RP 4 a by Upadhye Guruji
seen from United States

seen from United States
seen from Canada

seen from South Korea
seen from Türkiye
seen from Türkiye
seen from Türkiye
seen from Türkiye
seen from Russia
seen from Argentina

seen from United States
seen from Saudi Arabia
seen from Türkiye

seen from United States
seen from Japan
seen from Thailand
seen from United States
seen from Malaysia
seen from United States

seen from Malaysia
RP 4 a by Upadhye Guruji
Breaking News – New Parties: Are Kavitha and Mallanna parties targeting BCs?
ఈ రెండు పార్టీల రాకతో తెలంగాణ రాజకీయ సమీకరణాలు మారే అవకాశం ఉందని రాజకీయ పండితులు భావిస్తున్నారు. ఈ పార్టీలు ప్రజల ముందుకు
మహిమగల దేవుడు మల్లన్న దయతో ప్రజలందరూ సంతోషంగా ఉండాలి: ఎమ్మెల్యే కేపీ.వివేకానంద
Trinethram News : ఈరోజు 125-గాజుల రామారం డివిజన్ మెట్కానిగూడలోని శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానం నందు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్న స్వామి వారి జాతర కార్యక్రమానికి ఎమ్మెల్యే కేపీ.వివేకానంద ముఖ్యఅతిథిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ.వివేకానంద మాట్లాడుతూ మహిమ గల దేవుడు మల్లన్న స్వామిని కొలవడం ద్వారా బాధలు తొలగి సుఖ సంతోషాలు చేకూరుతాయన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ రావుల శేషగిరి, డివిజన్ అధ్యక్షులు విజయరామ్ రెడ్డి, జగద్గిరిగుట్ట శ్రీ వెంకటేశ్వర దేవస్థానం ఆలయ కమిటీ చైర్మన్ వేణు యాదవ్, పాక్స్ డైరెక్టర్ పరిశే శ్రీనివాస్ యాదవ్, సీనియర్ నాయకులు కస్తూరి బాల్ రాజ్, అడ్వకేట్ కమలాకర్, సూరారం డివిజన్ అధ్యక్షులు పుప్పాల భాస్కర్, ఆలయ కమిటీ సభ్యులు మల్లేష్ యాదవ్, బాలరాజు యాదవ్, గోపాల్ యాదవ్, సత్యనారాయణ యాదవ్, యాదగిరి యాదవ్, బాల మల్లేష్ యాదవ్, ఆంజనేయులు యాదవ్, నాగేష్ యాదవ్, భాస్కర్ యాదవ్, మహేష్ యాదవ్, సంపత్ యాదవ్, శివ తదితరులు పాల్గొన్నారు.
Read the full article
ఈసారీ అసెంబ్లీ సమావేశాలు అట్టర్ ప్లాప్: మల్లారెడ్డి
అసెంబ్లీ ఆవరణలో మాజీ మంత్రి ఎమ్మెల్యే మల్లారెడ్డి చిట్ చాట్ వీళ్లకి మేడిగడ్డ తప్పా, వేరే గడ్డనే దొరకడం లేదన్న మల్లన్న.. రోజు మేడిగడ్డ మేడిగడ్డ అంటే ప్రజలు బేజారవుతున్నారని అన్న మల్లారెడ్డి.. మేడిగడ్డ ప్రాజెక్ట్ ఏదో లీక్ అయింది. దానిని సరి చెయ్యాలన్న మల్లన్న.. హరీష్ రావు వన్ మెన్ హీరో అని వ్యాఖ్య..
Read the full article
తీన్మార్ మల్లన్న భార్యకు డిప్యూటేషన్ పై నాగోలుకు బదిలీ
Trinethram News : హైదరాబాద్, ఫిబ్రవరి 04 కాంగ్రెస్ పార్టీ నేత చింతపండు నవీన్‌కుమార్ తీన్మార్ మల్లన్న భార్య కొండాపురం మాతమ్మకు ప్రభుత్వం గ్రేటర్‌లోని ఓ స్కూల్లో ఆన్‌డ్యూటీ సౌకర్యాన్ని కల్పించింది. మాతమ్మ ప్రస్తుతం యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం సంగెం జెడ్పీ హైస్కూళ్లో పీఈటీగా పనిచేస్తున్నారు. ఆమెను మేడ్చల్- మల్కాజిగిరి జిల్లా నాగోలు జెడ్పీ హైస్కూల్లో ఏడాది పాటు ఆన్‌డ్యూటీ ఓడీ, సౌకర్యం కల్పిస్తూ యాదాద్రి-భువనగిరి జిల్లా డీఈవో నారాయణరెడ్డి శనివారం సాయంత్రం ఉత్తర్వులు ఇచ్చారు. మల్లన్న కూతురు వైకల్యంతో బాధపడుతున్న నేపథ్యంలో మానవతా దృక్పథంతో ప్రభుత్వం ఆమెకు ఓడీ సౌకర్యం కల్పించినట్టు తెలిసింది. ఇదే తరహాలో మరికొందరికి సైతం ప్రభుత్వం ఓడీ సౌకర్యాన్ని కల్పించింది. మరోచోట ఎస్పీ భార్యతో పాటు, భార్యకు పక్షవాతం, భర్తకు ధీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్న వారినీ ప్రభుత్వం బదిలీచేసింది.
Read the full article
కొమురవెల్లి మల్లన్న ఆలయానికి పోటెత్తిన భక్తులు
Trinethram News : సిద్దిపేట జిల్లా:ఫిబ్రవరి 04 సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. స్వామి వారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. పట్నాలు, బోనాలు సమర్పించి భక్తులు స్వామి వారి మొక్కులు చెల్లించుకుంటున్నారు. స్వామి వారి దర్శనానికి 5 గంటలకు పైగా సమయం పడుతుంది. శని,ఆదివా రాలు మల్లన్న ఆలయానికి భారీగా భక్తులు అధిక సంఖ్యలో చేరుకున్నారు….
Read the full article
భౌరంపేట్ మల్లన్న జాతరకు విచ్చేయాలని కోరుతూ MLC మరియు MLA కి ఆహ్వానం
భౌరంపేట్ మల్లన్న జాతరకు విచ్చేయాలని కోరుతూ MLC మరియు MLA కి ఆహ్వానం… కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, దుండిగల్ మున్సిపాలిటీ పరిధి భౌరంపేట్ లో ఈ నెల 28-01-2024 నుండి 30-01-2024 వరకు నిర్వహించబోయే శ్రీ శ్రీ శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవి కళ్యాణము, శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి వారి కళ్యాణము మరియు జాతరలో ముఖ్య అతిధిలుగా పాల్గొనాలని కోరుతూ ఈరోజు భౌరంపేట్ గ్రామ BRS నాయకులు గౌరవ మేడ్చల్ జిల్లా BRS పార్టీ అధ్యక్షులు, MLC శంభిపూర్ రాజు కి మరియు గౌరవ MLA కేపీ. వివేకానంద కి ఆహ్వాన పత్రికలను అందచేసారు. ఈ కార్యక్రమంలో భౌరంపేట్ కౌన్సిలర్ నర్సారెడ్డి శ్రీనివాస్ రెడ్డి, BRS పార్టీ నాయకులు మురళీ యాదవ్, విష్ణువర్ధన్ రెడ్డి, బల్వంత్ రెడ్డి, యాదగిరి, నాగరాజు, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
Read the full article
ఐనవోలు మల్లన్న స్వామి బ్రహ్మోత్సవాలు
"ఐనవోలు మల్లన్న స్వామి బ్రహ్మోత్సవాలు : ఉత్తర తెలంగాణ వాసులు కొంగు బంగారంగా కొలిచే ఐనవోలు మల్లన్న ఆలయం బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధమైంది. ఈ నెల 13 నుంచి ఉగాది వరకు సాగే జాతరకు భక్తులు ముందుగానే తరలివస్తున్నారు. ఈ ఏడాదిలోనే సమ్మక్క-సారలమ్మ జాతర ఉండటంతో భక్తుల సంఖ్య మరింత పెరగనుంది. బోనాలు, శివసత్తుల పూనకాలు, పెద్ద పట్నాలతో మల్లికార్జున స్వామి జానపదుల జాతర కన్నుల పండువగా సాగనుంది.. "ఐనవోలు మల్లన్న స్వామి బ్రహ్మోత్సవాలు : రాష్ట్రంలోని ప్రముఖ శైవ క్షేత్రాల్లో ఒకటైన హనుమకొండ జిల్లా ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి ఆలయం బ్రహ్మోత్సవాలకు ముస్తాబైంది. ముచ్చటైన స్వాగత తోరణాలు, అద్భుతమైన శిల్ప సంపదతో ప్రకృతి రమణీయతను పంచే ఆలయం చూపరులను ఇట్టే ఆకట్టుకుంటుంది. వందల ఏళ్ల క్రితం నిర్మితమైన ఆలయంలో ఏటా సంక్రాంతి నుంచి ఉగాది వరకు వైభవంగా బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఇరు తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఛత్తీస్‌గఢ్ సహా విదేశాల నుంచి సైతం భక్తులు తరలివచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. "ఐనవోలు మల్లన్న స్వామి Jathara Start Jan 13th : ఈనెల 13న సంక్రాంతి ఉత్సవాలు ప్రారంభం కానుండగా, 14, 15 బండ్లు తిరుగుట, 16న మహా సంప్రోక్ష సమారాధన జరగనుంది. ఫిబ్రవరి 2న భ్రమరాంబిక అమ్మవారి వార్షికోత్సవం, 17న రేణుకా ఎల్లమ్మ పండుగ నిర్వహించనున్నారు. మార్చి 9నుంచి 13వరకు శివరాత్రి కల్యాణోత్సవాలు, ఏప్రిల్ 13న ఉగాది కార్యక్రమాలతో ముగుస్తాయని ఆలయ ప్రధానార్చకులు వెల్లడించారు. 'మకర సంక్రాంతి పండుగ రోజు మనకు బాగా వర్షాలు కురిసి పంటలు సమృద్ధిగా పండాలనే ఉద్దేశంతో చుట్టుపక్కల ఉన్న గ్రామల రైతులు ఎడ్ల బండ్లతో ప్రభలను నిర్వహించి, వారి భక్తిని చాటుకుంటారు. అలాగే ఈ ఆలయంలో మహా శివరాత్రి సందర్భంగా కూడా ఐదు రోజులు ప్రత్యేక బ్రహ్మోత్సవాలుంటాయి. ఉగాది ముందు వచ్చే ఆకరి ఆదివారం కూడా స్వామివారికి సుమారు 50 అడుగుల విస్తీర్ణంతో పెద్ద పట్నం కార్యక్రమం నిర్వహించబడుతుంది. అలాగే స్వామివారికి కల్యాణం కూడా జరుగుతుంది.' -రవీందర్ శర్మ, ప్రధాన అర్చకులు, ఐనవోలు ఆలయం.. "Inavolu Jatara in Telangana 2024 : ఈ ఏడాది ఆదివాసీ కుంభమేళా అయిన మేడారం జాతర(Medaram Jatara 2024) ఉండటంతో భక్తులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉంది. లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టారు. అదనపు క్యూలైన్లు, తాగునీరు, చలవ పందిళ్లు, మరుగుదొడ్లు వంటి మౌలిక సదుపాయాలు కల్పించనున్నట్లు ఆలయ కార్యనిర్వాహణ అధికారి తెలిపారు. జాతరలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నారు. 'భక్తులు గతంలో కంటే ఈసారి రెట్టింపు సంఖ్యలో వస్తారని అంచనా వేస్తున్నాం. అంటే సుమారు 9 నుంచి 10 లక్షల మంది భక్తులు వస్తారని అనుకుంటున్నాం. వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని సదుపాయాలు ఏర్పాటు చేయడం జరిగింది. కరోనా మహమ్మరి మళ్లీ వస్తుండడంతో దానిని దృష్టిలో పెట్టుకొని దేవాదాయ అధికారుల ఆదేశాల మేరకు ఒక్కొక్కరుగా వచ్చేలా ఏర్పాటు చేస్తున్నాం. భక్తులకు కరోనా భయం లేకుండా స్వామివారిని దర్శించుకునేలా సిద్ధం చేస్తున్నాం.' -నాగేశ్వర్రావు, కార్య నిర్వాహణ అధికారి, ఐనవోలు ఆలయం.
Read the full article