విష్ణువు యొక్క నిజమైన చక్రం ఇదేనా? ఈ ఆయుధాన్ని రహస్యంగా కాపాడుతున్న థాయ్ లాండ్ ప్రభుత్వం!
Hey guys, ఈ రోజు మనం ఇండియా యొక్క సంప్రదాయ ఆయుధమైన చక్ర లేదా చక్రం అనే దాని గురించి చూడబోతున్నాము. ఇది medieval కాలానికి చెందిన చక్రం అంటే మధ్యయుగ చక్రం దీనికి మించి చాలా advanced అయిన చక్రాలు చాలా ఉన్నాయి, foe exampleకి ఈ సుదర్శన చక్రాన్ని చుడండి ఇది చాలా పురాతనమైన చక్రం దీని గురించి మనం కొన్ని నిమిషాల్లో తర్వాత చూద్దాం. ఇప్పుడు, నేను ఈ చక్రాన్ని ring చక్ర అని పిలుస్తాను, ఇది metalతో చేసిన round అయిన ఒక circle. ఇది ఒక special అయిన ఆయుధం ఎందుకంటే, మనం normalగానే ఆయుధాలను చేతులతో పట్టుకుని ఉపయోగిస్తాము, కానీ ఇది చేతులతో పట్టుకుని ఉపయోగించే ఆయుధం కాదు విసిరే ఆయుధం అదే దీని speciality.
పక్కన నుండి జగమాడుతున్నప్పుడు ఈ చక్రాన్ని కత్తి లాగ easyగా చేతిలో పట్టుకొని నరికే ఆయుధంగా use చేయవచ్చు, కానీ ఈ చక్రం యొక్క అందమే దాన్ని విసిరేసేటప్పుడు మాత్రమే తెలుస్తుంది. దీన్ని mostly విసిరేసే ఆయుధంగా use చేసుంటారు. దీన్ని మనుషుల పై విసిరితే ఇది ఎంత వరకు గాయపరుస్తుంది మీరు చూడవచ్చు. ఈ ఆయుధాన్ని ఒకరి మెడపై విసిరినట్లయితే అది చాలా లోతైన గాయాన్ని ఏర్పరుస్తుంది, అది వాళ్ళ ప్రాణాలకే ప్రమాదమైయ్యే విధంగా చేస్తుంది. మీరు శత్రువును sideలో నుండి కొట్టినా కూడా, కోత చాలా లోతుగా ఉంటుంది. గొడ్డలి లాంటి ఇతర విసిరే ఆయుధాలన్నిటి కంటే ఈ చక్రం కొంచం differentగా ఉంటుంది.
మనం విసిరే గొడ్డలి ఒకే ఒక pointలో మాత్రమే తగిలి దెబ్బతింటుంది, కానీ ఈ చక్రం దేనితోనైనా contact అయినప్పుడు, ఇది తిరుగుతూ పోతుంది కాబట్టి అది శత్రువు యొక్క శరీరం లోపల చాలా లోతైన పెద్ద కోత ఏర్పడుతుంది.. అలాంటి ఒక కోతను మీరు ఇక్కడ చూడవచ్చు. సాధారణంగా, ఇలాంటి చక్రం యొక్క radius రెండు అంగుళాల నుండి ఆరు అంగుళాల వరకు ఉంటుంది. ఈ చక్రం యొక్క వెలుపల circumference sharpగా ఉంటుంది, లోపల ఉన్న circumferenceలో మొద్దుబారినట్టు ఉంటుంది, కాబట్టి మీరు దాని లోపల నుండి safeగా పట్టుకోవచ్చు అది మాత్రమే కాదు దాని లోపల మీ వేళ్లతో కూడా తిప్పవచ్చు అలాగే శత్రువులపై విసిరేయవచ్చు.
ఇప్పుడు, ఇది నిజంగానే పురాతన ఆయుధం కాబట్టి ఇది అంతగా sharp ఐనది కాదు, నా friend జయేష్ లాంటి పురాతన వస్తువులను collect చేసే వాళ్ళు ఇది దాని ప్రాచీనతను కోల్పోతుందని దీన్ని sharp చేయరు, కానీ ఇది ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా తీవ్రమైన గాయాన్ని కలిగిస్తుంది. సరే ఇప్పుడు ఈ ఆయుధం వెనుక ఉన్న చరిత్ర ఏంటి? పదిహేను వందల సంవత్సరం నుండి ఈ ఆయుధానికి సంబంధించిన solidఐన historical recordsలు మన దగ్గర ఉన్నాయి. యూరోపియన్లు భారతదేశానికి వచ్చినప్పుడు, సిక్కులు అని పిలువబడే sikhism మతానికి చెందిన వాళ్ళు ఈ ఆయుధాన్ని ఉపయోగించడాన్ని చూసి చాలా ఆశ్చర్యపోయారు.
సిక్కులు వారి సమగ్రతానికి, ధైర్యానికి చాలా ప్రసిద్ధి చెందినవాళ్లు, వాళ్ళు సిక్కు మతం అని పిలువబడే మతాన్నిfollow చేస్తున్నారని కూడా మనకు తెలుసు. సిక్కు వీరులు పొడవాటి శంఖు ఆకారపు తలపాగాను పెట్టుకుంటారని, అందులో different sizesలలో ఉన్న చక్రాలను వాటిపై ఉంచారని యూరోపియన్లు చెప్తున్నారు. కుడిచేతి చూపుడు వేలుపై ఒక చక్రాన్ని ఉంచి, చాలా సార్లు తిప్పి, తరువాత full శక్తితో శత్రువులపై విసిరితే ఇందులో ఉన్న sharp edges భయంకరమైన లోతైన గాయాలను చేస్తుంది అంతే కాకుండా శత్రువుకు ప్రాణాపాయాన్ని కూడా కలుగజేస్తుంది.
యూరోపియన్ ల గమణికలన్నీ చాలా స్పష్టంగా ఉన్నప్పటికీ, వాళ్ళ దగ్గర ఎటువంటి pictures లేవు. కానీ అక్బర్ నామ అనే ఒక పాత భారతదేశ పుస్తకాలలో ఈ చక్రం యొక్క pictures ఉన్నాయి, ఇవన్నీ పదహారవ శతాబ్దానికి చెందిన నిజమైన picturesలు. మీరు ఇందులో చాలా ఎగిరే చక్రాలను చూడవచ్చు ఇంకా మీరు లోతైన కోతలతో గాయపడిన వ్యక్తులను కూడా చూడవచ్చు. ఈ వ్యక్తులు ఈ చక్రాలను ఎలా వేసుకున్నారో గమనించండి ఇంకా వారిలో కొంత మంది వేళ్ళతో వీటిని తిప్పుతున్నారు. ప్రతి వీరుని చేతిలో దాదాపు అర డజను చక్రాలను నేరుగా ముందున్న వాళ్లపై విసిరివేస్తాడు, ఇది శత్రువుల సైన్యాన్ని పూర్తిగా నాశనం చేస్తుంది.
ఏ యుద్ధం జరిగినా మొదటి కొన్ని నిమిషాలకు శత్రువులపైకి చక్రాలను మాత్రమే విసురుతారు. ఇప్పుడు, Historiansలు ఈ ఉంగర చక్రం 1500 A.D కి ముందు సిక్కులు కనిపెట్టారని చెప్తున్నారు. అయితే, రెండు వేల పద్నాలుగులో, south indiaలో తవ్వబడినప్పుడు ఒక రాతి స్తంభాన్ని కనిపెట్టారు and అందులో ఒక proof దొరికింది, ఇది సిక్కు మతం పుట్టడానికి చాలా శతాబ్దాల ముందు ఈ ఉంగర చక్రం ఉపయోగించబడిందని ఉంది. సిక్కుమతం పద్నాలుగువందల అరవై తొమ్మిదిలో మాత్రమే స్థాపించబడింది, అయితే archeologistsలు ఈ స్తంభం చాలా పురాతనమైనదని చెప్తున్నారు.
ఇది పన్నెండు లేదా పదమూడవ శతాబ్దానికి చెందినదని confirm చేస్తున్నారు, అది మాత్రమే కాదు ఈ ఆయుధాన్ని హిందువులు ఉపయోగించారు, ఎందుకంటే త్రవ్వకాలు జరిగిన స్థలం ఒక హిందూ దేవాలయం. ఇది ఖచ్చితంగా ఒక చక్రాయుధం ఎందుకంటే దాని చుట్టూ మిగిలిన ఆయుధాలను కూడా చెక్కారు చుడండి. అయితే, చక్రాన్ని పన్నెండవ శతాబ్దంలో కనిపెట్టారా? కాదు, చక్రానికి చాలా లోతైన చరిత్ర ఉంది.
- Praveen Mohan Telugu












