వెయ్యికి చేరిన మయన్మార్ భూకంప మృతుల సంఖ్య.. ఇంకా వేల మందికి తీవ్ర గాయాలు BHS NEWS
మయన్మార్, థాయ్‌లాండ్‌లో మృతుల సంఖ్య 1,002కి చేరింది. భారీ భూకంపాలతో రెండు దేశాల్లో మృత్యు ఘోష వినిపిస్తోంది. అమెరికా సంస్థల అంచనా ప్రకారం.. మృతుల సంఖ్య 10 వేలకు మించి ఉండొచ్చని తెలుస్తోంది. భూకంపం ధాటికి కుప్పకూలిన భవనాల కింద చిక్కుకున్న వారిని కాపాడేందుకు రెస్క్యూ టీమ్స్ తీవ్రంగా కృషి చేస్తున్నాయి. రెండు దేశాల్లోనూ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. భూకంపాలతో విలవిల్లాడిన రెండు దేశాలకు సాయంగా రష్యా,…










