నాగశౌర్య #NS20 ఫస్ట్ లుక్... చూస్తే షాక్ అవ్వాల్సిందే
టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య టాలెంట్ గురించి అందరికీ తెలిసింది. ఊహలు గుసగుసలాడే చిత్రంతో పక్కింటి కుర్రాడిలా కనిపించి అందర్నీ మెప్పించాడు. కమర్షియల్ చిత్రాలతో పాటు, ఎమోషన్, కంటెంట్ ఉండే చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. దిక్కులు చూడకు రామయ్య, జ్యో అచ్యుతానంద, ఛలో వంటి మంచి సూపర్ హిట్ చిత్రాలను తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం నాగ శౌర్య నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్లో ఓ చిత్రాన్ని చేస్తున్నాడు. ఈ సినిమా ప్రాచీన క్రీడా నేపథ్యంలో తెరకెక్కబోతోన్నట్టు తెలుస్తోంది. నిన్న ఈ సినిమాకు సంబంధించిన ప్రీ లుక్‌ను విడుదల చేశారు. ఇందులో నాగశౌర్య ఓ రేంజ్లో ఉన్నాడు. కండలు తిరిగిన దేహం, బ్యాక్ సైడ్ లుక్ అన్నీ అదిరిపోయాయి. ఈ సినిమాకు సంతోష్ జాగర్లపూడి దర్శకత్వం వహిస్తున్నాడు. రామ్ రెడ్డి కెమెరామెన్‌గా పని చేస్తున్నాడు. కాల భైరవ సంగీతాన్ని అందిస్తుండగా.. జునైడ్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహించనున్నాడు. #NS20 సినిమాగా తెరకెక్కుతున్న ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను తాజాగా విడుదల చేసింది చిత్రయూనిట్. దర్శకుడు శేఖర్ కమ్ముల నాగశౌర్య సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేసాడు. అందులో 6 ప్యాక్ తో చొక్కా విప్పి విల్లు ఎక్కుపెట్టి చాలా సీరియస్ గా కనిపిస్తున్నాడు శౌర్య. అయితే ఇది స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ సినిమా అని ముందే చెప్పిన, ఇప్పుడు వచ్చిన ఫస్ట్ లుక్ చూస్తుంటే.. ఈ సినిమాలో నాగశౌర్య 'ఆర్చర్' గా కనిపించనునట్లు అర్ధమవుతుంది. అయితే ఇటీవల నాగ శౌర్య కాలు ఫ్యాక్చర్ అయిన విషయం తెలిసిందే. సినిమా షూటింగ్ లో ఆయన గాయపడ్డాడు. అయినా ఏమాత్రం పట్టు వదలక సినిమా మీదున్న డెడికేషన్ తో ఇలా సిక్స్ ప్యాక్ చేసి అందరిని ఆశ్చర్యపరిచాడు. ఈ సినిమా మంచి విజయాన్ని సాదిస్తుందని చిత్రయూనిట్ ధీమాగా ఉంది. Read the full article








