రేవంత్ రెడ్డి ఓ ఐరెన్ లెగ్ .. ఎక్కడ ఉంటే అక్కడ పార్టీ నాశనం!
హైదరాబాద్ శివారులోని గండిపేట చెరువుకు ఎగువన జన్వాడ గ్రామంలో జీవో 111ను ఉల్లంఘించారనే ఆరోపణలపై మంత్రి కేటీఆర్ నోటీసులు అందుకున్న సంగతి తెలిసిందే కదా! ఈ పిటిషన్‌ను కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి దాఖలు చేశారు అయితే ఎంపీ రేవంత్ రెడ్డి పైన టీఆర్ఎస్ నేతలు ఓ రేంజ్ ఫైర్ అయ్యారు. టీఆర్ఎస్ శాసనసభాపక్ష కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నేతలు కర్నె ప్రభాకర్, బాల్క సుమన్ ఎంపీ రేవంత్ రెడ్డి పై విరుచుక పడ్డారు. మంత్రి కేటీఆర్ కి ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సపోర్ట్! ఎదుటివారి పైన బురుదజల్లడం రేవంత్ రెడ్డికి అలవాటేనని, ఓ పెయింటర్ స్థాయి నుంచి కోట్లాది ఆస్తులు ఎలా సంపాదించగలిగారని చెప్పాలని బాల్క సుమన్ ప్రశ్నించారు. భారీ అక్రమాలు చేశాడు కాబట్టే రేవంత్ రెడ్డి ఈ స్థాయిలో ఉన్నాడని బాల్క సుమన్ అన్నారు. అంతేకాకుండా గోపన్‌పల్లిలో దళితుల భూములను రేవంత్ లాక్కున్నారని, రేవంత్ రెడ్డి బంధవులపైన భూములు ఉన్నాయని సుమన్ ఆరోపించారు. ఇక రేవంత్ రెడ్డి ఓ ఐరెన్ లెగ్ అని అయన ఎక్కడ ఉంటే అక్కడ పార్టీ నాశనం అని సుమన్ ఆరోపించారు. ఇక ఇదే మీడియా సమావేశంలో కర్నె ప్రభాకర్ మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఉండడం పట్ల ఒకసారి పునరాలోచించుకోవాలని అన్నారు. రేవంత్ రెడ్డి ఎన్నోసార్లు జైలుకి వెళ్లి వచ్చారని ఈ సందర్భంగా గుర్తు చేశారు కర్నె ప్రభాకర్.. ప్రజలకి నిజాలు తెలియాలి కాబట్టి మీడియా మందుకు వచ్చినట్టుగా వెల్లడించారు. ఇక ఫామ్ హౌస్ వ్యవహారంపై ఇప్పటికే మంత్రి కేటీఆర్ స్పష్టత ఇచ్చారని, దీనిపైన రేవంత్ కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని వాఖ్యానించారు. మరిన్ని అప్డేట్స్ పొందడానికి మా టెలిగ్రామ్ ని ఫాలో అవ్వండి! Read the full article















