జాగో వాల్మీకి బోయ జాగో!
ఈటెల రాజేందర్ గారు తమరి కులాన్ని మాత్రం బి సి “ఎ” జాబితాలో చేర్చవడితివి…రెండు వాల్మీకి జయంతిలకు వచ్చి ఊకదంపుడు ఉపన్యాసాలు మస్తుగానే ఇస్తివి… మమ్మల్ని మాత్రం ఇంకా కమిషన్ల పేరుతో కాలయపన చేయబడితిరి “జాగో వాల్మీకి బోయ జాగో”
🙏వాల్మీకి బోయల సత్యాగ్రహం 🙏
తేదీ 27 ఫిబ్రవరి 2017 ఉ 10:00 గంటలకు స్థలం ఇందిర పార్క్ హైదరబాద్ లో జరిగే ఈ సభకు బోయ వాళ్ళు అధిక సంఖ్య లో వచ్చి సభను విజయవంతం చెయ్యాలని మేధావులు ప్రొఫెసర్ విద్యార్థులు NGOS మరియు ఉద్యోగ సంఘ నాయకులు అందరూ కలసి సింహంలమై గర్జించి మన ST డిమాండు ప్రభుత్వానికి తెలియజేసేల నినాదాలతో దద్దరిల్లేలా గర్జించి మన సత్తా చాటుదాము.
ఒక్కరైతే ఒంటరే అందరమూ కలిస్తే ఉప్పెనే కదలిరండి కదలిరండి వాల్మీకి వీరులారా! ఉప్పెనగా ఎగసిరండి జెండా కరమునబూని! పిడికిలెత్తి ఒక్కటిగా ఉరికిరండి పోరుకు. భావితరం తలరాత మార్చేటియందుకూ! రాడురాడు ఏనాయకుడు మనఘోష చూసేందుకు మనమే నాయకులమై దూకుదాము ముందుకూ! అదిచేస్తాం ఇదిచేస్తాం అంటూకల్ల మాటలకు మైమరిచి బానిసలుగ మారొద్దు వారి కాళ్ళకూ నీవువేరు నేనువేరు అంటూ దూరముండకూ. అదిచూసే సాగుతుంది నాయక పరిపాలనా! గడగడగడగడ గుండెలదర దూకర మును ముందుకూ. మన హక్కును మనం సాధించేటి యందుకూ!
బిరబిరబిరబిరబిర కళ్ళురిమీ పటపటపట పళ్ళుకొరికి ఎగురుము కదనానికీ నాయకులకు మనబాధను తెలియజేయుటందుకూ!
ఇప్పుడు కాకపోతే మరి ఇంకెప్పుడూ పోరుకు అందరూ సిద్దంగా ఉండి ముఖ్యంగా గ్రేటర్ హైదరబాద్ నుండి తప్పక గడపకీ ఒక్కరూ రావాలి అని కోరుతూ మన STసాధనలో అందరూ బాగ స్వాములమై పాలుపంచుకుందాం ఈ సభను విజయవంతం చెయ్యాలని ప్రతీ ఒక్కరికీ పేరు పేరున తెలియజేసుకుంటున్నాము.
🙏 దన్యవాదములతో 🙏
Tvbs jac గ్రేటర్ హైదారాబాద్
1) బొగ్గు. సలేశ్వరం గ్రేటర్ కన్వీనర్ 2)బొగ్గు. వెంకటేష్ కో -కన్వీనర్ 3) బోయ.విశ్వనాథం కో -కన్వీనర్ 4) బోయ.సురేష్ మీడియ కన్వీనర్












