#Captain #CaptainRaju #TodayDied #IndianActor ఈరోజు ప్రముఖ నటుడు కెప్టెన్ రాజు కన్నుమూత! ఈ మధ్య కాలంలో చిత్ర పరిశ్రమలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. గత నెల నుంచి తెలుగు, తమిళ, హిందీ పరిశ్రమలలో పలువురు నటీ,నటుల మరణం అందరిని దిగ్బ్రాంతికి గురి చేస్తున్నాయి.తాజాగా శత్రువు, రౌడీ అల్లుడు, కొండపల్లి రాజా, గాంఢీవం, మొండి మొగుడు పెంకి పెళ్లాం వంటి చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు.. కెప్టెన్ రాజు(68) నేటి(సోమవారం) ఉదయం మృతి చెందారు. హీరోల అధిపత్యానికి స్టార్ హీరోయిన్ బలి ఆయన కొంతకాలం ఇండియన్ ఆర్మిలో పనిచేసి ఆ తర్వాత సినిమాల్లోకి వచ్చారు. తెలుగు సినిమా బలిదానంతో వెండితెరకు పరిచయమైన ఆయన తెలుగు, తమిళ, కన్నడ, మళయాళ, హిందీ భాషల్లో సుమారు 500పైగా చిత్రాల్లో నటించారు. చివరి సారిగా ఆయన మలయాళ చిత్రం ‘‘ మాస్టర్ పీస్‌లో’’ కనిపించారు. ఆయన గత కొంతకాలంగా గుండె పోటుతో బాధపడుతున్నారని.. కొచ్చిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ తుదిశ్వాస విడిచారు.ఆయన మరణంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరౌతున్నారు.