Telangana Police Women Safety wing mission accomplishes for a year training programme of students 'Cyberathon2022'!
“CybHER III” as #Cyber Congress, an initiative of the #Women #Safety #Wing of #Telangana State #Police in collaboration with the Department of #School #Education. This Programme trains more than 3300 students from 1650 schools on using #information and #communications #technology selecting 100 students from each districts(33) in the state of Telangana. Grand Finale event conducted on thursday at #Bharatiya #Vidya #Bhavan participated by Department of police heads and School Education department officers with the collaboration of #YoungistaanFoundation, #Sheteam and Private it company.
తెలంగాణ గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో మహిళల రక్షణ, సైబర్ నేరాల నియంత్రణకు రాష్ట్ర వ్యాప్తంగా 3300 మంది సైబర్ అంబాసిడర్లకు శిక్షణ!
తెలంగాణ ప్రభుత్వం అట్టహాసంగా నిర్వహిస్తున్న 75 ఏళ్ల భారత స్వతంత్ర్య వజ్రోత్సవాల్లో భాగంగా మహిళలు, యువతీ యువకులు, పిల్లలు టార్గెట్ గా జరుగుతున్న సైబర్ నేరాలను అరికట్టేందుకు రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు పొందిన 1650 పాఠశాల్లో 3300 సైబర్ అంబాసిడర్లకు ఇచ్చిన శిక్షణ విజయవంతం అయ్యిందని పోలీస్ శాఖ తెలిపింది.
తెలంగాణ పోలీస్ శాఖకు చెందిన ఉమెన్ సేఫ్టీ వింగ్, డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు, టీచర్లకు ఏడాదిపాటు సైబర్ నేరాల నియంత్రణకై ప్రత్యేక శిక్షణ ఇవ్వడం జరిగింది.
తెలంగాణ పోలీస్ శాఖ, ఉమెన్ సేఫ్టీ వింగ్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల లో నిర్వహించిన సైబర్ కాంగ్రెస్ గ్రాండ్ ఫినాలే ముగింపు కార్యక్రమం గురువారం హైదరాబాద్, భారతీయ విద్యా భవన్ లో విజయవంతంగా నిర్వహించారు.
గంటల తరబడి సోషల్ మీడియా వినియోగం, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, స్మార్ట్ ఫోన్ ల వాడకంతో భవిష్యత్ లో సైబర్ నేరాలు ఎక్కువగా జరిగేందుకు అవకాశం ఉందని వీటిపై పోలీస్ యంత్రాంగం నిరంతర నిఘా పెట్టినప్పటికీ, మారుమూల గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో వీటి నియంత్రణకు, ఆదిలోనే గుర్తించేందుకు యువతీయువకులకు శిక్షణ ఇవ్వడం జరిగింది. ప్రతి జిల్లాలో గ్రామీణ ప్రాంతo లో 50 పాఠశాలలో ఇద్దరు చొప్పున 100 మంది సైబర్ అంబాసిడర్లు గా ఎంపిక చేసిన విద్యార్థులను పోలీస్ శాఖ వారు నేరాల నియంత్రణలో బాగస్వామ్యులను చేయడం జరిగిందని... విద్యార్థుల కు పోలీస్ శాఖ వారు సంవత్సరం పాటు కల్పించిన శిక్షణ విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఉమెన్ సేఫ్టీ వింగ్ భావిస్తోంది. గ్రామీణ ప్రాంతంలో సైబర్ నేరాలని అరికట్టేందుకు ఈ శిక్షణ ఉపకరిస్తుందని... విద్యార్థి దశలో మొబైల్ ను ఎంతవరకు వాడాలో అవగాహన తోపాటు, అనాలోచితంగా ఉపయోగించడం వల్ల సైబర్ నేరాలకు గురయ్యే అవకాశం ఎలా ఆస్కారం ఉంటుందో శిక్షణ ఇచ్చింది ఉమెన్ సేఫ్టీ వింగ్.
సెల్ఫోన్లు, అంతర్జాలం, ఆన్లైన్ వేదికల వినియోగం పెరుగుతున్న కొద్దీ సైబర్ నేరాల సంఖ్య పెరుగుతోందని... ముఖ్యంగా మహిళలు, పిల్లలే లక్ష్యంగా సైబర్ మోసాలు, వేధింపులు అధికమవుతున్నాయి. ఈ నేపథ్యంలో పిల్లలకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించే కార్యక్రమానికి పోలీసుశాఖ, ఉమెన్స్ సేఫ్టీ వింగ్ సైబర్ కాంగ్రెస్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని…అన్ని జిల్లాల్లోని గుర్తింపు పొందిన 50 ప్రభుత్వ పాఠశాలల్లో ఇద్దరు విద్యార్థులను, ఒక టీచర్ ను ఎంపిక చేసి ఆన్లైన్ సైబర్ మోసాల పై శిక్షణ ఇవ్వడం జరిగిందని అన్నారు తెలంగాణ పోలీస్ ఉన్నతాధికారులు. ప్రస్తుతం విద్యార్థులకు ఆన్లైన్ చదువులు అనివార్యమయ్యాయి చదువు మాత్రమే కాదు వైద్యం, అమ్మకాలు, కొనుగోళ్లు, ఉద్యోగాలు, లావాదేవీలు ఇలా అన్నీ ఆన్లైన్ వేదికగా కొనసాగుతున్నాయి. సెల్ఫోన్లు, అంతర్జాలం వినియోగం తప్పనిసరైంది. ఇదే సమయంలో సైబర్ నేరాలు సైతం పెరుగుతున్నాయి. ఆన్లైన్లో తరగతులు వింటున్న విద్యార్థులు సైబర్ మోసాల బారిన పడకుండా... అంతర్జాలంతో పాటు మొబైల్ వినియోగంపై అవగాహన కల్పించేందుకు సైబర్ కాంగ్రెస్ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది తెలంగాణ పోలీసు శాఖ, ఉమెన్ సేఫ్టీ వింగ్, విద్యాశాఖ, స్వచ్ఛంద సంస్థలు, మహిళా భద్రతా విభాగం సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి అని తెలిపారు. సైబర్ కాంగ్రెస్ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో సైబర్ నేరాలను నియంత్రించాలని, విద్యా వ్యవస్థలో ఆన్లైన్ భద్రతపై అవగాహన కల్పించాలని పోలీసు శాఖ భావిస్తోంది. తల్లిదండ్రులు, ఆడపిల్లలు, మహిళలు, యువతకు వీటిపై అవగాహన కల్పించనుంది. సైబర్ కాంగ్రెస్లో నేర్చుకున్న విషయాల్ని అంబాసిడర్లు తోటి విద్యార్థులకు, తల్లిదండ్రులకు, సమాజానికి అవగాహన కల్పించాల్సి ఉంటుంది. ఉపాధ్యాయులు సైతం సైబర్ నేరాల నియంత్రణలో తమవంతు పాత్ర పోషించాల్సి ఉంటుంది. ఆన్లైన్ మోసాలు పెరుగుతున్న నేపథ్యంలో విద్యార్థులకు మాత్రమే కాదు.. అందరికీ అవగాహన తప్పనిసరి అన్నారు. శిక్షణలో ప్రతిభ కనబర్చిన విద్యార్థినీ విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేయడం జరిగిందని తెలియజేసారు తెలంగాణ పోలీస్ ఉన్నతాధికారులు.
-Venkateshwarlu Boya, Sr Journalist, Hyderabad