సచిన్ కుమార్తె సారాకు వేధింపులు: బెంగాల్ యువకుడి అరెస్ట్
ముంబై: క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్‌ను వేధించిన వ్యక్తిని ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు పశ్చిమ బెంగాల్‌లోని మిడ్నాపూర్‌కు చెందిన దేవ్ కుమార్‌గా గుర్తించారు. వేధింపులకు పాల్పడటమే కాకుండా సారాను కిడ్నాప్ చేస్తానని నిందితుడు బెదిరించినట్టు పోలీసులు తెలిపారు. సచిన్ కుమార్తె ఇచ్చిన ఫిర్యాదు మేరకు అతడిని అరెస్ట్ చేశారు.
తనకు సారాతో పెళ్లి చేయకపోతే ఆమెను కిడ్నాప్ చేస్తానని సచిన్ ఇంటికి ఫోన్ చేసి బెదిరించాడని పోలీసులు వెల్లడించారు. డిసెంబర్ 2న చివరిసారిగా ఫోన్ చేశాడi. డిసెంబర్ 5న బాంద్రా పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.
టెలిఫోన్ టవర్ లోకేషన్ ఆధారంగా నిందితుడిని పట్టుకున్నారు. నిందితుడి మానసికస్థితి సరిగా లేదని అతడి కుటుంబ సభ్యులు తెలిపారు. అతడిని ముంబైకి తీసుకొచ్చి కోర్టులో హాజరుపరచనున్నారు.
సచిన్ కుమార్తె సారాకు వేధింపులు: బెంగాల్ యువకుడి అరెస్ట్ was originally published on Telugunewsonline











