కనిపెట్టు . . .పనిపట్టు . . .
ఈ భూమి మీద సమస్త ప్రాణికోటిలోకి ఉత్కృష్టమైన ఉత్తమోత్తమమైన ప్రాణి మనిషి .అట్టి మానవుడు తన జన్మమును అల్ప సంతోషాలకై,ఆశాశ్వత ఆనందాలకై,నీచపు సంపదలకై వినియోగిస్తూ, ఆగని పరుగులనే సాగిస్తూ పుట్టుక పరమార్ధాన్ని,మనుగడ సాఫల్యతను విస్మరిస్తూ నిర్లజ్జగా,నిస్సంకోచంగా ,నీచంగా,హీనంగా జీవించేస్తున్నాడు.ఇది కాదు జీవితం. ఇలా కాదు జీవించటం.జీవించటమంటే ఎలాగోలా బతికేయటం కాదు. మన కోసం మనం జీవించటం జీవితమసలే కాదు.నలుగురికి నచ్చేట్టు,పదుగురు మెచ్చేట్టు,ఎందరికో స్పూర్తినిచ్చేట్టు జీవించగలగటమే జీవితం.అలా జీవించగలిగితేనే మానవ ఈ మానవ జన్మకుసార్ధకత.
కానీ ఈర్ష,అసూయ ,ద్వేషం,పగ,ప్రతీకారం,స్వార్ధం మనిషిని అలా జీవించనీయకుండా అడ్డుకుంటున్న దుష్టశక్తులుగా తయారౌతున్నాయి.ఇట్టి దుష్టశక్తులను కనిపెట్టి వాటి పనిపట్టి తరిమికొట్టాలి .అప్పుడే జీవితానికి సఫలత కలుగుతుంది .
***మురళీ కృష్ణ . . .












