చెన్నకేశవ గుడిలో ఊహకు అందని మర్మాలు! వివరించలేని అనేక రహస్యాలు! |ప్రవీణ్ మోహన్|
Hey guys ఈ రోజు నేను మీకు బేలూరులోని, చెన్నకేశవ అని పిలవబడే ఒక ప్రత్యేకమైన గుడిని చూపించబోతున్నాను. ఈ గుడి అనేక విచిత్రమైన శిల్పాలకు మరియు ఇంజనీరింగ్ విన్యాసాలకు ప్రసిద్ధి చెందింది, ఇందులో మిమ్మల్ని మొదటిగా తాకిన విషయం, ఈ అందమైన పెద్ద గోపురమే. ఇప్పుడు దాని పైభాగాన్ని మీరు zoom చేసి చూస్తే, రెండు చివర్లు, ఆవు కొమ్ముల్లాగా design చేశారు, అందుకనే దీన్ని గోపురం అని పిలుస్తున్నారా. సంస్కృత భాషలో ‘గో’ అనే పదానికి ఆవు అని కూడా అర్ధం వస్తుంది కదా.
ఇప్పుడు ఈ గోపురానికి పైన నిల్చోని ఈ గుడిని చూశారంటే, దీన్ని చాలా విచిత్రంగా design చేసినదాన్ని మీరు చూడవచ్చు. ఈ main structure యొక్క shapeని explain చేయడానికి, మాటలు కూడా లేదని నేననుకుంటున్నాను, దీని design చాలా విచిత్రంగా ఉంది, ఈ structure యొక్క అన్ని వైపులు ఒకే shapeలో లేవు, ఎందుకంటే వెనుక భాగంలో మరొక ప్రత్యేకమైన పువ్వు ఆకారంలో design ఉంది. ఈ గుడిలో మొత్తం 32 మూలలు ఉన్నాయి, ఈ మొత్తం గుడిని చూడండి, నేలపైన కట్టలేదు మొదట ఒక stage కట్టి, దాని పైన ఈ గుడిని కట్టారు, ఈ గుడికి మూడు వేర్వేరు entrance లు ఉన్నాయి.
ఈ పైభాగంలో చాలా విచిత్రమైన pattern ఉంది, అది చూడడానికి 6 కాళ్ళు ఉన్న ఒక కీటకం లాగ ఉంది కదా! ప్రధాన గదిలో ఉన్న విగ్రహం యొక్క positionనే ఈ కీటకం సూచిస్తుంది, ఇంకో మాటలో చెప్పాలంటే, సరిగ్గా ఆ గుర్తు క్రింద, ప్రధాన గది లోపల 9 అడుగుల పొడవున్న చెన్నకేశవ ప్రధాన దేవుని విగ్రహాన్ని మీరు చూడవచ్చు. దాని పక్కనే ఉన్న main structure లాంటి, అదే shapeతో design చేసిన మరొక చిన్న structureని మీరు చూడవచ్చు. పైనుండి చూసినప్పుడు, రెండు ఒకే shapeలో కనిపిస్తాయి. ఏంటది?
దానిని మీరు నేల నుండి చూసినప్పుడు, ఈ main structureని ఒక modelగా కట్టారని మీకు అర్ధమవుతుంది, అంటే ఆ main structure యొక్క చిన్న modelగా దీన్ని కట్టారు. Main structure కట్టక ముందే దీన్ని కట్టారని, అది కూడా ఒక modelగానే కట్టారని archeologists ఎహ్ confirm చేశారు, దాన్ని ఒక modelగా కట్టారు కాబట్టి దాని గోడలపైన ఎలాంటి చెక్కడాలు చెక్కలేదు. ఈ main structure పూర్తిగా చాలా అందమైన శిల్పాలు ఉన్నాయి. ఈ structureపై 10,000 కంటే ఎక్కువ శిల్పాలు ఉన్నాయని కనిపెట్టారు.
ఈ గుడిని కట్టి పూర్తి చేయడానికి వంద సంవత్సరాల కంటే ఎక్కువ సమయం పట్టిందని mainstream archeologistలు చెప్తున్నారు, అది కూడా వెయ్యి మందికి పైగా పని చేస్తేనే ఈ time line లోపల దాన్ని పూర్తి చేయగలరని చెప్తున్నారు. ఈ గుడి 900 సంవత్సరాల పురాతనమైనప్పటికీ, ఈ గుడి ఇప్పటి వరకు పని చేస్తూ చురుకుగానే ఉంది, అంటే ఇక్కడ ప్రతిరోజు హిందూ ఆచారాలు నిర్వహిస్తున్నారు. కానీ ఇది హిందూ గుడి అయినప్పటికీ, ఈ గుడి యొక్క entranceలో చాలా విచిత్రమైన ఒక రహస్యం దాగి ఉంది.
ఈ entrance పైన అనేక హిందూ దేవుళ్లతో కూడిన చాలా అద్భుతమైన శిల్పాలు ఉన్నాయి. ఇక్కడున్న 10 చిన్న చిన్న శిల్పాలు, విష్ణువు యొక్క 10 అవతారాలను మనకు చూపిస్తున్నాయి, కానీ ఇందులో ఉన్న 9వ అవతారం ఏంటని గమనించి చూడండి, ఇతను ఒక బుద్ధ భగవానుడు. ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది, ఎందుకంటే, ఈరోజుల్లో మనం బౌద్ధమతం, అలానే హిందూ మతం వేరే వేరే మతాలని మనం అనుకుంటున్నాము. అయితే, 900 సంవత్సరాల పురాతన హిందూ గుడిలో మనం బుద్ధుని విగ్రహాన్ని చూస్తున్నాము, అది మాత్రమే కాకుండా బుద్ధుడిని విష్ణువు యొక్క అవతారాలలో ఒకటిగా పరిగణించారు.
ఈ గుడి కేవలం దేవుళ్లను మాత్రమే కాకుండా ప్రాచీన మానవులు ఎలా జీవించారో కూడా మనకు చూపిస్తుంది. పురాతన ప్రజల ఇళ్లల్లో ఖచ్చితంగా బాల్కనీలు ఉండేవని మనం ఇక్కడ చూడవచ్చు. చాలా అంతస్తులు కట్టిన భవనాలలో, ప్రతి ఒక్క అంతస్థులో బాల్కనీ ఉండేదని ఈ చెక్కడాలు మనకు clearగా చూపిస్తున్నాయి, ఈరోజుల్లో మనం బాల్కనీలో కూర్చోని ఎలా relax అవుతామో, అలానే ఆ కాలంలో కూడా చేసుంటారు. కొన్ని శిల్పాలను ఎలాంటి కారణం లేకుండా కావాలనే నాశనం చేసారు.
ఈ బొమ్మను కావాలనే అక్కడక్కడ నాశనం చేశారు చూడండి, ఈ చెక్కడాన్ని చూస్తుంటే ఎవరో ఒక సుత్తిని తీసుకొని కావాలనే అక్కడక్కడ కొట్టి కొట్టి నాశనం చేసినట్టు ఉంది కదా. ఎవరు ఇతను? అతన్ని ఎందుకు నాశనం చేశారు? ఇతను అర్జునుడు, బాణం వదిలే దానిలో master, నేలపై ఉన్న నూనె గిన్నెలో, ఒక చేప reflectionని చూసి, దానిపై సరిగ్గా గురి పెట్టి, తన లక్ష్యంపైన ఈ బాణాన్ని విడుదల చేస్తున్నాడు. ఇదే విధమైన విగ్రహాన్ని మీరు మిగతా గుడులలో కూడా చూడవచ్చు, so, ఇతను అర్జునుడే అని ఎలాంటి సందేహం లేదు.
కానీ ఇక్కడ ఒక interesting అయినా విషయం ఏంటంటే, ఈ చెక్కడంలో, ఈ విల్లుపై ఉన్న తీగను నొక్కితే, 7 సంగీత స్వరాలు వినిపిస్తాయని ఇక్కడున్న ప్రజలు చెప్తున్నారు. రాయితో తయారు చేసిన ఒక తీగను నొక్కితే విచిత్రమైన స్వరంగాలను సృష్టించగలమా, ఒకసారి అలా ఊహించుకోండి, wow అలా ఊహించుకుంటేనే చాలా అద్భుతంగా ఉంది కదా. ఇది నిజమేనా అని మనం ఇప్పుడు confirm చేయలేము, కానీ ప్రజలు ఏం చెపుతున్నారంటే, ఈ శబ్దం వినడానికి, చిన్న చిన్న రాళ్లతో కొట్టి కొట్టి ప్రజలే దీనిని నాశనం చేశారని చెప్తున్నారు, అందుకే ఇది అక్కడక్కడ ధ్వంసం అయింది. ఇందులో ఇతర విచిత్రమైన వివరాలు ఉన్నందున అది ధ్వంసమైందని కొందరు వాదిస్తున్నారు. ఈ చెన్నకేశవ గుడి చాలా విచిత్రమైన శిల్పాలకు ప్రసిద్ధి చెందింది.
- Praveen Mohan Telugu










