ప్రధాని నరేంద్ర మోడీకి అవార్డు ఇచ్చిన కంపెనీకి అడ్రసే లేదంటా..? ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఈ వారమే ఫిలిప్ కోట్లర్ ప్రెసిడెన్షియల్ అవార్డు అందుకున్నారు... సోమవారం ప్రధాని మోడీని కలిసి మొట్టమొదటి ఫిలిప్ కోట్లర్ ప్రెసిడెన్షియల్ అవార్డు ప్రదానం చేశారు నిర్వాహకలు. ‘పీపుల్, ప్రాఫిట్, ప్లానెట్’ అనే మూడు అంశాల ఆధారంగా ఈ పురస్కారం అందజేసినట్టు ఈ సందర్భంగా ప్రధానమంత్రి కార్యాలయం ప్రకటించింది. ఇంత వరకు బాగానే ఉన్నా... మోడీకి అవార్డు ప్రధానం చేసిన సదరు సంస్థ పేర్కొన్న అడ్రస్‌కు వెళ్లి చూసింది ఇండియా టుడే టీమ్... ఆ సంస్థ హెడ్ ఆఫీస్‌గా పేర్కొన్న అలీగఢ్‌లోని అడ్రస్‌లో ఎలాంటి ఆఫీసులు లేదు... ఓ ఫ్యామిలీ నివాసం ఉండే ఇళ్లు మాత్రమే ఉంది. సరే ఇంట్లో అయినా ఆఫీసు కార్యకలాపాలు నిర్వహిస్తున్నారేమో అనుకోవడానికి కనీసం అక్కడ ఓ బోర్డు కూడా లేదు... ఇక ఆ సంస్థకు చెంది వెబ్సైట్ కూడా పనిచేయకపోవడం మరో ట్విస్ట్... సదరు సంస్థ పేర్కొన్న మొబైల్ నంబర్ కూడా పనిచేయడం లేదని ఇండియా టుడే తన కథనంలో పేర్కొంది. ఇక ఇలాంటి అడ్రస్ కూడా లేని సంస్థల నుంచి అవార్డులు స్వీకరించి తాను అదో సాధించినట్టు నరేంద్ర మోడీ కలరింగ్ ఇస్తున్నారంటూ విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. #modishit #modipolitics (at Chhattisgarh) https://www.instagram.com/p/Bsud5jEnwV9/?utm_source=ig_tumblr_share&igshid=6vpnza3i8w38