వెస్టిండీస్ టూర్ లో టీమిండియా ఆటగాళ్లు ఫుల్ జోష్ తో ఎంజాయ్ చేస్తున్నారు. టెస్ట్ సిరీస్ ప్రారంభానికి ఇంకా టైమ్ ఉండటంతో కరీబియన్ దీవుల అందాలను అస్వాదిస్తున్నారు. విండీస్ లో ల్యాండ్ అవ్వగానే బీచ్ లు, రిసార్ట్ లను సందర్శించిన టీమిండియా.. రెండో రోజు ఫిట్ నెస్ కోసం శ్రమించింది. అందులోనే ఎంజాయ్ మెంట్ ఉండేలా కొహ్లీసేన చూసుకుంది.
ఎంజాయ్ కి ఎంజాయ్.. ఫిట్ నెస్ కి ఫిట్ నెస్.. ఈ రెండూ కలిసొచ్చేలా బీచ్ వాలీబాల్ ఆడారు టీమిండియా క్రికెటర్లు. దొరికిందే ఛాన్స్ అనుకున్నారో ఏమో.. హాయిగా షర్టులు విప్పేసి బీచ్ వాలీబాల్ అడేశారు. ముఖ్యంగా కొహ్లీ అయితే ఓ రేంజ్ లో ఆడేశాడు. అతనితో పాటు శిఖర్ ధావన్, కే.ఎల్ రాహుల్, పుజారా, ఇషాంత్ శర్మ, రహానే, అశ్విన్, భువనేశ్వర్, మురళీ విజయ్ ఇలా అందరూ ఉల్లాసంగా వాలీబాల్ అడారు.
సాధారణంగా ఫిట్ నెస్ కోసం టీమిండియా ఫుట్ బాల్ ఆడుతుంది కానీ.. ఈ సారి వెరైటీగా బీచ్ వాలీబాల్ ను ఎంచుకుంది. విండీస్ వాతావరణానికి సరిపడే గేమ్ అనుకున్నారో ఏమో మనోళ్లు వాలీబాల్ ను సెలెక్ట్ చేసుకున్నారు. ఏదైతేనేం.. అటు ఫిట్ నెస్.. ఇటు ఆనందం.. కొహ్లీ సేన సొంతం.
కరేబియన్ తీరంలో హాఫ్ న్యూడ్ గా మనోళ్లు ఏం చేశారో తెలుసా ..? వెస్టిండీస్ టూర్ లో టీమిండియా ఆటగాళ్లు ఫుల్ జోష్ తో ఎంజాయ్ చేస్తున్నారు. టెస్ట్ సిరీస్ ప్రారంభానికి ఇంకా టైమ్ ఉండటంతో కరీబియన్ దీవుల అందాలను అస్వాదిస్తున్నారు. విండీస్ లో ల్యాండ్ అవ్వగానే బీచ్ లు, రిసార్ట్ లను సందర్శించిన టీమిండియా.. రెండో రోజు ఫిట్ నెస్ కోసం శ్రమించింది. అందులోనే ఎంజాయ్ మెంట్ ఉండేలా కొహ్లీసేన చూసుకుంది. ఎంజాయ్ కి ఎంజాయ్.. ఫిట్ నెస్ కి ఫిట్ నెస్.. ఈ రెండూ కలిసొచ్చేలా బీచ్ వాలీబాల్ ఆడారు టీమిండియా క్రికెటర్లు. దొరికిందే ఛాన్స్ అనుకున్నారో ఏమో.. హాయిగా షర్టులు విప్పేసి బీచ్ వాలీబాల్ అడేశారు. ముఖ్యంగా కొహ్లీ అయితే ఓ రేంజ్ లో ఆడేశాడు. అతనితో పాటు శిఖర్ ధావన్, కే.ఎల్ రాహుల్, పుజారా, ఇషాంత్ శర్మ, రహానే, అశ్విన్, భువనేశ్వర్, మురళీ విజయ్ ఇలా అందరూ ఉల్లాసంగా వాలీబాల్ అడారు. సాధారణంగా ఫిట్ నెస్ కోసం టీమిండియా ఫుట్ బాల్ ఆడుతుంది కానీ.. ఈ సారి వెరైటీగా బీచ్ వాలీబాల్ ను ఎంచుకుంది. విండీస్ వాతావరణానికి సరిపడే గేమ్ అనుకున్నారో ఏమో మనోళ్లు వాలీబాల్ ను సెలెక్ట్ చేసుకున్నారు. ఏదైతేనేం.. అటు ఫిట్ నెస్.. ఇటు ఆనందం.. కొహ్లీ సేన సొంతం.













