Attention Journalists & Chief Editors of South Media: Sensitive Reporting Through a Gender lens need an Eagle eye! -Panel opinion in two days Workshop organized by Laadli Media and UNFPA 2022
మహిళలు, LGBTQ వార్తలు రాసేటప్పుడు నిజా నిజాలు తెలుసుకోకుండా వారిని వేలెత్తి చూపడం, లింగ వివక్ష చూపించడం విలేకరులకు, ఎడిటర్లకు తగదు!: డా. ఏ ఎల్ శారద, డైరెక్టర్, పాపులేషన్ ఫస్ట్
మన దేశంలోని మీడియా అత్యుత్సాహం వల్ల రోజువారీ వార్తా ప్రవాహంలో అన్ని చానళ్లు, పత్రికలు, ఆన్లైన్, డిజిటల్ మీడియాలలో లింగవివక్షను ప్రధానంగా ప్రదర్శించడం, మహిళలను, LGBTQ లను కార్నర్ చేస్తూ వార్తలు రాయండం మంచిది కాదన్నారు డా. ఏ ఎల్ శారద, డైరెక్టర్ ఆఫ్ పాపులేషన్ ఫస్ట్ బృందంతో కూడిన వర్క్ షాప్ లో పాల్గొన్న ప్రముఖ సీనియర్ జర్నలిస్టులు, రచయితలు, స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు, విద్యా వేత్తలు
హైదరాబాద్ లాడ్లి మీడియా, UNFPA NGO's సంస్థలు సంయుక్తంగా రెండు రోజుల పాటు దక్షిణ భారత దేశంలోని వివిధ రాష్ట్రాల విలేకరులకు ఆగస్టు 11, 12 తేదీల్లో మీడియా వర్క్ షాప్ నిర్వహిస్తోంది. హైదరాబాద్ లోని తారామతి బరాదరిలో నిర్వహించిన ఈ వర్క్ షాప్ తొలిరోజు సుమారు 20 మంది మహిళా జర్నలిస్టులు, 10 మంది మేల్ జర్నలిస్టులు తమిళనాడు, ఆంద్రప్రదేశ్, తెలంగాణ, ఒడిసా రాష్ట్రాల నుంచి పాల్గొన్నారు. వీరికి వార్తలు జెండర్ కోణంలో ఏవిధంగా రాయాలి? ప్రస్తుతం మీడియా ఏవిధంగా ప్రవర్తిస్తోంది? అన్న అంశాలపై ప్యానల్ సభ్యులు తమ అభిప్రాయాలను వచ్చిన విలేకరులతో పంచుకున్నారు. వీరిలో డా. ఏ ఎల్ శారద, డైరెక్టర్, పాపులేషన్ ఫస్ట్
తో పాటు, UNFPA ప్రోగ్రాం నిపుణునురాలు అనూజ గులాఠీ, ప్రముఖ D & I స్ట్రాటజిస్ట్ ఆసియా షేర్వాని, ప్రముఖ జెండర్ ట్రైనర్ అపర్ణ తోట, తెలుగు సినీ, సీరియల్, నవల రచయిత భలభద్రపాత్రుని రమణి, భూమిక ఉమన్స్ కలెక్టివ్ ఫౌండర్ సత్యవతి కొండవీటి, ఎడిటర్ ఇన్వెస్టిగేషన్స్, టైమ్స్ ఆఫ్ ఇండియా సుధాకర్ రెడ్డి ఉడుముల, మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ, IMC డైరెక్టర్ రిజ్వాన్ మహమ్మద్, మోడరేటర్, సీనియర్ మహిళా జర్నలిస్ట్ రాజేశ్వరి కల్యాణం పాల్గొన్నారు.
కోవిడ్ లాక్ డౌన్ సమయంలో ముంబై కామటి పురాలోని సెక్స్ వర్కర్ల జీవితంపై డాక్యుమెంటరీ ప్రదర్శన!
అనంతరం కోవిడ్ సమయంలో ప్రముఖ సీనియర్ క్రైమ్ రిపోర్టర్ సంతోషి ముంబైలోని కామటి పురాలో సెక్స్ వర్కర్ల ఏవిధంగా వారి రోజువారీ జీవితం గడిపారో కళ్ళకు కట్టినట్టు తీసిన ఫీల్డ్ డాక్యుమెంటరీ రియాలిటీకి దగ్గరగా, ఈ సమాజంలో మహిళలు ఏవిధంగా గడుపుతున్నారో చూసి కన్నీళ్లు పెట్టుకున్న ఉదంతం.
-Venkateshwarlu Boya, Sr Journalist, Hyd.















