చైర్మన్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, శోభాయాత్రను ప్రారంభించారు. టీటీడీ డీపీపీ, అన్నమాచార్య ప్రాజెక్టు, దాస సాహిత్య ప్రాజెక్టుకు చెందిన వందలాది మంది కళాకారులు చెక్క భజనలు, కోలాటాలతో ఆడుతూ, గోవింద నామ సంకీర్తనలు, వేదపండితులు మంత్రోచ్చారణల మధ్య శోభాయాత్రను నిర్వహించారు. కళాకారుల వివిధ దేవతామూర్తుల, పౌరాణిక వేషధారణలు విశేషంగా ఆకర్షించాయి.
Read the full article
రూ.5,141.74 కోట్లతో వార్షిక బడ్జెట్
– ఉద్యోగులకు ఇళ్లస్థలాలు ఇచ్చిన ముఖ్యమంత్రివర్యులకు కృతజ్ఞతలు – శ్రీవారి ఆశీస్సులతో మహిళలకు మంగళసూత్రాలు – కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ సిబ్బందికి వేతనాలు పెంపు – టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ భూమన కరుణాకరరెడ్డి తిరుమల, 2024 జనవరి 29: 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.5,141.74 కోట్లతో వార్షిక బడ్జెట్‌ను ఆమోదించినట్టు టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ భూమన కరుణాకరరెడ్డి తెలిపారు. ఛైర్మన్ అధ్యక్షతన సోమవారం తిరుమల అన్నమయ్య భవనంలో ధర్మకర్తల మండలి సమావేశం జరిగింది. ఇందులో ముఖ్య నిర్ణయాలు ఇలా ఉన్నాయి. – ధర్మప్రచారంలో భాగంగా బంగారు మంగళసూత్రాలను తయారుచేసి శ్రీవారి పాదాల చెంత ఉంచి ఆశీస్సులు పొందిన తరువాత భక్తులకు విక్రయించేందుకు నిర్ణయం. ఇవి 5 గ్రాములు, 10 గ్రాముల్లో ఉంటాయి. వీటిని నాలుగు లేదా ఐదు డిజైన్లలో తయారు చేస్తాం. వీటితోపాటు లక్ష్మీకాసులను కూడా తయారు చేయాలని నిర్ణయం. వీటిని లాభాపేక్ష లేకుండా విక్రయిస్తాం. గతంలో 32 వేల మందికి సామూహిక వివాహాలు జరిపించినపుడు మంగళసూత్రాలు అందిస్తే ఏ ఒక్కరూ మతం మారలేదు. మహిళలకు స్వామివారి కానుక ఇది. – టీటీడీ ఉద్యోగుల ఇళ్లస్థలాల కోసం వడమాలపేట మండలం పాదిరేడు అరణ్యం వద్ద అదనంగా కేటాయించిన 132.05 ఎకరాల స్థలంలో గ్రావెల్ రోడ్డు ఏర్పాటుకు టెండరు ఆమోదం. – దాదాపు 30 ఏళ్లుగా ఇళ్లస్థలాల కోసం ఎదురుచూసిన టీటీడీ ఉద్యోగుల కలను సాకారం చేసిన మాన్య ముఖ్యమంత్రివర్యులు శ్రీవైఎస్.జగన్మోహన్రెడ్డిగారికి టీటీడీ పాలకమండలి కృతజ్ఞతలు తెలియజేస్తోంది. – టీటీడీలోని వివిధ విభాగాలలో కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ విధానంలో పనిచేసే వారికి వేతనాలు పెంచాం. – టీటీడీ పోటు విభాగంలోని 70 మంది కాంట్రాక్టు లడ్డూ ట్రే లిఫ్టింగ్ సెమి స్కిల్డ్, అన్‌స్కిల్డ్ కార్మికులను స్కిల్డ్ కార్మికులుగా మార్పు చేసి వారి వేతనాలను రూ.12,523/- నుండి రూ.15 వేలకు పెంచేందుకు ఆమోదం. – అన్నదాన విభాగంలో 138 మంది క్లీనర్లు, 79 మంది వంట మనుషులను స్కిల్డ్ కేటగిరీలోకి మార్చి వారి వేతనాలను రూ.17 వేల నుండి రూ.22 వేలకు పెంపు. – ఎలక్ట్రికల్, వాటర్ వర్క్స్ విభాగాల్లో పనిచేసే కార్మికులను అన్‌స్కిల్డ్ నుండి స్కిల్డ్ కేటగిరీలోకి మార్పు. – శ్రీ వెంకటేశ్వర శిల్ప కళాశాలలో వివిధ దేవతామూర్తుల శిల్పాలను తయారుచేస్తున్న శిల్పుల కళానైపుణ్యాన్ని ప్రోత్సహించడంలో భాగంగా, వారి వేతనాల పెంపుదలకు ఆమోదం. – కలంకారి కళలో నిపుణులైన శ్రీ మునస్వామిరెడ్డి వేతనం రూ.25 వేల నుండి రూ.39 వేలకు పెంపు. – టీటీడీ అనుబంధ, విలీన ఆలయాల్లో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్టు అర్చకులు, సంభావన అర్చకుల వేతనాలను రూ.26 వేల నుండి రూ.31 వేలకు పెంచేందుకు ఆమోదం. – టీటీడీ స్టోర్‌లో పనిచేసే 9 మంది వర్కర్లకు వారి వేతనం రూ.9 వేల నుండి రూ.15 వేలకు పెంచడం జరిగింది. – ఎస్వీ ఉన్నత వేదాధ్యయన సంస్థ ద్వారా సేవలందిస్తున్న క్రమాపాఠీలకు రూ.16 వేల నుండి రూ.22 వేలకు, ఘనాపాఠీలకు రూ.17 వేల నుండి రూ.25 వేలకు సంభావన పెంపు. – అదేవిధంగా, 1400 మంది వేదపారాయణదారులకు ప్రస్తుతం ఇస్తున్న పెన్షన్ రూ.10 వేల నుండి రూ.12 వేలకు పెంపు. – హైందవ సనాతన ధర్మప్రచారంలో భాగంగా వేదవిద్యను వ్యాప్తి చేసేందుకు టీటీడీ ఆధ్వర్యంలో ఆరు వేద పాఠశాలలు నడుస్తున్నాయి. ఈ పాఠశాలల్లో విధులు నిర్వహిస్తున్న 51 మంది సంభావన అధ్యాపకుల వేతనాలను రూ.35 వేల నుండి రూ.54 వేలకు పెంచేందుకు ఆమోదం. – టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న 26 స్థానికాలయాలు, విలీనం చేసుకున్న 34 ఆలయాల్లో భక్తుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తగినంత సిబ్బందితో ఆలయ కైంకర్యాలు తదితర సేవలు నిర్వహించేందుకు నూతన పోస్టులు సృష్టించేందుకు ప్రభుత్వ ఆమోదానికి పంపేందుకు నిర్ణయం. ఇందులో భాగంగా టీటీడీ అనుబంధ ఆలయాల్లో 227 వేదపారాయణందారు, అధ్యాపక, మేళం సిబ్బంది పోస్టులు, టీటీడీ విలీనం చేసుకున్న ఆలయాల్లో 288 అర్చక, పరిచారిక, పోటు వర్కర్, ప్రసాదం డిస్ట్రిబ్యూటర్, వేదపారాయణందారు, మేళం సిబ్బంది పోస్టులు ఉన్నాయి. – టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న స్విమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఒక్క తిరుపతి జిల్లా మాత్రమే కాకుండా యావత్ రాయలసీమ ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందిస్తోంది. ఈ ఆసుపత్రిలో వైద్యసేవలు పొందుతున్న రోగుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న 300 పడకలను 1200 పడకలకు పెంచుతున్నాం. అదేవిధంగా, 30 ఏళ్ల క్రితం నిర్మించిన ఆసుపత్రి భవనాలను పెరుగుతున్న రోగుల అవసరాలకు అనుగుణంగా ఆధునీకరించేందుకు రూ.148 కోట్లతో టెండరు ఆమోదం. – తిరుమలలోని ఆకాశగంగ నుండి ఔటర్ రింగ్ రోడ్డు వరకు రెండు వరుసల రహదారిని నాలుగు వరుసల రహదారిగా అభివృద్ధి చేసేందుకు రూ.30.71 కోట్లతో టెండరు ఆమోదం. – తిరుమల శ్రీవారి దర్శనానికి దేశవ్యాప్తంగా విచ్చేసే భక్తుల సౌకర్యార్థం రూ.2.28 కోట్లతో సప్తగిరి సత్రాలు-6, 7 బ్లాకుల అభివృద్ధి పనుల కోసం టెండరు ఆమోదం. – తిరుమలలోని శ్రీవేంకటేశ్వర, ఆదిశేషు, శంకుమిట్ట విశ్రాంతి గృహాల అభివృద్ధి మరియు పెయింటింగ్ పనుల కోసం రూ.10.90 కోట్లు మంజూరుకు పరిపాలన అనుమతికి ఆమోదం. – ఆకాశరాజు నిర్మించిన అతిప్రాచీనమైన నారాయణవనంలోని శ్రీభద్రకాళీ సమేత వీరభద్రస్వామివారి ఆలయానికి రాజగోపురం, రాతిప్రాకారం నిర్మాణానికి రూ.6.90 కోట్లు మంజూరుకు ఆమోదం. – రాష్ట్ర విభజన అనంతరం, ఆంధ్రప్రదేశ్‌లో చిన్నపిల్లలకు ప్రత్యేకించి వైద్యసేవలు అందించాలన్న ముఖ్యమంత్రివర్యులు గౌ. శ్రీ వైఎస్.జగన్ మోహన్‌రెడ్డి సూచనల మేరకు తిరుపతి నగరంలో శ్రీవారి పాదాల చెంత శ్రీ పద్మావతి చిన్నపిల్లల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ఏర్పాటు చేయడమైనది. భారతదేశంలోనే చిన్నారులకు సంబంధించి ప్రత్యేక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిగా ఆవిర్భవించనున్న ఈ ఆసుపత్రిని ఇకపై శ్రీ పద్మావతి ఇనిస్టిట్యూట్ ఆఫ్ చైల్డ్ హెల్త్‌గా వ్యవహరించడం జరుగుతుంది. – టీటీడీ పాలనా వ్యవహారాలు మరింత వేగవంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు గాను సరికొత్త సాంకేతిక పరిజ్ఞానంతో ఐదేళ్ల కాలపరిమితికి గాను ఓరాకిల్ ఫ్యూజన్ క్లౌడ్ ఇఆర్పి ప్రవేశపెట్టేందుకు ఆమోదం. – తిరుమల అన్నమయ్య భవనం సమావేశ మందిరం ఆధునీకరణలో భాగంగా దృశ్యశ్రవణ అనుసంధాన పరికరాల ఏర్పాటుకు ఆమోదం. అనంతరం తిరుపతి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు శ్రీ భాస్కర్ రెడ్డి అధ్యక్షతన తిరుమల, తిరుపతి మీడియా ప్రతినిధులతో ఏర్పాటైన శ్రీవాణి ట్రస్టు నిజనిర్ధారణ కమిటీ తన నివేదికను టీటీడీ ఛైర్మన్ శ్రీ భూమన కరణాకరరెడ్డికి, ఈవో శ్రీ ఏవి.ధర్మారెడ్డికి అందజేసింది. ఈ సమావేశంలో టీటీడీ ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి, పలువురు బోర్డు సభ్యులు, జెఈవోలు శ్రీమతి సదా భార్గవి, శ్రీ వీరబ్రహ్మం పాల్గొన్నారు. (టీటీడీ బడ్జెట్ – 2024-25 కాపీ జతపరచడమైనది) టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.
Read the full article