#teachersday :పూజారి కాబోయి రాష్ట్రపతి అయ్యారు… అరిటాకులు కొనలేక నేల మీదే వడ్డించుకున్నారు.. 🤝భారతరత్న’ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి నేడు. Job Creater ✍️ఆయన పుట్టిన రోజును ఆయన గౌరవార్థం 1962వ సంవత్సరం నుంచి జాతీయ ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకొంటున్నాం. ✍️ఉపాధ్యాయ వృత్తి నుంచి భారత ప్రథమ పౌరుడి స్థాయికి ఎదిగిన అరుదైన ఘనత ఆయన సొంతం. ✍️అయితే, రాష్ట్రపతిగా కంటే తత్వవేత్తగానే ఆయన ప్రపంచానికి ఎక్కువగా పరిచయం. భారతీయ తాత్విక దృక్పథాన్ని ప్రపంచ దేశాలకు అందించిన గొప్ప వ్యక్తుల్లో ఒకరిగా ఆయన నిలిచారు. ✍️ఉపాధ్యాయుడిగా, తత్వవేత్తగా, రచయితగా, రాజనీతిజ్ఞుడిగా సర్వేపల్లి ప్రయాణం బహుముఖాలుగా సాగింది. ✍️తమిళనాడులోని తిరుత్తణిలో 1888లో ఒక తెలుగు కుటుంబంలో జన్మించిన రాధాకృష్ణన్ 21 ఏళ్లకే మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో ప్రొఫసర్ అయ్యారు. ✍️ఉపాధ్యాయుడిగా అక్కడి నుంచే విద్యార్థులపై చెరగని ముద్ర వేశారు. ప్రఖ్యాత ఆక్స్ఫర్డ్ యూనవర్సిటీలోనూ ఆయన పాఠాలు చెప్పారు. ✍️భారతీయ తత్వాన్ని ప్రపంచానికి అందించేందుకు అనేక పుస్తకాలు రాశారు. #teachers #jobcreater #job #september #SarvepalliRadhakrishnan #jobs #students #hyderabad #telangana #AndhraPradesh https://www.instagram.com/p/CiG7Az2ri8Q/?igshid=NGJjMDIxMWI=


















