చేసే ప్రతి పనికి టెక్నాలజీ అడాప్ట్ చేసుకుంటూ,డెవలప్ మెంట్ ముఖ్య నినాదంగా అడుగేస్తూ అమెరికా ప్రెసిడెంట్ చేతనే శభాష్ అని ప్రశంసలు పొందిన ఏకైక సీఎం చంద్రబాబు నాయుడు. అందుకే అభిమానులు ముఖ్యంగా హైదరాబాద్ ఐటీ ఉద్యోగులు ఆయన్ని హైటెక్ సీఎం అని,సీఈఓ చీఫ్ మినిస్టర్ అని ముద్దుగా పిలుస్తుంటారు. గుండు పిన్నీసు దగ్గరనుంచి గాల్లో ఎగిరే ఫ్లైట్స్ దాకా అన్నిట్లో టెక్నాలజీ కావాలనే చంద్రబాబు నాయుడు ఒక్క విషయంలో అప్ గ్రేడ్ అవడం తప్పంటున్నాడు. పాత పద్దతే ముద్దు అంటున్నాడు. అవే ఆయన్ని గెలిపించిన ఈవీఎంలు. కానీ ఇప్పుడెందుకో అవి వద్దు బ్యాలెట్ పేపరే ముద్దు అని అంటున్నాడు. Chandrababu Naidu Sensational Comments About EVM Tampering |AP Elections |Peoplesposttv| అసలు బాబు ఎందుకు బ్యాలెట్ పేపర్ భేష్ అంటున్నారు? ఈవీఎంలు అనగానే ఎందుకు భయపడుతున్నారు? ప్రతి దాన్ని క్షుణ్ణంగా అబ్సర్వ్ చేసి తీవ్రంగా పరిశీలిస్తే గాని ఓ నిర్ణయానికి రాని బాబు … ఏ ఎనాలిసిస్ ప్రకారం ఈవీఎంలకు నో చెప్తున్నారు. బ్యాలెట్ పేపర్లపై ఓటింగ్ అనేది మూస విధానం. శ్రమతో కూడుకున్నది, కౌంటింగ్ కు చాలా సమయం పడుతుంది,రిగ్గింగ్ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అనే ఉద్దేశంతోనే ఎలక్ట్రానిక్ వోటింగ్ పద్దతిని ప్రవేశపెట్టింది. సేఫ్టీగా ఉంటుందని ప్రవేశపెట్టిన ఈవీఎంలతో కూడా జరగవల్సిన అనర్థాలు జరుగుతున్నాయి. పెరిగిన టెక్నాలజీ వల్ల అసాధ్యం సుసాధ్యం అవుతుంది,తిమ్మి బమ్మి కూడా అవుతుంది. అలాంటప్పుడు ఓటింగ్ జరిగినప్పుడు విజేత అయిన వ్యక్తి ఫలితాల టైముకు అపజేతగా మారలేడా? అధికారంలో ఉంటూ వ్యవస్థల్నే శాసిస్తూన్న వ్యక్తులు ఈ చిన్న గిమ్మిక్ చేయలేరా! బహుశా ఇదే … ది గ్రేట్ బాబుగారు చేసిన ఎనాలసిస్ అయిఉంటుంది. Chandrababu Naidu Sensational Comments About EVM Tampering |AP Elections |Peoplesposttv| చ్చే’ అని కొట్టి పారెయ్యడానికి,’ఛి’ అని పెదవి విరవడానికి ఇవి ఊహాగానాలు కావు. కంటికి కనబడుతున్న నిజాలు అని టీడీపీ ఆధారాలు చూపెడుతుంది కూడా. ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఈవీఎంలపై వచ్చిన పిర్యాదుల్ని తెదేపా జాగ్రత్తగా పరిశీలించింది. తెలంగాణ, కర్ణాటక ఎన్నికల్లో లక్షలాది ఓట్లు గల్లంతు అవడాన్నిఆ పార్టీ నేతలు విశ్లేషిస్తున్నారు. ఇటీవల ముగిసిన తెలంగాణ ఎన్నికల్లో భారీ ఎత్తున టాంపరింగ్ జరిగిందంటూ ప్రతిపక్ష కాంగ్రెస్ సభ్యులు ఆరోపించారు,గవర్నర్ దృష్టికి తీసుకువెళ్లారు. కర్ణాటక ఎన్నికల్లో ముస్లిం ఓటర్ల పేర్లు తొలగించడం, అనేక మందికి గుర్తింపు కార్డులు లేకపోవడంపై జాతీయ మీడియాలో వచ్చిన కథనాలను తెలుగుదేశం నేతలు ప్రముఖంగా ప్రస్తావిస్తున్నారు. అంతేకాదు, ఉత్తర్‌ప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో కూడా ముస్లిం ఓట్ల తొలగింపుపై ఆందోళన నెలకొన్న అంశాలపైనా ముఖ్యమంత్రి దృష్టి సారించారు. దీంతో సీఎం, ముస్లింలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని పార్టీ నేతలకు చంద్రబాబు ఆదేశాలు జారీచేసినట్టు విశ్వసనీయ సమాచారం. నిజానికి మొదటినుంచే చంద్రబాబు నాయుడు ఈవీఎంల ద్వారా ఓటింగ్‌ను వ్యతిరేకిస్తూ వస్తున్నారు. ఈవీఎంలు అంత నమ్మకమైనవి కావని,అవకతవకలు జరిగే అవకాశాలు ఉన్నాయని ఆయన వాదన. ఇదే విషయాన్ని గతంలోనూ చాలాసార్లు జాతీయ స్థాయికి తీసుకెళ్లారు కానీ లాభం లేకపోయింది. కానీ ఆయా రాష్ట్రాల్లో జరుగుతున్న పరిణామాల్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్న బాబు, వచ్చే సార్వత్రిక ఎన్నికల్లోనైనా మళ్లీ పాతపద్ధతిలోనే ఓటింగ్ నిర్వహించేలా ఇప్పటి నుంచే పోరాడాలని నిర్ణయించి ఆ మేరకు చర్యలు చేపట్టారు. అంతేకాదు,జాతీయ స్థాయిలో వివిధ పార్టీలను కలుపుకొని వెళ్లేలా కార్యాచరణని కూడా సిద్ధంచేస్తున్నారు. Chandrababu Naidu Sensational Comments About EVM Tampering |AP Elections |Peoplesposttv| పైకి,ఇదంతా బాబు ఈవీఎంల సెక్యూరిటీ ని ప్రశ్నిస్తూ చేస్తున్న పోరాటంలా కనిపిస్తుంది కానీ,భయమంతా కేంద్రంలో బీజేపీ ఉండటం,రాష్ట్ర ప్రతిపక్షంలో వారి మిత్రపక్షాలు ఉండటం రాజకీయ అభిమానులు చెవులు కొరుక్కుంటున్నారు. ఈవీఎంల మీద బాబు చేస్తున్న పోరాటం ఏ మేరకు సఫలీకృతమౌతుందో వేచి చూడాలి. Chandrababu Naidu Sensational Comments About EVM Tampering |AP Elections |Peoplesposttv| Welcome to Peoplespost Media Channel,Enjoy Here Latest Political Updates Entertainment,Health,Latest Updates in Our Official Youtube Channel For More Latest Updates Please Subscribe here Youtube Channel https://www.youtube.com/channel/UCNgm... Website: https://peoplespost.news/te/ Facebook:https://www.facebook.com/PeoplesPostE... Linkedin:https://www.linkedin.com/in/kishore-b... Reddit:https://www.reddit.com/user/peoplespost Twitter:https://twitter.com/peoplespost1 Google+:https://plus.google.com/u/0/102930886... Tumblr:https://www.tumblr.com/blog/peoplespost