ఈరోజు మనం బేబీ కార్న్ బటర్ మసాలా ఎలా చేయాలో తెలుసుకుందాం...
కావలసిన పదార్థాలు
బేబీకార్న్ - 5 లేదా 6
ఉల్లిపాయలు - 3
టమోటోలు - 4
జీడిపప్పు - పావు కప్పు
పచ్చిమిర్చి - రెండు లేదా మూడు
వెన్న - పావు కప్పు
కారం - చెంచా లేదా రుచికి సరిపడా
ధనియాలపొడి - ఒకటిన్నర చెంచా
జీలకర్ర పొడి - ఒక చెంచా
గరం మసాలా - అర చెంచా
కసూరి మేథీ - చెంచా
అల్లంవెల్లుల్లి - పేస్టు చెంచా
క్రీమ్ - టేబుల్ స్పూన్
ఉప్పు - తగినంత
See also : రుచికరమైన కాకరకాయ చిప్స్ | Step by Step Kakarakaya chips recipe in Telugu
బేబీ కార్న్ బటర్ మసాలా తయారీ విధానం...
టొమాటోలు, రెండు ఉల్లిపాయ ముక్కలు, జీడిపప్పు, పచ్చిమిర్చీని ఒక గిన్నెలో తీసుకొని అవి మునిగేలా నీళ్ళు పోసి పొయ్యి మీద పెట్టాలి. టొమాటోలు కొద్దిగా మెత్తగా అయ్యాక దింపేసి నీటిని వంపేయాలి. తర్వాత వీటన్నిటినీ మిక్సీలో వేసి మెత్తని మిశ్రమంలా చేసుకోవాలి.
ఇప్పుడు బాణలిలో వెన్న వేసి కరిగించి కస్తూరీ మేధీ, అల్లం వెల్లుల్లి పేస్టు వేయించి తర్వాత మిగిలిన ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేయాలి. అవి దోరగా వేగాక కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి మరోసారి కలపాలి. ఇందులో టొమాటో, జీడిపప్పు మిశ్రమం, తగినంత ఉప్పు, గరం మసాలా వేసి సన్నని మంటపై ఉంచాలి.
రెండు మూడు నిముషాల తర్వాత కేబీకార్న్ ముక్కల్ని కూడా వేసి కొన్ని నీళ్ళు పోసి మూత పెట్టేయాలి. అవి ఉడికి, గ్రేవీ దగ్గరకు వచ్చాక పైన క్రీమ్ వేసి దింపేయాలి. కొత్తిమీరతో గార్నిష్ చేసి వడ్డించాలి. ఇది రొట్టెలు, పూరీల్లోకి చాలా బాగుంటుంది.
ఈ వంటకం కూడా చుడండి. Soya veg biryaani – సోయా వెజ్ బిర్యానీ
Read the full article