ప్రియుడితో కలిసి ఆత్మహత్య చేసుకున్న వివాహిత!
వారిద్దరు ఏడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు... ఇంటర్లో వారి ప్రేమ మొదలైంది.. చివరికి ఓ చెట్టు దగ్గర వారి ప్రేమ కథ ముగిసింది.. ఒకరిని విడిచి మరొకరు ఉండలేక కలిసి తనువు చాలించారు.. ఈ విషాదకరమైన ఘటన వికారాబాద్ జిల్లా నవాబ్ పేట మండలం నారెగూడ(పూలపల్లి) లో చోటుచేసుకుంది.. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం కు చెందిన కార్తీక్ (21), మీనా( 21) ఒకరినొకరు ప్రేమించుకున్నారు.. ఇంటి పక్కనే ఉండడంతో వీరి మనసులు కూడా కలిసిపోయాయి.. అయితే ఈ విషయం ఇరువురి కుటుంబ సభ్యులకు తెలియడంతో కొంచెం గొడవలు జరిగాయి.. ఇద్దరు కులాలు వేరు కావడంతో మళ్లీ ఎప్పుడు కలవద్దని మందలించారు.. వీరమరణం పొందిన సైనికులు వీరే! ప్రేమించిన పాపానికి మూత్రం తాగించారు! ఈ నేపథ్యంలోనే మీనాకి మహేశ్వరం మండలం గట్టుపల్లికి చెందిన యువకుడితో గత నెలలో వివాహం జరిపించారు.. అయినప్పటికీ మీనా, కార్తీక్ ఒకరిని ఒకరు విడిచి మరొకరు ఉండలేక పోయారు.. ఈ క్రమంలో ఇంటి నుంచి పెళ్లికి వెళ్తున్న అని చెప్పిన కార్తీక్ బయటకు వచ్చాడు.. అత్తవారింట్లో కూడా ఎవరూ లేకపోవడంతో మీనా కూడా బయటకు వచ్చింది.. ఇంటర్మీడియట్ ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి ఈ క్రమంలో వారు పూలపల్లి లోని శివార్లో ఒక చెట్టుకు ఉరి వేసుకున్నారు.. ఈ విషయాన్ని స్థానిక రైతుల గురించి కుటుంబ సభ్యులకు వెల్లడించారు.. అక్కడికి చేరుకొని కుటుంబ సభ్యులు తమ పిల్లల్ని అలా చూసి బోరున విలపించారు.. ఆత్మహత్య చేసుకునే ముందు ప్రేమ జంట ఓ సూసైడ్ నోట్ ని రాసింది.. అందులో మేము ఏడు ఏళ్లుగా ప్రేమించుకుంటున్నాం.. మా పెళ్లికి పెద్దలు అంగీకరించలేదు.. కలిసి చనిపోతున్నాం, దీనికి ఎవరు కారణం కాదు ఎవరూ బాధపడొద్దు..అని రాసి ఉంచారు. Read the full article











