టాలీవుడ్ మెగా కాంపౌండ్ నుండి వచ్చిన మెగా డాటర్ నిహారిక ఒక మనసు చిత్రంతో తెలుగు వెండితెర పై ఎంట్రీ ఇచ్చింది. ఆ చిత్రంలో నాగశౌర్య హీరోగా నటించగా.. నిహారిక తొలిచిత్రం మాత్రం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయ్యింది. అయితే ఆ తర్వాత తమిళంలో తన అదృష్టాన్ని పరీక్షంచుకుంటూ ఒరు నల్ల నాల్ పత్తు సొల్ రే చిత్రంలో నటించగా.. ఆ చిత్రం కూడా తమిళ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది.















