మీ సింగింగ్ టాలెంట్ ను పరిచయం చేయడానికి సరైన వేదిక “స్టార్ ఆఫ్ ది ఇయర్”
సంగీతానికి రాళ్ళు సైతం కరుగుతాయని అంటారు... సంగీతానికి అంత శక్తి ఉంది. అందమైన గాత్రం ఎలాంటి పాటకైనా వన్నె తెస్తుంది. మనలోనూ ఎంతో మంది అద్భుతమైన సింగర్లు ఉన్నారు, తమలో ఉన్న అద్భుతమైన టాలెంట్ ను బయట పెట్టుకోవడానికి సరైన అవకాశం కోసం ఎదుచూస్తుంటారు. అలాంటి వారికోసం "స్టార్ ఆఫ్ ది ఇయర్" అనే బిగ్ సింగింగ్ టాలెంట్ హంట్ ఈవెంట్ ప్రారంభం అయ్యింది. ఆన్లైన్ ద్వారా ఆడిషన్స్ జరగనున్నాయి. తమలో ఉన్న టాలెంట్ ను బయట పెట్టాలనుకున్నవారు www.staroftheyear.in/ అనే వెబ్ సైట్ ద్వారా రిజస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ఈ బిగ్ సింగింగ్ టాలెంట్ హంట్ ఈవెంట్ పోస్టర్ ను "నువ్విలా", "కార్తికేయ", "సినిమా చూపిస్తా మావా", "ఎక్కడికి పోతావు చిన్నవాడా", "సుబ్రహ్మణ్యపురం", "118" ఇలా చెప్పుకుంటుంటూ పోతే ఎన్నో గొప్ప గొప్ప సినిమాలకు సంగీతాన్ని అందించిన యువ సంగీత దర్శకుడు "శేఖర్ చంద్ర" లాంచ్ చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... సింగింగ్ టాలెంట్ ను నిరూపించుకోవడానికి "స్టార్ ఆఫ్ ది ఇయర్" మంచి ఫ్లాట్ ఫామ్ అని, ప్రతి ఒక్కరు తమలో ఉన్న సింగింగ్ టాలెంట్ ను ప్రపంచానికి పరిచయం చెయ్యాలని అన్నారు. అంతే కాకుండా అందమైన గాత్రం మీసొంతమైతే తన సినిమాలో అవకాశం కూడా కల్పిస్తానని శేఖర్ చంద్ర అన్నారు. సింగింగ్ టాలెంట్ ను నిరూపించుకోవడానికి సరైన ఫ్లాట్ ఫామ్ ఏర్పాటు చేస్తున్న స్టార్ ఆఫ్ ది ఇయర్ టీమ్ కు ఆయన అభినందనలు తెలిపారు. Read the full article









