పాకిస్థాన్ ఎన్నికల్లో బాంబు పేలుడు సంభవించింది. క్వెట్టాలోని ఓ పోలింగ్ బూత్‌ను పేల్చేందుకు వెళ్లిన సూసైడ్ బాంబర్‌ను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలింగ్ బూత్ ముఖ ద్వారం వద్ద ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు. బాంబుదాడిలో 22 మంది మృతి చెందారు. మృతుల్లో ముగ్గురు పోలీసులు, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మరో 30 మంది తీవ్రంగా గాయపడినట్లు పోలీసులు తెలిపారు. సూసైడ్ బాంబర్ పోలింగ్ స్టేషన్లోకి వెళ్లేందుకు ప్రయత్నించినట్లు పోలీసులు స్పష్టం చేశారు. పోలీసులు అతడిని ఆపేందుకు ప్రయత్నించగా …















