రాజ రాజ చోళుడిని హత్య చేశారా?! రాజుగారి చావు వెనుక ఉన్న మర్మం!
Hey guys, ఈ videoలో నేను వెతికిన “రాజ రాజ” చోళ సమాధిని మీకు చూపించబోతున్నాను. ఆయన సమాధి ఉదయలూరు అనే ఒక చిన్న గ్రామంలో ఉందని చెప్పారు. ఇక్కడే ఆయన్ని పాతిపెట్టినట్టు లేదా దహనం చేసినట్లు rumors వచ్చాయి. నేను ఈ placeకి వచ్చినప్పుడు, దాదాపు రెండు అడుగుల ఎత్తుగా ఉన్న ఒక లింగాన్ని చూసి నేను ఆశ్చర్యపోయాను, ఇంకా ఈ పూజారి ఈ లింగం యొక్క మిగతా structure పద్నాలుగు(14) అడుగులు భూమి లోపల పాతిపెట్టబడిందని నాకు చెప్పాడు. ఇది కేవలం ఒకటిన్నర అడుగుల diameterతో ఉన్న ఒక సాధారణమైన లింగం. అతను ఈ లింగాన్ని రాజ రాజ చోళ సమాధి అని చెప్పాడు.
రాజ రాజ చోళ ఎలా చనిపోయారో తెలుసా అని నేను ఈయన్ని అడిగాను, అందుకు, రాజ రాజ చోళుడు వయసవ్వడంతో సహజంగా చనిపోయారని ఇంకా ఇక్కడే ఆయన్ని దహనం చేసారని చెప్పారు. ఒక గొప్ప రాజుకి ఇంత చిన్న సమాధి ఎందుకు ఉంటుంది? చుడండి ఇక్కడ ఏఒక్క రాతిశాసనాలు లేవు అంతెందుకు ఈ లింగం చుట్టూ ఏ శిల్పం కూడా లేదనే దాన్ని మీరు clearగా చూడవచ్చు. బాగా గుర్తుంచుకోండి, రాజ రాజ చోళుడు indiaలోనే చాలా పెద్ద గుడిని కట్టిన ఒక గొప్ప రాజు. ఈ గుడిని ఇప్పుడు world heritage siteగ మార్చారు అంటే ప్రపంచ వారసత్వ స్థలంగా మార్చారు.
అంతేకాక ఆయన సాధించిన విషయాలు గురించి, ఆయన గురించి ఇంకా చాలా విషయాలను చాల గుడులలో గోడల మీద చెక్కారు. So, నేను ఈ పూజారిని, ఇది నిజంగానే రాజ రాజ చోళ రాజుని సమాధి అని prove చెయ్యడానికి ఏదైనా evidence ఉందా అని అడిగాను. అందుకు ఆయన ఇక్కడ ఒక స్థంభం ఉండేదని అది కొన్ని మైళ్ల దూరంలో ఉన్న పాల్కుళత్తు అమ్మన్ గుడికి దానం చేసారని చెప్పారు. ఆ స్తంభంలో రాజ రాజ చోళ రాజు ఇక్కడే చనిపోయారని prove చేయడానికి రాతిశాసనాలు ఉన్నాయని ఈ పూజారి చెప్పారు. So, నేను ఆ స్థంభంలో ఉన్న నిజాన్ని తెలుసుకోవడానికి ఆ గుడికి వెళ్లాలని decide ఐయ్యను.
నేను ఆ గుడికి వెళ్లిన వెంటనే, straightగా ఆ స్థంభం దగ్గరకు వెళ్ళాను. ఈ స్తంభంలో "రాజరాజ" అనే పదం ఉంది కాబట్టి ఇది ఖచ్చితంగా రాజుకు సంబంధించింది అనుకుంట, కానీ ఈ రాతిశాసనం ఎం చెప్తుందో అని నేను clearగా అర్థం చేసుకోలేకపోయాను. So, నేను వాటన్నిటిని చాలా anglesలో photos తీసి అదేలాగా చాలా పదాలను scratchpadలో copy చేసుకున్నాను. తర్వాత నేను ఒక epigraphist అంటే రాతిచెక్కడాల నిపుణిని కలిశాను, వాళైతేనే ఇందులో ఏం రాసారు అని exactగా చెప్పగలరు.
Epigraphist ఇచ్చిన ఆ informationని నేను ఇంకొక expertని అడిగి ఒకటికి రెండుసార్లు ఈ information correct ఎహ్ నా అని check చేసుకున్నాను. ఈ శాసనం ఎం చెప్తుందంటే "రాజ రాజ చోళుని కోటని నలుగురు మళ్లీ కొత్తగా కట్టారని చెప్తుంది. ఆ నలుగురు ఎవరు ఇంకా వాళ్ల పేర్లు అన్ని ఈ స్తంభం మీద ఉన్న శాసనాన్ని చూసి మనం తెలుస్కోవచ్చు. ఈ శాసనంలో రాజ రాజ చోళ రాజుని చావు గురించో లేదా ఆయన సమాధి గురించో ఏఒక్క informations లేదు. అయితే బహుశా ఈ లింగం ఉన్న place రాజ రాజ చోళుడి సమాధి కాదు ఎందుకంటే అలా చెప్పడానికి ఎలాంటి ఆధారాలు ఇక్కడ లేవు.
దీన్ని చూస్తుంటే రాజ రాజ చోళ రాజుకి నిజంగా ఏమైందని and ఎలా చనిపోయారని, ఇలాంటి questions నాకు చాలా వస్తున్నాయి. ఈయన దహన కార్యాయాలు ఎక్కడ జరిగాయి? మీరే ఒక్క క్షణం ఆలోచించండి, రాజ రాజ చోళుడు సాధించిన విజయాల గురించి వందలాది శాసనాలు ఉన్నాయి, ఆయన ఎలా మిగతా దేశాలను గెలిచాడు, ఆయన ఎలా పెద్ద గుడులను కట్టాడు, ఇంకా ఆయన ఎప్పుడు పుట్టారు అని కూడా శాసనాలు ఉన్నాయి. కానీ ఆయన ఎప్పుడు ఎలా చనిపోయారు, ఎక్కడ పాతి పెట్టబడ్డారు ఎక్కడ దహనం చేశారనే దానిపై ఎలాంటి informations లేదు.
దీన్ని కనిపెట్టడానికి నేను మళ్లీ తంజావూరికి వెళ్లి ఆయన మరణం గురించి తెలుసుకోవాలని decide అయ్యాను. కొంత మంది expertsకి నేను contact చేశాను, వాళ్లు ఏం చెప్పారంటే ఒక రాజు ఎలా చనిపోయారని ఏఒక్క records లేకుంటే దానికి ఒకే ఒక కారణం ఉంటుంది, ఆ రాజు యొక్క చావు natural death కాకుండా ఉంటుంది. ఒకవేళ రాజుని చంపితే లేదా ఆత్మహత్య చేసుకుంటే గాని పాతకాలపు వాళ్లు దాని record చేసిఉండరు. రాజ రాజ చోళుని మరణం ఎవరికైనా తెలుసా అని అడగడానికి నేను తంజావూరులో ఉన్న గ్రామస్థులతో మాట్లాడాను. అక్కడ ఉన్న అందరూ ఒకే కథను చెప్పారు.
అదేంటంటే, శ్రీలంకకు చెందిన ఒక స్త్రీ, రాజ రాజ చోళుడిని హత్య చేసిందని చెప్తున్నారు. ఇది వినడానికి చాలా విచిత్రంగా ఉంది. సరే ఈ పెద్దాయన చెప్పేది విందాం. ఇప్పుడు క్రీ.శ తొమ్మిదివందల తొంభై మూడు(993)లో రాజ రాజ చోళుడు ఐదవ మహింద రాజుని యుద్ధంలో ఓడించి దాదాపు సగం శ్రీలంకాని గెలిచారు. ఓడిపోయిన మహింద రాజు ఎవరి చేతిలో చిక్కకూడదని south sri lankaకి పారిపోయాడు. యుద్ధంలో రాజ రాజ చోళుని ఓడించలేము. అందుకని మహింద రాజు శ్రీలంకాలో బౌద్ధ మతానికి చెందిన ఒక అమ్మాయిని రాజ రాజ చోళుని కోటకి పంపించారు, ఆ అమ్మాయి కొంచం కొంచంగా రాజుకి దగ్గరయ్యింది. So, రాజ రాజ చోళుని సమాధిని ఇంకా ఆయన మరణానికి కారణం కనిపెట్టే ఈ process complete అవ్వలేదు, అయినాగానీ నేను research చేస్తూనే ఉంటాను, ఏదో ఒక రోజు కచ్చితంగా కనిపెడతానని నేను అనుకుంటున్నాను.