నోటి దుర్వాసన పోవాలంటే Bad smell from mouth Home remedies - Bad breath causes Controlling Tips
నోటి దుర్వాసన సమస్య చాలా మందిని వేధిస్తూ ఉంటుంది. దీని వల్ల నలుగురిలో మాట్లాడాలంటే చాలా ఇబ్బంది పడుతుంటారు. దీనిని వైద్యపరిభాషలో హెలటోసిస్ అంటారు. శరీరంలోని రుగ్మతలు దంతాలను సరిగా శుభ్రం చేసుకోకపోవడం వల్ల నోటి నుండి దుర్వాసన వస్తుంది. కొన్ని చిట్కాలు పాటించి ఈ సమస్య నుండి బయట పడవచ్చు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం నిమ్మ రసం & బేకింగ్ సోడా నిమ్మరసంలో ఉప్పు లేదా బేకింగ్ సోడా వేసి ఆ నీటిని పుక్కిలించాలి. ఇలా తరచూ చేస్తూ ఉంటే నోటి దుర్వాసన పోతుంది. లవంగాలు లవంగాలు నోటి దుర్వాసనను పోగొట్టేందుకు బాగా పనిచేస్తాయి. తరచూ లవంగాలు నములుతూ ఉంటే నోరు ఫ్రెష్ గా ఉంటుంది. సోంపు గింజలు నోటి దుర్వాసన తరిమికొట్టడంలో సోంపు గింజలు దివ్యౌషధంగా పనిచేస్తాయి. దీనిలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ మైక్రోబయల్ గుణాలు నోటిలోని దుర్వాసన కలిగించే బ్యాక్టీరియా నిర్మూలిస్తుంది.రోజూ కొన్ని సోంపు గింజలను తినడం లేదా వీటిని నీటిలో మరిగించి ఆ నీటిని పుక్కిట పట్టడం చేస్తే మంచి ఫలితం కనిపిస్తుంది. గ్రీన్ టీ గ్రీన్ టీ లో పోలిఫినాయిల్ (polyphenols) అనే కంపౌండ్స్ ఉంటాయి. ఇవి నోటి లాలాజలంలో ఉన్న చేదు బ్యాక్టీరియాను నాశనం చేసి నోటి దుర్వాసన తొలగించడంలో ముఖ్యపాత్ర పోషిస్తాయి. కాఫీ అలవాటు ఉన్నవారు దాన్ని మానుకొని గ్రీన్ టీ తాగడానికి అలవాటు చేసుకోవడం ఉత్తమం. జామ ఆకులు జామ ఆకులను వేడి నీటిలో మరిగించి ఆ నీటిలో కొంచెం ఉప్పు కలిపి ఆ నీటిని తరచుగా పుక్కలిస్తే నోరు తాజాగా మారి దుర్వాసన రాకుండా ఉంటుంది. వేపపుల్ల & గానుగ పుల్ల వీలున్నవారు రోజు వేప లేదా గానుగ పుల్లతో పళ్ళు తోమడంవల్ల వీటిలోని యాంటీ బాక్టీరియల్ గుణాలు నోటిలోని బ్యాక్టీరియాను నిర్మూలిస్తాయి. అంతేకాకుండా దంతాలు కూడా గట్టిపడతాయి. పుదినా & తులసి ఆకులు తరచూ పుదీనా తులసి ఆకులు నములుతుంటే నోరు తాజాగా ఉంటుంది. ఈ చిట్కాలు పాటించడంతో పాటు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి భోజనం చేసిన తర్వాత నీటితో పుక్కిలించాలి. నీటిని ఎక్కువగా తాగాలి.ఆల్కహాల్ ధూమపానానికి దూరంగా ఉండాలి.ఉదయాన్నే పళ్లు తోముకునేటప్పుడు నాలుకను టంగ్ క్లీనర్ తో బాగా శుభ్రపరుచుకోవాలి.బ్రెష్ ని ఎక్కువ రోజులు వాడకుండా మారుస్తూ ఉండాలి. ఈ వీడియో కమ్ Read the full article














