seen from United States
seen from China
seen from United States
seen from United States

seen from United States
seen from United States
seen from United States

seen from Brazil
seen from United States
seen from United States
seen from Australia
seen from Slovakia

seen from United States
seen from Hong Kong SAR China
seen from China
seen from Taiwan

seen from Canada
seen from United States

seen from United States

seen from United States
ఓ క్రికెటర్ వైసీపీలోకి వస్తే… ఎంతిస్తావని అతడ్ని అడిగారు: నారా లోకేశ్
శృంగవరపుకోటలో శంఖారావం హాజరైన నారా లోకేశ్ ఎస్ కోటను అవినీతి కోటగా మార్చేశారని ఆవేదన తాము గెలిచాక ఇక్కడ ట్రైబల్ వర్సిటీ ఏర్పాటు చేస్తామని హామీ
Read the full article
మీరు చొక్కాలు మడతపెడితే… మేం కుర్చీలు మడతపెట్టడమే!: నారా లోకేశ్
ఉత్తరాంధ్రలో టీడీపీ శంఖారావం యాత్ర నెల్లిమర్లలో బహిరంగ సభకు హాజరైన నారా లోకేశ్ పసుపు సైన్యం, జనసైనికుల జోలికి వస్తే ఊరుకునేది లేదంటూ హెచ్చరిక జగన్ కు దమ్ముంటే యువత వద్దకు వెళ్లాలని సవాల్
Read the full article
దొంగ ఓట్లతో గెలవాలని వైకాపా యత్నం: నారా లోకేశ్
Trinethram News ; రాజాం: దొంగ ఓట్లతో వచ్చే ఎన్నికల్లో విజయం సాధించాలని వైకాపా చూస్తోందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆరోపించారు. స్వయంగా సీఎం సలహాదారే దొంగ ఓట్లు వేసేందుకు సిద్ధమైన పరిస్థితి నెలకొందన్నారు.. విజయనగరం జిల్లా రాజాంలో నిర్వహించిన 'శంఖారావం' బహిరంగలో ఆయన మాట్లాడారు. వైకాపా ప్రభుత్వ తీరుపై విమర్శలు గుప్పించారు.. ''ఉద్యమాల పోరాటాల గడ్డ ఉత్తరాంధ్ర. ఎన్ని కేసులు పెట్టినా భయపడని కార్యకర్తలకు నా వందనం. తిరుపతి ఉప ఎన్నికలో వైకాపా గెలుపునకు కారణం దొంగ ఓట్లే. వాటిని నమోదు చేస్తున్న వారిపై చర్యలు తప్పవని ఆనాడే చెప్పా. ఏకంగా డీఎస్పీ, సీఐ, ఎస్ఐలు సస్పెండ్ అయ్యారు. రేపో మాపో విచారణ నివేదిక బయటకొస్తుంది.. వారంతా ఇక జైలుకే. చట్టాన్ని ఉల్లంఘిస్తే ఎవరికైనా శిక్ష తప్పదు'' అని లోకేశ్ హెచ్చరించారు..
Read the full article
ఇచ్చాపురం శంఖారావం ప్రారంభసభలో యువనేత నారా లోకేష్ ప్రసంగం
శంఖారావంలో పాల్గొనేందుకు తరలివచ్చిన పసుపుసైనికులకు వందనాలు, కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి, నా ధన్యవాదాలు. రెడ్ బుక్ చూస్తుంటే వైసిపి సైకోలంతా భయపడుతున్నారు. ఉత్తరాంధ్ర నాకు అమ్మ లాంటింది. అమ్మ ప్రేమకు కండిషన్స్ ఉండవు. ఉత్తరాంధ్ర ప్రజల ప్రేమకు కూడా నిబంధనలు ఉండవు. ఉత్తరాంధ్ర అంటేనే తెలుగుదేశం పార్టీ కంచుకోట, పౌరుషాలకు, పోరాటాలకు పురిటిగడ్డ శ్రీకాకుళం జిల్లా జగన్ రెడ్డి ఉత్తరాంధ్రను గంజాయి కేంద్రంగా జగన్ రెడ్డి మార్చారు. గరిమెళ్ల, సర్థార్ గౌతు లచ్చన్న, ఎర్రన్నాయుడు పుట్టిన గడ్డ ఇది. ఇచ్ఛాపురం నుంచి శంఖారావం చేపట్టడం నాకు గర్వంగా ఉంది. జగన్ ప్రతిదానికి సిద్ధం, సిద్ధం అంటున్నాడు, దేనికి జగన్ సిద్ధం? జైలుకు వెళ్లడానికి జగన్ రెడ్డి సిద్ధంగా ఉన్నారు. జైలుకు పంపడానికి మీరు సిద్ధమా? బీసీ బిడ్డ అమర్ నాథ్ గౌడ్ లాంటి వాళ్లను హతమార్చిన, డాక్టర్ సుధాకర్ లాంటి దళిత బిడ్డలను, మైనారిటీలను చంపిన జగన్ ను ఇంటికి పంపడానికి మీరు సిద్ధమా? జగన్ సిద్ధం అంటున్నాడు, దేనికి సిద్ధం? సొంతబాబాయినే లేపేశాడు, ఇంకెంతమంది కుటుంబసభ్యులను లేపడానికి, రాష్ట్రాన్ని నాశనం చేయడానికి జగన్ సిద్ధం? భూకబ్జాలకు సహకరించడలేదని విశాఖలో ఎమ్మార్వో రామయ్యను అతి కిరాతకంగా పైసిపి నాయకులు చంపేశారు. బాపట్లలో అగ్రికల్చరల్ అసిస్టెంట్ పూజిత ఆత్మహత్య చేసుకున్నారు. ఆర్బీకేల్లో ఎరువులు దొంగతనం చేయడాన్ని ప్రశ్నించిన ఆమెను ఆత్మహత్యకు ప్రేరేపించారు. విజయనగరం జిల్లాలో పంచాయితీరాజ్ జేఈ రామకృష్ణ ఫ్యాన్ కు ఉరేసుకుని చనిపోయాడు. ప్రజలకు అండగా నిలబడటమే రామకృష్ణ చేసిన తప్పు. వైసిపి నాయకుల దోపిడీని ప్రశ్నించినందుకే ఆయనను వేధించారు. నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ అంటూ జగన్ రెడ్డి కొత్త నాటకం మొదలుపెట్టారు. 4 నెలల 10 నెలలు ఏం చేశారు? మోసానికి, వంచనకు, దగాకు ప్యాంట్ వేస్తే అది జగన్ రెడ్డి. 23 వేల డీఎస్సీ పోస్ట్ లు భర్తీ చేస్తామని హామీ ఇచ్చి మోసం చేశారు. నేడు ఉపాధ్యాయ ఖాళీలను తగ్గించారు. యువతలో యువగళం మొదలు కావడంతో కుప్పిగంతులు వేస్తున్నారు. టీడీపీ పాలనలో మొత్తం లక్షా 70వేల పోస్ట్ లు భర్తీ చేయడం జరిగింది. వచ్చే టీడీపీ పాలనలో ప్రతి ఏడాది డీఎస్సీ ప్రకటించి ఖాళీలు భర్తీ చేస్తాం. సొంత ఛానల్, పేపర్, సిమెంట్ ఫ్యాక్టరీ ఉన్నవాడు పేదవాడు ఎలా అవుతాడు? లక్ష రూపాయల చెప్పులు, వెయ్యి రూపాయల వాటర్ బాటిల్ తాగే జగన్ రెడ్డికి పేదవారి సమస్యలు అర్థమవుతాయా? సొంత చెల్లెలికే భద్రత లేకపోతే మనకు ఎలా రక్షణ ఉంటుంది? జగన్ రెడ్డిని చూస్తే కటింగ్, ఫిటింగ్ మాస్టర్ గుర్తొస్తాడు. బ్లూ బటన్ తో రూ.10 ఇచ్చి, రెడ్ బటన్ తో వంద నొక్కేస్తున్నారు. కరెంట్ ఛార్జీలు, బస్సు ఛార్జీలు పెంచడంతో పాటు చెత్త పన్నుతో ప్రజలను హింసిస్తున్నారు. ప్రజలకు ఉమశమనం కల్పించడానికి చంద్రబాబు, పవన్ కలిపి సూపర్ సిక్స్ ప్రకటించడం జరిగింది. టీడీపీ అధికారంలోకి వస్తే యువతకు 20 లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి రూ.3వేలు ఇస్తాం. స్కూల్ కు వెళ్లే ప్రతి ఒక్కరికి రూ.15వేలు ఇస్తాం, ప్రతి రైతుకు ఏడాదికి రూ.20వేలు ఇస్తాం. ప్రతి ఇంటికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తాం. 18 ఏళ్ల నుంచి 59 ఏళ్ల మహిళలకు నెలకు రూ.1500 ఇస్తాం. ఏడాదికి రూ.18వేలు. ఐదేళ్లలో రూ.90వేలు ఇస్తాం. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తాం. ఉత్తరాంధ్రకు పట్టిన శని జగన్ రెడ్డి, మూడు రాజధానులు అని విశాఖలో ఒక్క ఇటుకైనా వేశాడా? విశాఖలో ప్రజాధనం లూటీ చేసి రూ.500 కోట్లతో ప్యాలెస్ కట్టుకున్నాడు తప్పితే ఏం చేయలేదు. విశాఖ రైల్వే జోన్ కు కనీసం భూమి కూడా ఇవ్వలేదు. మూతపడిన చక్కెర కర్మాగారాలను తెరిపిస్తామని చెప్పి మాటతప్పారు. విశాఖ ఉక్కు భూములను కాజేసేందుకు కుట్ర పన్నారు. పెండింగ్ ప్రాజెక్టులు పూర్తిచేస్తామని చెప్పి రైతులను వంచించారు. ఉత్తరాంధ్రను అభివృద్ధి చేసింది తెలుగుదేశం పార్టీ. వంశధార, నాగావళి అనుసంధానానికి కృషిచేశాం. ప్రజల తాగునీటి కష్టాలు తీర్చేందుకు ఎన్టీఆర్ సుజల ద్వారా మినరల్ వాటర్ ప్లాంట్లు ఏర్పాటుచేశాం. ఉద్దానంలో డయాలసిస్ సెంటర్లు ఏర్పాటుచేశాం. హుద్ హుద్, తిత్లీ తుఫాన్ల సమయంలో చంద్రబాబు వేగంగా స్పందించారు. మండలానికి ఓ మంత్రిని నియమించి ప్రజలను ఆదుకున్న వ్యక్తి చంద్రబాబు. ఇచ్ఛాపురం అంటే తెలుగుదేశం పార్టీ అడ్డా. ఒక్కసారి మాత్రమే ఇక్కడ టీడీపీ ఓడిపోయింది. టీడీపీ పాలనలో రూ.1500 కోట్లతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. గత ఐదేళ్లలో జగన్ రెడ్డి ఇచ్చాపురం నియోజకవర్గానికి పీకింది ఏమీ లేదు. కోకోనట్ పార్క్ ఏర్పాటుచేస్తానని మోసం చేశారు. మహేంద్ర తనయ, బహుద నది ఆధునీకరణ పనులు చేపట్టలేదు. టీడీపీ అధికారంలోకి వస్తే పెండింగ్ లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులు పూర్తిచేస్తాం. జీడిపిక్క రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తాం, పరిశ్రమలను కూడా ఆదుకుంటాం. కొబ్బరి రైతులు, మత్స్యకారులను ఆదుకుంటాం. రెండు నెలలు ఓపికపడితే ఆపేసిన సంక్షేమ కార్యక్రమాలన్నీ పునఃప్రారంభిస్తాం. టీడీపీకి కార్యకర్తలే బలం. ఎంతోమంది నాయకులను మంత్రులు, ఉప ముఖ్యమంత్రులను చేసిన పార్టీ మనది. అన్న ఎన్టీఆర్ ఆవిష్కరించిన పసుపు జెండాను చూస్తే అందరికీ ఉత్సాహం వస్తుంది. కార్యకర్తల రుణం తీర్చుకునేందుకు 2014 తర్వాత కార్యకర్తల కోసం సంక్షేమ విభాగం ఏర్పాటుచేశాం.చనిపోయిన కార్యకర్తల కుటుంబాలకు రూ.100కోట్లు అందజేశాం, కార్యకర్తల పిల్లలను చదివించాం. జగన్ రెడ్డి పాలనలో నాపై 22 కేసులు పెట్టారు. అటెంప్ట్ మర్డర్ కేసు కూడా పెట్టారు. అయినా నేను తగ్గేదే లేదు. చంద్రబాబును అక్రమంగా 53 రోజులు జైల్లో పెట్టారు. జైలునుంచి వచ్చాక భయం మా బయోడేటాలోనే లేదని చంద్రబాబు చెప్పారు. చట్టాన్ని ఉల్లంఘించి ఇబ్బంది పెట్టిన వారి పేర్లు రెడ్ బుక్ లో రాశాం, అధికారంలోకి వచ్చాక న్యాయ విచారణకు ఆదేశించి నిబంధనలు అతిక్రమించిన వారిని జైలుకు పంపిస్తాం. ప్రజలకు అన్న ఎన్టీఆర్ దేవుడు, చంద్రబాబు రాముడు, వైకాపా నాయకులకు ఈ లోకేష్ మూర్ఖుడు. అధికారంలోకి వచ్చాక వైసిపి సైకోలకు వడ్డీతో సహా చెల్లిస్తాం. పార్టీ పటిష్టత కోసం పనిచేసిన కార్యకర్తలకు సముచిత స్థానం కల్పిస్తాం. శంఖారావం ద్వారా మళ్లీ మనం ప్రతిగడప తొక్కాలి, బాబు సూపర్ సిక్స్ కార్యక్రమాలను ప్రతిఇంటికీ తీసుకెళ్లాలి. కార్యక్రమాన్ని సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లిన వెళ్లిన వారికి పనితీరు ఆధారంగా పదవులు ఇస్తాం. క్లస్టర్, యూనిట్, బూత్ బాధ్యులకు కిట్లు ఇస్తున్నాం. ఇందులో ఉన్న క్యాలెండర్ లో మేనిఫెస్టో అంశాలను ప్రతి ఇంటికీ తీసుకెళ్లాల్సిన బాధ్యత మీపై ఉంది.
Read the full article
ఇవాళ రాత్రికి ఇచ్చాపురనికి నారా లోకేష్
రేపు ఉదయం ఇచ్ఛాపురం నుంచి లోకేష్ "శంఖారావం" యాత్ర ప్రారంభం.. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన టీడీపీ శ్రేణులు..
Read the full article
గ్రామీణ వైద్యుల సమైక్య శంఖారావం
తిరువూరు.. క్యాన్సర్ పై అవగాహన సదస్సు … ఈ రోజు విజయవాడలో జరిగే గ్రామీణ వైద్యుల సమైక్య సంఖ్యారావం రాష్ట్రవ్యాప్తంగా విజయవాడ తాడిగడపలో భారీ బహిరంగ సభ జరుగుతున్న సందర్భంగా….. తిరువూరు మండలంలోని గ్రామీణ వైద్యులు బోసు బొమ్మ సెంటర్ నుండి అయ్యప్ప స్వామి టెంపుల్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు ఇందులోని భాగంగా మండల గౌరవఅధ్యక్షులు కే. బాబు గారు అధ్యక్షులు ఈ. వేలాద్రి గారు కోశాధికారి వెంకటేశ్వరరావు గారు ట్రెజరీ పాపారావు గారు మండలంలోని గ్రామీణ వైద్యులు ఈ ర్యాలీలో పాల్గొనడం జరిగింది..
Read the full article