#AmiThumi #EshaRebba #SobhanBaBuAwards ఈషా రెబ్బాకు శోభన్ బాబు అవార్డు ! ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వం లో రొమాంటిక్ కామెడీ చిత్రం గా రూపొందిన 'అమీ తుమీ' గత ఏడాది లో విడుదలై మంచి విజయం సాధించిన విషయం తెలిసిందే. వివిఆర్ ట్రైలర్ కూడా రేపేనట ! ఇక ఈ చిత్రానికి గాను తెలుగు హీరోయిన్ ఈషా రెబ్బా ప్రెస్టీజియస్ అవార్డును దక్కించుకుంది.ఉత్తమ నటి విభాగంలో ఆమెకు శోభన్ బాబు అవార్డు వరించింది.'అమీ తుమీ' చిత్రంలో అడివి శేష్ ,శ్రీనివాస్ ఆవసరాల , ఈషా రెబ్బా ,అదితి ముఖ్య పాత్రల్లో కనిపించారు. ఇక ఇటీవల కాలంలో జూనియర్ ఎన్టీఆర్ నటించిన 'అరవింద సమేత' చిత్రంలో హీరోయిన్ చెల్లి పాత్రలో ఈషా రెబ్బా నటించగా 'సుబ్రమణ్యపురం' చిత్రంలో సుమంత్ సరసన హీరోయిన్ గా నటించింది.












