ఆధునిక దుస్తుల్లో ఉన్న మన ప్రాచీన భారతీయులు! ఆలయ గోపురంలో మన పూర్వీకుల రహస్యం!
Hey guys, ఈరోజు మనం ఒక పురాతన హిందూ గుడిని చూడబోతున్నాం, ఇది నిజంగా మీరు మర్చిపోలేని విధంగా ఉంటుంది. ఈ గుడిని మీరు మర్చిపోవాలని ప్రయత్నించినా కూడా, నేను ఇక్కడ మీకు చూపించబోయే విజువల్స్‌ను మీరు మీ life లో మర్చిపోవడం అసాధ్యం. ఇప్పుడు మీరు చూడబోయే గుడి చాలా పురాతనమైనది, ఈ గుడిని దాదాపు 250 A.D లో నిర్మించారు, అంటే ఇది దాదాపు 1750 సంవత్సరాల పురాతనమైనది, అయితే ఈ గుడిలో ఉన్న వివరాలు, మనసును కదిలించేలా చాలా అద్భుతంగా ఉంది, ప్రకృతికి మించిన ఏదో ఒక అతీంద్రియ శక్తీ ఈ గుడిని నిర్మించిందా అని మనం ప్రశ్నించవచ్చు.
ఈ గుడి సింగిరికుడి అనే, ఒక చిన్న గ్రామంలో ఉంది, ఇది మొదటి చూపులోనే, అందమైన మరియు రంగురంగుల బొమ్మలతో, ఇప్పుడే కట్టిన modern day గుడిలా కనిపిస్తుంది. అలా కనిపించడానికి ఈ శిల్పాలలోను మరియు విగ్రహాలలోను ఉన్న ప్రత్యేకత ఏంటీ? ఈ విగ్రహాన్ని చూడండి, దానికి కాలర్ తో ఉన్న చొక్కా ఉంది, మరియు దానికి buttons కూడా ఉన్నాయి చూడండి అలానే రెండు వైపులా పాకెట్స్ ఉండడం కూడా మీరు చూడవచ్చు. అతను ఈ గుడి బరువును మోస్తున్నట్లు, పోజు ఇస్తున్నాడని మీరు స్పష్టంగా చూడండి. హిందూమతం అంటే సమరూపత కలిగి ఉంటుంది, కాబట్టి నా కళ్ళు సహజంగానే ఈ గోపురానికి అటువైపు వెళ్తున్నాయి, ఇక్కడ అవతలి వైపు ఉన్న విగ్రహం కూడా కాలర్, పాకెట్స్ మరియు బటన్లతో ఉన్న ఇంకొక శిల్పాన్ని మనం చూడవచ్చు.
ఇది చాలా shocking గా ఉంది, ఎందుకంటే historians అందరూ, గత కొన్ని శతాబ్దాలలో మాత్రమే buttons ఉన్న shirts భారతదేశానికి వచ్చాయని చెప్తున్నారు, కానీ, ఈ గుడి సుమారు 1750 సంవత్సరాలు పురాతనమైనది. అవును, ఈ గుడిపై ఉన్న పెయింటింగ్ కూడా చాలా freshగా ఉంది, ఎందుకంటే వాళ్ళు అప్పుడప్పుడు గుడిని renovate చేయడానికి, పెయింట్ చేస్తూనే ఉంటారు, అది మనకే బాగా తెలుసు, మరియు కొంతమంది ఈ గుడిలో ఉన్న ఈ shirtsను recent గా పెయింటర్ చేశారని చెప్తున్నారు. అయితే, ఇంకా కొంతమంది స్థానికులు మొదటినుండే, ఈ శిల్పంపై ఈ చొక్కాలను చెక్కారని మరియు చిత్రకారులు వాటిపై వివిధ రంగులను వేశారని చెప్తున్నారు.
నేను symmetry గురించి మాట్లాడాను కదా, మీకు గుర్తుందా. ఇప్పుడు, ఈ గోపురానికి అవతలి వైపు వెళ్లి, అక్కడ ఎలాంటి విగ్రహాలు ఉన్నాయో చూద్దాం రండి. ఈ వైపు కూడా చాలా అందమైన విగ్రహాలు ఉన్నాయి, అవన్నీ మన హిందూ మతం నుండి చాలా కథలను చెప్తున్నాయి, ఇక్కడ కూడా, బటన్లు, కాలర్లు మరియు పాకెట్లతో ఉన్న shirts వేసుకున్న మరిన్ని బొమ్మలను మనం మళ్లీ చూడవచ్చు. గోపురానికి ముందు వైపు ఉన్న ముఖాల కంటే, ఇక్కడ ఉన్నవి కొంచెం different గా ఉన్నాయి, కానీ ఇక్కడ మొత్తం shirt వేసుకున్న విగ్రహాలు 4 ఉన్నాయి. కానీ ఇది దీనితో పూర్తి కాలేదు! ఎందుకంటే ఈ గుడి గోపురానికి మొత్తం 4 వైపులు ఉంటాయి కదా, కాబట్టి నేను ఆ sidesని కూడా చూడాలని నిర్ణయించుకున్నాను.
చాలా మంది ప్రజలు గోపురం యొక్క sidesను చూడరు, ఇక్కడ కూడా shirts వేసుకున్న కొన్ని విగ్రహాలను నేను చూడగలుగుతున్నాను. అది మాత్రమే కాకుండా, మీరు ఒక drone ని use చేసి, ఈ గోపురం చుట్టూ analyse చేసి చూశారంటే, మరో 4 విగ్రహాల్ని కూడా మీరు చూడవచ్చు. ఇది చాలా attract చేస్తున్నట్టు ఉంది, ఎందుకంటే ఈ గోపురంలో మొత్తం 8 విగ్రహాలు shirts ను వేసుకున్నట్టు ఉన్నాయి. 1750 సంవత్సరాల క్రితం కాలర్లతో, బటన్లతో ఉన్న shirts ఉండడానికి అవకాశమే లేదని మనకు తెలుసు. భారతదేశంలో మాత్రమే కాదు, ప్రపంచం మొత్తం కూడా, గత రెండువందల సంవత్సరాల వరకు, ఇలాంటి shirtsను ఉపయోగించనే లేదు. So, పురాతన నిర్మాణ దారులు ఇలాంటి shirtsతో ఉన్న ఈ ఖచ్చితమైన విగ్రహాలను ఎలా చెక్కగలిగారు?
కానీ దీనితో ఇది ఇంకా పూర్తి కాలేదు, నేను నా కెమెరాతో అటువైపు జూమ్ చేసి చూస్తే మరిన్ని Interesting అయిన వివరాలను మనం చూడవచ్చు. ఇక్కడ చూడండి అతని దగ్గర round గా ఒక pocket watch ఉంది, అది అతని బటన్ నుండి pocket లోకి వెళ్తుంది. మనం ఇప్పుడు చేతికి కట్టుకుంటున్నాం కదా, ఆ wrist watch రాక ముందు, ఈ విధమైన pocket watch నే ప్రజలు ఉపయోగించేవాళ్ళు. కానీ, దీనికంటే మరింత ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, అతని shirtకి ఉన్న కింద pocketలో, పెద్దగా ఒక rectangular object బయటకు వచ్చింది చూడండి. ఇది ఇప్పుడు మనం ఉపయోగిస్తున్న smart phone లాగ ఉంది కదా. మనం ఇక్కడ చూస్తున్నది నిజంగానే ఒక సెల్ ఫోనేనా? పురాతన హిందూ దేవాలయంలో ఇలాంటి ఒక విగ్రహాన్ని చెక్కడం అనేది సాధ్యమేనా?
ఈ ప్రశ్నకు స్థానికులు, పూర్తిగా different angleలో ఆలోచించి పూర్తిగా different answerను ఇస్తున్నారు. ఇక్కడున్న ఈ విగ్రహాలు మరియు శిల్పాలన్నీ, మానసిక శక్తుల సహాయంతో పురాతన కాలంలో చేయబడ్డాయని చెప్తున్నారు. ఈ గుడిని కట్టిన నిర్మాణ దారుడు, లోతైన ఆధ్యాత్మికం మరియు అతను తన మానసిక సామర్థ్యాలను ఉపయోగించి భవిష్యత్తు తరం ఎలా ఉంటుందో ఊహించగలడు అని చెప్తున్నారు. అయితే పురాతన నిర్మాణ దారులు, తమ మానసిక శక్తులను ఉపయోగించి, వేల సంవత్సరాల తర్వాత తమ భవిష్యత్తు తరాలు ఎలా ఉంటాయో అని ఊహించగలరు అనేది సాధ్యమేనా? ఈ విధంగా కొంతమంది చెప్తున్నది నమ్మాలని లేదు, అలా అని నమ్మకుండా ఉండలేకపోతున్నాం కూడా, అదే విధంగా ఈ గుడి గోపురంలో ఉన్న మరో interesting అయిన విషయాన్నీ వాళ్ళు మనకు చూపిస్తున్నారు.