#AndhraPradesh #Amaravati #Thippeswamy #Madakasira #Ysrcp మడకశిర ఎమ్మెల్యేగా తిప్పేస్వామి ప్రమాణ స్వీకారం అనంతపురం జిల్లా మడకశిర ఎమ్మెల్యేగా వైఎస్సార్ సీపీ నాయకులు తిప్పేస్వామి బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. అమరావతిలోని స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆయన చేత ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయించారు.ఎన్నికల సమయంలో తప్పుడు అఫిడ్‌విట్ దాఖలు చేసిన మడకశిర ఎమ్మెల్యే కే. ఈరన్న ఎన్నిక చెల్లదంటూ హైకోర్టు ప్రకటించగా, ఆయన సుప్రీంను ఆశ్రయించారు. శాసనసభకు షాక్ ఇచ్చిన రేవంత్ సుప్రీంకోర్టు కూడా హైకోర్టు తీర్పును సమర్దించడంతో ఎమ్మెల్యే పదవికి ఈరన్న రాజీనామా చేశారు.ఈరన్న స్థానంలో తిప్పేస్వామి ప్రమాణ స్వీకారం చేశారు. తిప్పేస్వామి ప్రమాణం చేసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ..సాధారణంగా ఎన్నికలకు సంబంధించిన పిటిషన్లపై ఆరు మాసాల్లోగా తీర్పు రావాలని వ్యాఖ్యానించారు. కానీ, ఈ కేసులో మాత్రం నాలుగున్నరేళ్ల తర్వాత తీర్పు వచ్చిందని, ఏదేమైనా చివరికి న్యాయం జరిగిందని పేర్కొన్నారు.మడకశిరతో పాటు రాష్ట్రాభివృద్ధి కోసం వైసీపీ అధినేత జగన్ నాయకత్వంలో పనిచేస్తానని ఆయన వ్యాఖ్యానించారు.











