ఒరిగిన శిఖరాలు… Top Telangana Congress Leaders who Lost in this Elections | Peoplesposttv |
#CongressParty #TelanganaCongress #Congressleaders #Electionresult #Telanganaelection #Telanganaelectionresult #CongressleadersLost #Revanthreddy #KomatireddyVenkatreddy #DKAruna #Jeevanreddy #TRSParty #TRSWon #TRSSeats #Peoplesposttv#Politicalupdates #Politicalnews
ప్రత్యర్థి అంతసులువుగా ప్రవేశించకుండా ,శత్రుదుర్భేద్యమైన కంచుకోటల్ని నిర్మించుకొని అనాదిగా గెలిచే అవకాశాల్ని సంరక్షించుకుంటూ నియోజకవర్గం పేరుచెబితే వారే గుర్తొచ్చేంతలా పాతుకుపోయిన కాంగ్రెస్ నాయకులకి తెలంగాణలో ముందస్తు ఎన్నికల ఫలితాలు వెనక్కి తిరిగి చూసేలా చేశాయి. మడమ తిప్పుకునేలాచేశాయి.ఒరిగిన శిఖరాలు… Top Telangana Congress Leaders who Lost in this Elections | Peoplesposttv | ఎప్పుడో మరిచిపోయిన ఓటమి బాధని మళ్ళీ గుర్తుచేశాయి. ఆ సదరు నాయకుల కోటల్లో సంబరాలకు పేటెంట్ రైట్స్ తీసుకున్నారా అన్నంత,చివరకి ప్రజలకే విసుగుపుట్టెంతలా విజయం వరించి… వరించి… ఒక్కసారి దూరమైంది. ఆ బాధే వేరు. బాధ అంటే అది మాములు బాధకాదు…పార్టీ కండువాల్ని పచ్చిగా మార్చేసేంత దుఃఖం,అయిన సరే… భరించకతప్పదు. ఓటమి అంగీకరించకతప్పదు.ఒరిగిన శిఖరాలు… Top Telangana Congress Leaders who Lost in this Elections | Peoplesposttv | అయితే,వాళ్లు ఓడిపోలేదు,అంత సులువుగా ఓడే శాల్తీలు కారు వారు. ఇది టీఆర్ఎస్ పక్కా వ్యూహం వల్లే సాధ్యమైంది. కాంగ్రెస్ సీనియర్ నేతలను వారి సొంత నియోజకవర్గంలో ఓడించడానికి టీఆర్ఎస్ పక్కా వ్యూహంతో వెళ్లింది. టార్గెట్ చేసిన ముఖ్య నేతల నియోజకవర్గాలపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. ముఖ్యంగా టీఆర్ఎస్ అంటేనే ఒంటికాలితో లేచే నేతలను టార్గెట్ చేసింది. రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, డీకే అరుణ, జానారెడ్డి, జీవన్‌రెడ్డి తదితర నేతలను ఓడించేందుకు అత్యంత పటిష్టమైన వ్యూహాలతో వెళ్లింది. ఒరిగిన శిఖరాలు… Top Telangana Congress Leaders who Lost in this Elections | Peoplesposttv | మొత్తానికి కాంగ్రెస్ అగ్రనేతలను ఓడించాలన్నకేసీఆర్ వ్యూహం పూర్తిగా ఫలించినట్టు కనిపిస్తోంది. జానారెడ్డి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి, దామోదర రాజనర్సిహా, జీవన్‌రెడ్డి వంటి హేమాహేమీలే కాదు.. గెలుస్తారనుకున్న షబ్బీర్ అలీ, సర్వే సత్యనారాయణ.. తదితరులు ఓటమి పాలు కావడం కాంగ్రెస్ పార్టీని దిగ్భ్రాంతపరుస్తోంది. దేశవ్యాప్తంగా జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, మిజోరంలో సత్తా చాటిన కాంగ్రెస్.. తెలంగాణలో మాత్రం ఘోరంగా చతికిలపడింది.ఒరిగిన శిఖరాలు… Top Telangana Congress Leaders who Lost in this Elections | Peoplesposttv | Welcome to Peoplespost Media Channel,Enjoy Here Latest Political Updates Entertainment,Health,Latest Updates in Our Official Youtube Channel For More Latest Updates Please Subscribe here Youtube Channel https://www.youtube.com/channel/UCNgm... Website: https://peoplespost.news/te/ Facebook:https://www.facebook.com/PeoplesPostE... Linkedin:https://www.linkedin.com/in/kishore-b... Reddit:https://www.reddit.com/user/peoplespost Twitter:https://twitter.com/peoplespost1 Google+:https://plus.google.com/u/0/102930886... Tumblr:https://www.tumblr.com/blog/peoplespost








