#TDP #YCP #PrasadBabu #Rayachoti చాణక్యం ప్రదర్శిస్తున్న చంద్రబాబు ఎన్నికల్లో వాడుకోవడం వదిలేయడంలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడును మించిన నాయకుడు లేరని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.బద్వేల్లో ఎన్డి.విజయజ్యోతి, రైల్వేకోడూరులో ఓబిలి సుబ్బరామయ్య, కడపలో దుర్గాప్రసాద్, రాజంపేటలో మాజీ మంత్రి బ్రహ్మయ్య ఇలా చెప్పుకుంటూ పోతే అనేక మంది తెరపైకి రానున్నారు. ఆ అదృష్టం పై నమ్మకం పెట్టుకున్న నిఖిల్ ఇక తాజాగా రాయచోటి మాజీ ఎమ్మెల్యే సుగవాసి పాలకొండ్రాయుడు కుటుంబం కూడా భంగపాటుకు గురైంది. చంద్రబాబుకు రాజకీయ సమకాలికుడైన పాలకొండ్రాయుడుకు ఎంపీగా, ఎమ్మెల్యేగా సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది.ఈ సారి తన కుమారుడు ప్రసాద్బాబుకు రాయచోటి టికెట్ కట్టబెట్టాలని పలుమార్లు కోరారు. అదే విషయాన్ని టీడీపీ అధిష్టానానికి స్పష్టం చేశారు. కాగా టికెట్ రేసులో ఉన్న ప్రసాద్బాబును తప్పించేందుకు టీడీపీ బోర్డు మెంబర్ పదవి కట్టబెడుతూ ఆదివారం సాయంత్రం ఉత్తర్వులు వెలువడ్డాయి.సీఎం చంద్రబాబు తాజాగా తన చాణక్యాన్ని సుగవాసీ ప్రసాద్బాబుపై ప్రదర్శించారని విశ్లేషకులు వివరిస్తున్నారు.ఈ నేపధ్యంలో టీడీపీ కోసం నిబద్ధతతో ఉన్న మమ్ముల్ని కాదని, ఆర్ఆర్ సోదరులకు ప్రాధాన్యత ఇస్తారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రాయుడు వర్గీయులు.













