#మనదేవాలయాలు_మనసంపద #దయాచేసి_అందరికి_తెలిసేలా_షేర్_చేయండి #మనదేవాలయాలు #thondamanudu శ్రీకాళహస్తి కి సమీపం లో తొండమానుడు గ్రామం లో వెలసిన ప్రసన్న వెంకటేశ్వర స్వామీ దేవాలయం ఎంతో ఘనమైన చరిత్రగల దేవాలయం. తొండమన్ చక్రవర్తి వయస్సు పైబడి తిరముల వెంకటేశుని దర్శించుకోలేక బాధపడుతూ ఉంటే అయిన భక్తికి మెచ్చుకోని స్వామి వారే శ్రీదేవి,భూదేవి సమేతంగా వచ్చి కొలువైనారు అని స్థల పురాణం. తొండమన్ చక్రవర్తి నిర్మించిన ఇ దేవాలయం తిరుమల నిర్మాణ శైలిని పోలి ఉంటుంది.గర్భాలయం లో వెలసిన స్వామి ఒక చేతితో యోగముద్ర,మరొక చేతితో అభయ హస్త ముద్ర తో శ్రీదేవి,భూదేవి సమేతంగా కూర్చొని దర్శనం ఇస్తారు..ఇలాంటి దర్శనం మనకు చాలావరకు ఎక్కడ దొరకదు. ప్రతి నిత్యం స్వామి వారికి విశేషమైన పూజలు నిర్వహించబడుతాయి.ఆలయం లో తిరుమల తిరుపతి దేవస్థానం అద్వర్యం లో నడుస్తుంది.కోరిన కోరికలు తీర్చే దేవుడు వెంకటేశుడు. ఎలా వెళ్ళాలి:శ్రీ కాళహస్తి నుండి 9కిమి దూరం లో ఉంటుంది. ప్రతి ఒక్కరు తప్పకుండా దర్శించాల్సిన దివ్యమైన క్షేత్రం!! మీ శ్రేయోభిలాషి గిరీష్ https://www.instagram.com/p/CI0hJb3ssDK/?igshid=1o542dpk3n18o











