పిస్తా పప్పు ఉపయోగాలు తెలిస్తే ఆశ్చర్య పోతారు Amazing Benefits of Pistachio (Pista)
మనం తినే డ్రై ఫ్రూట్లలో మన అందరికీ ఎంతో ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ పిస్తా. పిస్తాపప్పు పశ్చిమ ఆసియా నుండి దిగుమతి అయ్యే పప్పు. పశ్చిమ ఆసియాలో ఉత్పత్తి అయినప్పటికీ ఇది మధ్యధరా ప్రాంతంలో అధికంగా లభిస్తూ ఉంటుంది. పోషకవిలువలు అధికంగా ఉండే ఈ పిస్తాపప్పు దాని పైన మందమైన డొల్లతో కప్పబడి ఉంటుంది. పైన ఉండే ఆ డొల్లను తొలగిస్తే లోపల పిస్తాపప్పు ఆకుపచ్చ లేదా పసుపు రంగులో ఉంటుంది. ఈ పిస్తాలో పోషక పదార్థాలు ఎక్కువ. ఇందులో పొటాషియం అత్యధికంగా లభిస్తుంది. ఇది మన శరీరంలోని ద్రవాల నియంత్రణకు ఎక్కువగా పనిచేస్తుంది. మిగిలిన డ్రైఫ్రూట్స్ తో పోలిస్తే పిస్తాలో క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి. గుండె జబ్బులకు మరియు కాన్సర్ నివారణకు ... పిస్తాలో గుండె జబ్బులను తగ్గించే గుణం అధికంగా ఉంటుంది. పిస్తాపప్పుని ఈరోజు తీసుకుంటే గుండె వత్తిడి నుండి కాపాడుకోవచ్చని సైంటిస్టులు చెబుతున్నారు. పిస్తా మన శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ మరియు ATL ను తగ్గిస్తుంది. మంచి కొలెస్ట్రాల్ ను పెంచుతుంది. గుండె జబ్బులను నిరోధించడంలో పిస్తా ముఖ్య పాత్రను వహిస్తుంది. అమెరికాలోని ఒక యూనివర్సిటీలో జరిగిన సర్వే ప్రకారం పిస్తాపప్పును తరచుగా తినే వాళ్ళు క్యాన్సర్ బారిన తక్కువగా పడతారట. కంటి ఆరోగ్యానికి పిస్తా .. పిస్తాలో కంటికి అత్యంత అవసరమైన ల్యుటిన్ మరియు జియక్షన్థిన్ (lutein and zeaxanthin) ఇందులో ఉందని పరిశోధకులు చెబుతున్నారు. నరాలకు తగినంత బలాన్ని చేకూరుస్తుంది. దీంతో గుండె స్ట్రాంగా అవ్వడానికి సహాయపడుతుంది. పిస్తాలో విటమిన్ బి6 సమృద్ధిగా ఉందని శాస్త్రం చెబుతోంది. దాంతోపాటు ఇందులో విటమిన్ E కూడా అధికంగా ఉంటుంది. పిస్తాపప్పు తరచూ తింటూఉంటె రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. పిస్తాతో మధుమేహానికి చెక్ పిస్తాపప్పు మధుమేహాన్ని నిరోధిస్తుంది. డయాబెటిస్ ను నిరోధించడానికి అవసరమయ్యే పాస్పరస్ ఒక కప్పు పిస్తాలో 60 శాతం లభిస్తుంది. మధుమేహ వ్యాధితో బాధపడే వాళ్ళు పిస్తా పప్పు తినడం వల్ల మధుమేహాన్ని కంట్రోల్ లో ఉంచుకోవచ్చు. రక్తహీనతకు పిస్తా .. పిస్తాపప్పులో నిల్వ ఉండే విటమిన్ b6 అనే ప్రోటీన్ రక్తంల్లో ఆక్సిజన్ సరఫరా చేయడానికి ఉపయోగపడుతుంది. పిస్తా పప్పులో తప్పులు అధిక పరిమాణంలో B6 ఉండటం వలన వీటిని ప్రతి రోజూ తీసుకోవడం వల్ల రక్తంలో ఆక్సిజన్ పరిమాణం పెంచుతుంది మరియు హిమోగ్లోబిన్ కౌంట్ ను కూడా పెంచుతుంది. చర్మ ఆరోగ్యానికి పిస్తా .. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి పిస్తాపప్పు బాగా ఉపయోగపడుతుంది. ఇందులో ఉండే విటమిన్ E మన శరీరానికి యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. సూర్యుని నుండి వెలువడే ప్రమాదకరమైన UV కిరణాలు మన చర్మాన్ని పాడు చేయకుండా చర్మ క్యాన్సర్ బారిన పడకుండా ఈ పిస్తాపప్పు కాపాడుతుంది. జుట్టు రాలకుంగా పిస్తా .. చాలా మంది జుట్టు రాలిపోయే సమస్యతో బాధపడుతూ ఉంటారు. శరీరంలో బయోటిన్ లోపించినప్పుడు జుట్టు రాలిపోతుంటుంది. ఈ బయోటిన్ చాలా తక్కువ పదార్థాల నుండి మన శరీరానికి లభిస్తుంది. పిస్తాలో బయోటిన్ ఎక్కువగా ఉంటుంది. వీటిని తరచుగా తినడం వల్ల మన శరీరంలో తగిన బయోటిన్ చేరి జుట్టు రాలిపోకుండా వుంటుంది. Read the full article











