కలమే మా గళం: ఒకే వేదికపైకి లక్షలమంది సోషల్ మీడియా జర్నలిస్టులు!
ఇవాళ తెలంగాణలో ఏం జరుగుతోంది. మనం పోరాటాలు చేసి, ఎంతో మంది అమరులు త్యాగాలు చేసి సాధించుకున్న తెలంగాణ ఇదేనా? ఎంతో మంది ఉద్యమకారులను పక్కకుపెట్టి మన నిజమైన తెలంగాణ ఆకాంక్షలను భూస్థాపితం చేస్తున్నారు నేటి నియంత పాలకులు. ఓటర్లను డబ్బులకు అమ్ముడుపోయేలా చేశారు. కష్టపడి కుటుంబాన్ని పోషించుకునే కూలీలను తాగుబోతులుగా చేశారు. క్వాటర్ బాటిల్లకు బానిసలు చేసి ఆడిస్తున్నారు. చదువుకున్న వాడికి ఉద్యోగం రాదు, డబ్బులేని వాళ్ల జీవితాలను దుర్భరం చూస్తోందిఈ సమాజం. పేదల బతుకులు హీనంగా తయారయ్యాయి. ప్రజాస్వామ్యంలో ఓటుకు ఉన్న విలువను 500 కు అమ్ముకునేలా చేస్తున్నారు. స్వపరిపాలనకోసం, అవినీతి రహిత సమాజం కోసం, మెరుగైన సమాజం రావాలని మన యూట్యూబర్లు నిజాన్ని నిర్భయంగా చూపెడితే.. కేసులా? మీ అక్రమాలను ప్రశ్నిస్తే అది తప్పా? 21వ శతాబ్దం మాది. మీరు ఏర్పాటు చేసుకున్న చానళ్లలో మీరు కోరుకునే వార్తలే రావచ్చు. కాని మా సోషల్ మీడియాలో నిజాన్ని రాస్తాం. ఎంతమందిని అరెస్టులు చేస్తారు. ఇప్పుడు మేము వందలు, వేలు, లక్షల్లో తయారవుతాం. ఒకరిని అణగతొక్కితే మరో పది మంది ప్రశ్నించే వాళ్లను తయారు చేస్తాం.
సోషల్ మీడియానే ఇవాళ నిజాలు చెబుతోంది
ప్రజలకు పనికొచ్చే ఏ సమాచారం అయినా అది వార్తే. ఈ ప్రపంచంలో, భారతదేశంలో గాంధీ, గోఖలే, అంబేద్కర్ లు ఆనాడు గోడ పత్రికలతో సమాచారం ప్రజలకు చేర వేసేవారు, కరపత్రికలు, వార్తా పత్రికలు, మ్యాగజిన్ ల ద్వారా తాము చెప్పాలనుకున్నవి నిర్భంగా వెల్లడించారు.. ఇప్పుడు గ్లోబలైజేషన్ తో దానిరూపం మారింది, సమాచార సాంకేతి విప్లవం వల్ల డిజిటల్ మీడియా వచ్చింది. దీని ద్వారానే సోషల్ మీడియా వచ్చింది. ప్రజలకు పనికివచ్చే సమాచారాన్ని ఏ రూపంలోనైనా చేరవేయవచ్చు. ఈ వార్త వల్ల జగం వర్ధిల్లుతుంది. ఎవరికైతే గొంతు ఉండదో వారి వైపు నిలబడతాం. వాయిస్ ఆఫ్ ద వాయిస్ లెస్ ఈ సోషల్ మీడియా. నిజం చెప్పే ఎవరైనా జర్నలిస్టులే. ఈ జనబాహుళ్యంలో సమాచారం తక్కువ టైంలో ఎక్కువ మందికి మా సోషల్ మీడియా వేదిక ద్వారా నేడు చేరుతుంది. ప్రజలు ఎక్కువ మంది సోషల్ మీడియా చూస్తున్నారు. నిజం చెబితే ఎవరైనా చూస్తారు. నిజం నిప్పులాంటిది. నిజాన్ని తొక్కి పెట్టాలని చూస్తే..అది దహించి వేస్తంది. అది బండి సంజయ్ కావచ్చు, రేవంత్ రెడ్డి కావచ్చు, ఇప్పుటి కేసీఆర్ కావచ్చు. కొందరు జర్నలిస్టు సంఘాలు పాలకులే వేసే బొక్కల కోసం పరుగెడుతుండవచ్చు. కానీ నిజం ఎప్పటికి దాగదు. యూట్యూబ్ చానళ్లను లక్షల మంది ఎందుకు చూస్తున్నారు. నిజాలు చెబుతున్నారు కాబట్టి. జనం చూడనప్పుడు అవి కనుమరుగవుతాయి. మెయిస్ స్ట్రీమ్ మీడియా మాఫియాలాగా అమ్ముడుపోయి, కులగజ్జితోటి, పార్టీలకు వంత పాడుతూ, జర్నలిజం విలువను గాలికొదిలేసి నడుస్తున్నప్పుడు వాటికి ఆలర్నేటివ్ గా సోషల్ మీడియా వచ్చింది. వాయిస్ ఆఫ్ ద వాయిస్ లెస్సే జర్నలిజం. నిజం ఎప్పటికి దాగదు. ప్రశ్నే ప్రజాస్వామ్యం, ప్రశ్నే నాగరికత, ఒక పార్టీ ఎజెండా మోసే కొన్ని సంఘాలు ఇది తెలుసుకోవాలి, ప్రశ్నే మందుపాతరై పేలిన నేల ఇది. ఆట, మాట, తూటాలై పేలిన నేల ఈ తెలంగాణ. నిజాన్ని తొక్కిపెట్టాలని చూస్తే నియంత పాలకులను పాతాళానికి తొక్కేస్తారు.
ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తామంటే ప్రశ్నిస్తూనే ఉంటాం...
తెలంగాణలో రాజకీయ నాయకులకు కేసులంటే మజాకయింది. పోలీసులు ఆధారాలు లేకుండా అరెస్టులు చేస్తున్నారు. పోలీస్ డిపార్ట్ మెంట్ అవినీతికి అలవాటు పడింది. చిన్న పత్రిక అయినా.. మీరు చేసే పెద్ద తప్పులను ప్రజల్లోకి తీసుకెళుతున్నాము. పెద్ద పత్రికలు, పెద్ద ఛానళ్లు వీటిని చూపిస్తలేవు కదా..ప్రజా సమస్యలను గాలికి వదలిలేసింది మెయిన్ స్ట్రీమ్ మీడియా. అయినా మేం వదలలేదు. మా రాతలు, దృశ్యాలు పేద ప్రజల వైపే నని గుర్తించుకోండి.
కేసీఆర్ కు ఘోరి కట్టుడు నూటికి నూరు శాతం జరుగుతుంది: ఓయూ స్కాలర్
తెలంగాణలో ప్రశ్నించే గొంతులను అణగదొక్కాలని ఆలోచనలో కేసీఆర్ ఉన్నడు. ఎవరైతే వారికి అనిగి మనిగి ఉంటడో వారినే మనుషులుగ చూస్తున్నడు. నిజాన్ని నిర్భయంగా అందించే జర్నలిస్టుల అరెస్టులు భాదాకరం, ప్రజాస్వామ్యం గొంతు నొక్కడమే, ప్రశ్నించే ప్రతి ఒక్కడు జర్నలిస్టే, వాస్తవానికి తెలంగాన లోపల జర్నలిస్టులను రెండు భాగాలుగా చేయాలని ఆలోచన మంచిది కాదు. నీ గడీల పాలన అంతం అవుతుంది కాబట్టే అణగదొక్కుతున్నవు. ఎవడు అడిగితే వాడిని లోపలేసుడే. పాలప్యాకెట్లు జేబుల పెట్టుకొని తిరిగినొళ్లకు పదవులు వస్తున్నయి. మొగులం పల్లి ఆశప్ప, ఉస్మానియా యూనిర్సిటీ స్కాలర్ లే కాదు, ఒక ముష్రం శ్రీనివాస్, దాసరి శ్రీనివాస్, తొలివెలుగు రఘు, మరో వెంకటేశ్వర్ రావు లను మీరు భయపెట్టవచ్చు. కానీ అంతకు రెట్టింపు సంఖ్యలో మా యూట్యూబర్లు తయారవుతారు.
160 కోట్లతో మమ్మల్ని కొనాలని చూస్తారా?
ఇదివరకు ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ఉండేది. ప్రజల చేతుల్లోకి సోషల్ మీడియా వచ్చింది. ప్రజలు ఏ సమస్యనైనా సోషల్ మీడియాలో చెప్పుకొనే అవకాశం వచ్చింది. ప్రజల్లోకి సామాన్యుడు తన సమస్యను పరిష్కరించుకోవాలంటే సోషల్ మీడియాను ఆశ్రయించాలన్న పరిస్థితి వచ్చింది. ప్రశ్నించే వాళ్లను అరెస్టు చేస్తారేమో గాని ప్రశ్నను అరెస్టు చేయలేరు కదా. 160 కోట్లు వెచ్చించి కేవలం సోషల్ మీడియాను కంట్రోల్ చేయడానికి కేటాయించారు. 43 మందిని అరెస్టు చేస్తే ఇది ఆగిపోయేది కాదు. మాది నిరంతర ఉద్యమం. మరింత బలపడుతుంది. ఇవాళ డెమొక్రటైజేషన్ ఆఫ్ మీడియా అయింది. ఒకరిద్దరు హద్దులు దాటితే అందర్నీఆ గాటన కట్టడం మంచిందికాదు. సాంప్రదాయక మీడియా, సాంకేతిక మీడియాల మధ్య స్వయం నియంత్రణ, సమన్వయం ఉండాలని పెద్దలు చెప్పారు. మా నియంత్రణలో మేము ఉన్నాం.. మీరు హద్దులు దాటి ప్రవర్తిస్తున్నారు.
తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల వేదికగా...
తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల వేదికగా మేము చేసే కార్యక్రమాలన్నీ ప్రజలకు చేరాలంటే సోషల్ మీడియా ఉండాలి. ఒకఫెడరేషన్ , కాన్ఫడరేషన్, సమాఖ్యలు, మహాసమాఖ్యలుగా తయారవుతాం. మాఫియా చేతుల్లో మీడియా ఉన్నంతకాలం ప్రజల సమస్యలు రావు బయటరకు రావు. ప్రజల చేతుల్లో సోషల్ మీడియా ఒక వజ్రాయుధంగా మారుస్తాం. ఒక ఏ మీడియాలో నైనా విమర్శనాత్మక జర్నలిజం ఉండాలి, సంఘీభావం పునాదిగా జర్నలిజం ఉండాలి. జనం కోసమే జర్నలిజం అని ప్రతి ఒక్క జర్నలిస్టు గుర్తించుకోవాలి.
యూట్యూబ్ చానళ్లకు సంకెళ్లు వేయాలని చూస్తారా?
ప్రపంచాన్ని శాశిస్తున్నట్టు వంటి మీడియా బారత్ దేశంలో ఫోర్త్ ఎస్టేట్ గా ఉన్నట్టువంటి మీడియాలో ఈరోజు మెయిన్ స్ట్రీమ్ మీడియా కంటే ఎక్కువగా ప్రజల గొంతుకై, ప్రజల కంఠమై, కన్నీటి బొట్టులై, ప్రజల ఆకలి దప్పులై, ప్రజల శ్వాస నిశ్వాలై, పుట్టుకలో , చావులో నేనున్నానంటూ..ఆకల్లో, దప్పికలో, కరువుల్లో, కాటకాల్లో, వలసల్లో, మేమున్నామంటూ వెలుగెత్తి చాటుతున్నటువంటి యూట్యూబ్ చానళ్లకు సంకెళ్లు వేయాలని చూస్తారా? తెలంగాణ రాష్ట్ర సాధన సమయంలో కూడా జర్నలిస్టులు అమూల్యమైనటువంటి సహాయ సహకారాలు, అదించారు. ఉద్యమంలో జైళ్లకు పోయి వచ్చినవాళ్లు కూడా ఉన్నారు. మాకు మీలాగా జెండా లేదు, ఎజెండా ఒక్కటే ఉన్నది. ఈ ఎజెండా రూపకల్పనలో సమాజంలోని విద్యార్థులను, ఉపాధ్యాయులను, మహిళలను, కర్షక, కార్మిక, బడుగు, బలహీన వర్గాల గొంతుకై కదులుతున్నాం.
తెలంగాణ సాధనలో జర్నలిస్టుల పాత్ర మరిచారా?
బడాబాబుల చేతుల్లో నడుస్తున్న మెయిన్ స్ట్రీమ్ మీడియా లో ఉండలేక, బతకలేక, మనసులు చంపుకోలేక, సెల్ఫ్ రెస్పెక్ట్ తోటి బతకాలని యూట్యూబ్ చానళ్లు పెట్టుకుంటే ఇలా కూడా మమ్మల్ని బతకనివ్వరా? తెలంగాణ తెచ్చుకున్నది నాలుగు కోట్ల ప్రజలకోసం, అమరుల ఆకాంక్షల కోసం, ఉద్యమంలో ఆనాడు రెండు వేల మంది అసువులు బాశారు. తెలంగాణ సాధనలో జర్నలిస్టుల తలలు పలిగినయి, చేతులు విరిగినయి, వీపుల మీద లాఠీలు నాట్యం చేసినయి. ఒక కొవ్వొత్తి కరుగుతూ కరుగుతూ వెలుగునిస్తది, మా జర్నలిస్టులు కూడా అలాంటి వాళ్లే.
ఆన్ లైన్ మీడియా అంటే సోషల్ మీడియానే!
వాక్ స్వాతంత్రం లేని మెయిన్ స్ట్రీమ్ మీడియాను వదిలి సొంతంగా యూట్యూబ్ చానళ్లు చాలా విస్తారంగా ఉన్నాయి. యూట్యూబ్ చానళ్లలో నేడు ఇన్ వెస్టిగేషన్ జర్నలిజం చేస్తున్నారు. వాటిని నడపాలంటే ఖర్చుతో కూడుకున్నది. సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరి, ఉద్యమ కారుడు గాదె ఇన్నయ్య, తెలంగాన సోషల్ మీడియా ఫోరం అధ్యక్షుడు కరుణాకర్ రెడ్డి దేశాయ్, విట్టలన్న లు మా కొత్త వేదికకు రూపకల్పన చేస్తారు. సీనియర్ జర్నలిస్ట్ పల్లె రవి, వివిధ ప్రతిపక్ష నేతలు, న్యాయవాదులు, చెరుకు సుధాకర్, యెన్నం శ్రీనివాస్ తదితరులు సహాయ సహకారాలు అందిస్తారు. ఆగస్టు 15న ఆన్ లైన్ మీడియా అకాడమీ ఏర్పడబోతోంది. యూట్యూబ్ నడుపుతున్న వాళ్లందరినీ ఏకతాటిపై తెచ్చి, ప్రతి ఊర్లో ఒక ఆన్ లైన్ మీడియా అకాడమీ విలేకరి ఉండాలని, వారికి ఒక ఐడీకార్డు, లోగో ఇచ్చి, వారికి ఏదైనా సమస్య వస్తే మేం అందరం ఐక్యం అవుతాం. ప్రభుత్వాల అరాచకాలను, ప్రభుత్వంలో ఉన్న అవినీతిని అరికట్టడానికి మెయిన్ స్ట్రీమ్ మీడియా పనిచేయడం లేదు. అవి వారికి కొమ్ము కాస్తున్నాయి. అందుకే ప్రజల పక్షాన నిలబడటానికే ఈ ఆన్ లైన్ మీడియా అకాడమీ ఏర్పాటు అవుతోంది.
ప్రజల నుండి ప్రజల కొరకు...
తెలంగాన ప్రభుత్వం ఏర్పడి 7 ఏళ్లు అయ్యింది. ఏడు సంవత్సరాల పరిపాలనలో పల్లెలు ప్రశ్నిస్తున్నాయి అనే కాన్సెప్టుతో ప్రజల దగ్గరకు వెళ్లాలని ఇకపై అనుకుంటున్నాము. వెబ్ పోర్టల్లో తెలంగాణ ఉద్యమకారుల జీవిత చరిత్రలు, గ్రామాల పరిస్థితులు, సమస్యలను అందులో ఉంచబోతున్నాం, విశిష్ట వ్యక్తుల స్టోరీలు ఉంటాయి. ప్రజల నుండి ప్రజల కొరకు, రాజకీయాలకు రాజీ లేకుండా.. నిర్మాణ రాహిత్యానికి చోటు లేకుండా..మేం చేసే పనికి అడ్డు ఉండదని తెలియజేస్తున్నాం.
ప్రతి ఒక్క నిరుద్యోగిని ఒక జర్నలిస్టుగా తయారు చేస్తాం..!
మా యూట్యూబ్ చానల్స్ కు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ప్రతిపక్షాలు ప్రజా సమస్యలపై ప్రశ్నించాలి. వాళ్లు ప్రశ్నించరు, ప్రశ్నించే వాళ్లకు అండగా నిలబడరు. విన్ విన్ సిట్యువవేషన్ ఉండాలి. చేసేదే ప్రజల కోసం. నిరుద్యోగులను కలుపుకొని ప్రతి ఒక్క నిరుద్యోగి ఒక జర్నలిస్టుగా తయారు చేస్తాం. ఈ మా కొత్త వేదికలో సోషల్ మీడియా టీం లీగల్ సెల్, పోలీస్ టీం లు ఉంటాయి. ఇక చూసుకుందాం. మన అస్థిత్వాన్ని పరిరక్షించుకోవడానికి మనకు ఒక వేదిక రాబోతోంది. ప్రజా సమస్యలను ముందుకు తీసుకురావాలి. కనిపించే ప్రాజెక్టులు ఎన్ని, కనబడని ప్రాజెక్టులు ఎన్ని కనిపెట్టాలి. వాస్తవాలను తొక్కేస్తున్నారు. ఎంతమంది కాంట్రాక్టర్లు తెలంగాణ వాళ్లు ఉన్నారు? పబ్లిక్ ఇష్యూస్ మీద నడిచేటట్టు చూడాలి. కేసీఆర్ లక్ష నాగళ్లతో దున్నకోయినా..మేం 1000 మంది యూట్యూబర్లతో కొట్లాడుతాం. ఈ ఫోనే మా ఆయుధం. మా మెదడే లక్ష నాగల్లకు సమానం. డిగ్నిటీ ఆఫ్ లేబర్ మాది. బలమైన సర్పాన్ని చలి చీమలు చంపినట్టు ఆ చలిచీమల పాత్ర సోషల్ మీడియా తీసుకుంటుంది. మెయిన్ మీడియా చేయలేని ఎన్నో పనులు మేం సాధిస్తున్నాం. తెలంగాణ ఆత్మను ప్రజెంట్ చేస్తోంది కాలోజి టీవీ సమాజంలో ప్రశ్నించే కాళోజి లాంటి వాళ్లు కరువయ్యారు. మేం పీడిత ప్రజల సమస్యలపై పోరాడుదాం. వృద్ధిపైన, అభివృద్శిపైన, పాలకులను శాసించే స్థాయికి నేడు వచ్చాం. మాకు ప్రాంతం, మతం, కులం పట్టించుకోం. మా ధైర్యం, మా ధ్యేయం ప్రజలే వారి సమస్యల కోసం ఉక్కు పిడికిలి బిగించి నడుస్తాం.. మెయిన్ స్ట్రీమ్ మీడియాను సవాళ్ చేస్తాం.. ఖబర్దార్ పాలకుల్లారా ఖబర్దార్!













