వాదమేలనమ్మ వేదాలరాణి
వాదమేలనమ్మ వేదాలరాణి .. మమ్ము వేధింప నీకేమి వింతలమ్మ,
బ్రహ్మ విద్యలున్న ఆ స్వామిని .. హృదయకమలమున బంధించినావు,
కల్లలాడు రామకృష్ణుని కరుణించి .. కంకణమున కాంతి చూపినావు,
సతీసుమతని దయతలచి .. భాస్కరుని ఆపి పతిభిక్షపెట్టినావు,
ఇన్నిమహిమలున్న ఓ మంజువాణి .. మనస్సు రంజింపేవా
-----------------------------------------------------------------
ఓ తల్లీ నిన్ను తలంచి నేనొక్క వరమడిగితిని
నీవు నా వాక్కున నిలిచి ఉల్లాసమునిచ్చి
నేను వ్రాసేటి పరీక్షల పత్రములందు నిలిచి
ఫలితమందున వెలసి తప్పులనుదద్ది ఒప్పించు
భారమ్ము నీదేసుమా అఖిలాండేశ్వరి ఆదిశక్తివమ్మా
ఆలస్యము చేయకమ్మా........
---------------------------------------------------------------------
కోటినామాలతో కొల్లలుగ పూజింతు
లక్ష నామాలతో లక్ష్మివని నినుతలతు
వేయనామాలతో శంభురాణిగ పిలతు
శతనామాలతో లల్లితవని పూజింతు
కోరుకున్నట్టి వరములనీయవమ్మా
కోటి మల్లెలతో నిన్ను కొలతునమ్మా...













