170th week of 'Swachh Pudimadaka' Program By Brandix India బ్రాండిక్స్ ఆధ్వర్యంలో ' స్వచ్ఛ పూడిమడక' విజయవంతంగా 170 వ వారం పూడిమడక గ్రామంతో పాటు బీచ్ ను పరిశుభ్రంగా ఉంచుతూ.. పరిసరాలను స్వచ్చంగా తీర్చిదిద్దేందుకు మా బ్రాండిక్స్ సంస్థ చేపట్టిన ‘ స్వచ్చ పూడిమడక ‘ కార్యక్రమం 170 వారాలు విజయవంతంగా పూర్తి చేసుకున్నదని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. మన ఊరి శుభ్రత – మనందరి భాద్యత’ నినాదంతో 2019 నవంబర్ లో ‘స్వచ్చ పూడిమడక’ ను ప్రారంభించాము. మన వీధి, ఊరు శుభ్రత పట్టించుకోకపొతే ఎంతో నష్టం కలుగుతుంది. ఇంట్లో చెత్తను వీధిలో పడేస్తే దోమలు చేరి, దుర్వాసన పెరిగి అది ఇళ్ళకు వ్యాప్తి చెంది మొత్తం గ్రామస్తుల ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపిస్తుంది..అందుకే వీధి బాగుంటేనే ఇల్లు బాగుంటుందనే అంశంపై పూడిమడక గ్రామస్తులకు ప్రత్యేక అవగాహన కలిగించడం జరిగింది. నేడు పూడిమడక యువత, గ్రామస్తులు తమ ఇళ్ళతో పాటు వీధులను శుభ్రంగా ఉంచుకుంటున్నారు. మా బ్రాండిక్స్ సంస్థ ఈ కార్యక్రమం కోసం ప్రత్యేకంగా నియమించిన బృందం స్వచ్చ పూడిమడక కోసం శ్రద్ధతో పనిచేస్తున్నారు. వీరు గ్రామంలో చెత్తను ఎప్పటికప్పుడు తరలించి ..ఆ ప్రాంతాల్లో బ్లీచింగ్ వేయడం ద్వారా పరిసరాలను శుభ్రంగా ఉంచుతున్నారు. ‘స్వచ్చ పూడిమడక’ కోసం నేను ప్రత్యక్షంగా బీచ్ మరియు గ్రామాన్ని తరుచూ సందర్శిస్తూ పర్యవేక్షణ చేస్తున్నాను. గ్రామంలో యువతను ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేసేందుకు గాను వారిలో చైతన్యం తీసుకురావడం జరిగింది. ‘స్వచ్చ పూడిమడక’ సహకరిస్తున్న గ్రామస్తులకు, యువతకు ఇందులో పాల్గొంటున్న పారిశుద్ధ్య కార్మికులకు మా బ్రాండిక్స్ సంస్థ తరుపున ప్రత్యేక కృతజ్ఞతలు. ‘ స్వచ్చ పూడిమడక ‘ ను ఆదర్శంగా తీసుకుని పారిశుధ్య ఉద్యమంలో ప్రజలు అందరూ భాగస్వాములు కావాలని కోరుకుంటున్నాను. ఊరు బాగుంటే ..మన అందరి ఆరోగ్యం బాగుంటుందనే నినాదాన్ని.. కార్యాచరణలో అమలు చేయాలని అందరికి విజ్ఞప్తి చేస్తున్నాను. దొరస్వామి భారతీయ భాగస్వామి, బ్రాండిక్స్ ఇండియా అపెరల్ సిటీ,విశాఖపట్నం. #DoraSwamyPC #BrandixIndia #PachipalaDoraswamy #BrandixDoraswamy #PCDoraswamy https://www.instagram.com/p/CNgdMrGnWiY/?igshid=164llyxtlhinr












