ఆశ్చర్యపరిచే ఈ అద్భుతమైన ఆలయ శిల్పాలన్నీ దేవుళ్ళ రహస్యమైన అవతారాలా?
Hey guys, ఈరోజు మనం కాంచీపురంలో ఉన్న కచ్చబేశ్వర గుడి అని పిలవబడే ఈ పాతకాలపు గుడిని చూడబోతున్నాం, ఇది తిరుకచ్చుర్ అనే ఒక చిన్న గ్రామంలో ఉంది. ఈ గుడి క్రీ.శ ఎనిమిదవ శతాబ్దంలో కట్టారని చెప్తున్నారు, అలాగే పదహారవ శతాబ్దంలో మళ్ళీ ఈ గుడిని rebuilt చేశారని చెప్తున్నారు. ఈ గుడిలో చాలా విచిత్రమైన శిల్పాలు ఉన్నాయి. For example, ఈ వింత శిల్పాన్ని చూడండి, ఇక్కడ ఎవరో ఎక్కువ గూని వీపుతో ఉన్నారు, ఈ వ్యక్తి కాళ్ళ నుండి నడుము వరకు తొంభై డిగ్రీలో వంగి ఉన్నారు. ఈ వ్యక్తి ఒక కర్రతో నడుస్తున్నారు, ఎందుకంటే అది లేకపోతే అతను నడవలేరు.
ఇక్కడ ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తి పైన నిలబడి ఉన్నాడు. And ఈ వ్యక్తి హెయిర్ స్టైల్ చూడండి. ఇది చూడడానికి అమెరికా వాళ్ళు వేసుకున్న తలపాగా లాగా ఉంది కదా. అది నిజంగా ఆయన జుట్టేనా లేదంటే ఆయనకి కరెంటు షాక్ ఏమైనా కొట్టి జుట్టు ఇలా ఉందా? అతని చేతికి వేళ్ళు అసలు లేవు, చూస్తుంటే అతనికి సగం చేయి మాత్రమే ఉన్నట్టు కనిపిస్తుంది, ఇంకా ఆయన ఒక విచిత్రమైన positionలో నిల్చొని ఉన్నారు చూడండి. అసలు దీని అర్ధం ఏంటీ? ఇక్కడ ఇంకొక శిల్పం చాలా పెద్ద తలపాగాతో ఉంది, అది నేలకు తాకేంత పొడవుగా ఉంది. ఇంకొక స్తంభంలో రెండు శరీరాలు కలిసి ఉన్న కవల ఆడపిల్లలు ఉన్నారు చూడండి.
వాళ్ళు చూడడానికి చాలా భయంకరంగా, బెదిరించే కళ్ళతో ఇంకా intresting అయినా ముఖ లక్షణాలతో ఉన్నారు. ఎందుకు మనకు హిందూ గుడులలో మాత్రం ఇలాంటి శిల్పాలు కనిపిస్తున్నాయి? ఈ గుడిని square shapeలో ఉన్న రెండు ఎకరాల placeలో, చుట్టూ అన్ని వైపులా compound గోడతో కట్టారు. Compound గోడల లోపల ఈ గుడి L shapeలో ఉంది, అందులోనే సన్నిధి ఇంకా చాలా structures ఉన్నాయి. ఈ గుడి పైకప్పుకి కొన్ని గోపురాలు కూడా అతుక్కుని ఉన్నాయి చూడండి. ఇక్కడ నీటి కొలను ఉంది, ఇది ఈ గుడి compound గోడకి బయట ఉంది, ఇది కూడా ఈ గుడి ఆస్తిలో ఒక భాగమే. ఇది చాలా పెద్ద కొలను, ప్రజల అవసరాల కోసం, ఈ కొలను ఎప్పుడు నీటితో నిండి ఉంటుంది. ఈ పెద్దవైన చెక్క తలుపులు గుడి ప్రధాన ద్వారాన్ని రక్షిస్తాయి.
ఈ ప్రధాన ద్వారాన్ని ఒక cube shapeలో ఉన్న granite రాయిలతో కట్టారు. ఇది చాలా శతాబ్దాల ముందు నుండి కట్టిన పాతకాలపు original structure అని చెప్తారు. ఈ గుడిని continueగా renovate చేస్తూనే ఉంటారు కాబట్టి, మీరు అక్కడక్కడ కొన్ని కొత్త structuresని కూడా చూడవచ్చు. మనం గుడిలోపలికి వెళ్ళగానే ఈ విచిత్రమైన శిల్పాలు మనల్ని ఆకర్షిస్తాయి. ఇక్కడ ఉన్న ఒక బొమ్మ, సగం మనిషిగా ఇంకా సగం తాబేలుగా ఉంది చుడండి, ఇది ఒక పువ్వును ఒక లింగంపై పెడుతున్నట్టు దీన్ని చెక్కారు. ఈ శిల్పంలో ఉన్నది ఎవరు? ఈయన చేతిలో పట్టుకున్న ఆయుధాలు చూస్తే, ఇది విష్ణు భగవానుడు అని మనకు తెలుస్తుంది.
ఈ శిల్పం, ఈ గుడిని ఎలా కట్టారు అనే కథని మనకు చెప్తుంది. విష్ణువు యొక్క సగం మనిషి, సగం తాబేలుగా ఉన్న ఈ రూపం పేరు కర్కడా అని అంటారు, అందుకే ఈ గుడిలో ఉన్న లింగానికి కచ్చబేశ్వర అని అంటారు. ఇదే స్తంభంలో ఇంకొక శిల్పం కూడా ఉంది. ఇక్కడ ఒక అతను ball లాంటి ఒక వస్తువుని లింగంకి పైన పట్టుకొని ఉన్నాడు. ఇక్కడ ఏం జరుగుతోంది? Comment sectionలో మీ answerని correctగా చెప్పండి చూద్దాం. ఇప్పుడు మనం దేవతమూర్తులు ఉన్న గది లోపలికి వెళ్లి చూద్దాం రండి. ఇక్కడ చాలా చీకటిగా ఉంది, కొంచెం కూడా వెలుతురు లేదు. ఈ structures అన్ని granite రాయిలతోనే కట్టారు, అందుకే ఈ గోడలు అన్ని చాలా thickగా ఉన్నాయి.
ఈ diamond shapeలో ఉన్న ఈ కిటికీ నుండి చూస్తే ఈ granite రాయిలో కట్టిన ఈ గోడ ఎంత thickగా ఉందొ తెలుస్తుంది. Main structureలో ఉన్న ceiling పైన నేను ఒక విచిత్రమైన శిల్పాన్ని చూసాను. అసలు ఇది ఏంటిది? ఎందుకు దీన్ని ఇంత ముఖ్యమైన గది దగ్గర ఉన్న ceiling పైన చెక్కారు? ఈ జంతువులన్నీ కేవలం కల్పితమా లేదా నిజంగా ఇలాంటి జీవులు ఉన్నాయా? ఈ గర్భ గుడి లోపల, కచ్చబేశ్వర అని పిలవబడే ఒక చిన్న లింగం ఉంది చూడండి. ఈ ఊరు జనాలు, ఇది చాలా శక్తివంతమైన లింగం అని చెప్తున్నారు, దీని నుండి దైవిక కిరణాలు కూడా వస్తాయి అని అంటున్నారు. ఈ గుడి బయట ఒక చిన్న మండపం ఉంది, దానిలో చాలా స్తంభాలు ఉన్నాయి, అలాగే దీని ceiling పైన, స్తంభాల పైన చాలా intresting అయిన శిల్పాలు ఉన్నాయి.
ఇక్కడ ఒక మనిషి గుర్రం పైన కూర్చొని ఈటెను విసరడానికి సిద్ధంగా ఉన్నాడు, అలాగే ఇది ఒక మగ గుర్రం, నెల మీద ఉన్న శత్రువుని కాలితో తొక్కుతున్నట్లు ఉంది. ఇప్పుడు, ఈ విచిత్రమైన శిల్పాన్ని చూడండి. ఇక్కడ చాలా ఎత్తైన పీఠం పైన ఒక లింగం ఉంది చూడండి. ఇక్కడ లింగానికి రెండు వైపులా రెండు పక్షులు ఉన్నాయి, ఎడమ వైపు ఉన్న పక్షి లింగాన్ని తాకుతున్నట్టు ఉంది, కుడివైపు ఉన్న పక్షి లింగాన్ని చూస్తున్నట్టుగా ఉంది. దీని వెనుక ఉన్న కథ ఏంటి? ఇది ఒక పాతకాలపు హిందూ కథ, దీనిని అద్భుతంగా శిల్ప రూపంలో చెక్కారు, ఎడమ వైపు ఉన్న పక్షి, ఒక కాకి రూపంలో ఉన్న ఋషి అతని పేరు బుసుంద ఋషి.
ఇతన్ని తమిళంలో కాగభుజండర్ అని అంటారు, అతనికి చావే లేదని, అంటే అతను అమరత్వం పొందిన ఒక ఋషి అని అంటారు. ఇప్పుడు లింగానికి కుడి వైపు ఉన్న పక్షి బ్రహ్మ దేవుడు, ఈయన హంస రూపంలో ఉన్నాడు. తమిళ కథల ప్రకారం, బ్రహ్మ దేవుడు హంసగా మారి, లింగం యొక్క పై భాగాన్ని చూడడానికి వెళ్లి, అది చూడలేక విఫలం అయిపోతాడు.
- Praveen Mohan Telugu

















