ఉక్రెయిన్‌లో మరోసారి యుద్ధ మేఘాలు.. రష్యా దాడుల్లో 9 మంది మృతి
ఉక్రెయిన్‌పై రష్యా మరోసారి భారీ స్థాయిలో దాడులకు దిగింది. రాజధాని కీవ్‌తో పాటు పలు కీలక నగరాలను లక్ష్యంగా చేసుకుని మిస్సైళ్లు, డ్రోన్లతో రాత్రిపూట భీకర దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో కనీసం 9 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ప్రాథమిక సమాచారం వెల్లడిస్తోంది. మరో పలువురు గాయపడగా, అనేక మంది భవనాల శిథిలాల కింద చిక్కుకున్నట్లు అధికారులు తెలిపారు. మంగళవారం అర్ధరాత్రి తర్వాత ప్రారంభమైన ఈ దాడులు…


















