ఈ దేవాలయంలో తప్ప మరెక్కడా ఇలాంటి వాటిని చూడలేరు! ఎవరికీ తెలియని మర్మమైన దేవాలయం.
Hey guys, ఈ రోజు మనం వీరనారాయణ అని పిలువబడే ఒక పురాతన దేవాలయం గురించే చూడబోతున్నాము. ఇది కర్ణాకటలో బెలవాడి అనే ఒక మారుమూల గ్రామంలో ఉంది. ఇక్కడికి చాలా తక్కువ మంది visitors మాత్రమే వస్తున్నారు, కానీ ఇది విచిత్రమైన విషయాలకు, అర్ధంకాని వివరాలకు ప్రసిద్ధి చెందింది ఒక గుడి. నేను బయటి నుండి గుడి లోపలికి వస్తున్నాప్పుడు, ఈ గుడి డిజైన్ చాలా విచిత్రంగా, చాలా ప్రత్యేకంగా ఉందని నేను గ్రహించాను. main entrance నుండి గుడి లోపలి ఉన్న ప్రధాన గదిని ఇంకా లోపల ఉన్న ముఖ్య విగ్రహాన్ని కూడా మీరు straight గా చూడవచ్చు.
మధ్యలో ఈ ధ్వజస్తంభం తప్ప మరేమి లేదు. వాస్తవానికి మధ్యలో ఏడు ద్వారబంధాలు ఉన్నాయి అవన్నీ మొత్తం ఒకే straight lineలో డిజైన్ చేయబడ్డాయి, చుడండి ఇవన్ని ఎంత ఖచ్చితంగా align చేయబడ్డాయి. ఇలాంటి ఒక ఆర్కిటెక్చర్ ఎందుకు అవసరమైంది? నేను ఎందుకు ఇలా అడుగుతున్నానో తెలుసా? దీన్ని వూరికే random గా design చేసి ఉండొచ్చు కదా? కానీ అలా చెయ్యలేదు. పురాతన నిర్మాణదారులు దేనిని చేసినా కూడా దాని వెనక ఒక కారణం ఉంటుంది, కాబట్టి ఈ designకు కచ్చితంగా ఏదో ఒక నిర్దిష్ట కారణం ఉండాలి.
నేను ఈ గుడి పూజారిని అడిగితే ఆయన కొన్ని అద్భుతమైన విషయాన్ని నాకు చెప్పారు. ప్రతి సంవత్సరం, మార్చి 23న, తెల్లవారుజామున సూర్యకాంతి ఈ ప్రధాన ద్వారం గుండా వచ్చి, 7 తలుపులు దాటుతుందంట, ఇంకా మధ్యలో ఉన్న ఈ ధ్వజస్థంభం, ఆ సూర్యకిరణాలు ముఖ్య దేవుని ముఖం మీద పడకుండా చూసుకుంటుందంట, కానీ ఈ కిరణాలు ప్రధాన గదిలో ఉన్న వీరనారాయణ విగ్రహం యొక్క వేలుగోళ్లపై పడతాయంట.
అయితే, ఈ విగ్రహం చాలా వింతగా ఉందని నేను భావిస్తున్నాను, ప్రధాన దేవత చూడడానికి చాలా అందంగా కనిపిస్తున్నారు, కానీ ఆయన చేతులను చూడండి. ఆయన చేతులు పులి పాదాలు లాగా ఉన్నాయి కదా. పులి పంజాలు సూర్యకాంతిలో అద్భుతంగా మెరుస్తాయని కొంతమంది చెప్తున్నారు, అదేలాగా సూర్యకిరణాలు గోళ్లపై పడినప్పుడు తళతళలాడుతూ చూడడానికి చాలా అద్భుతంగా ఉంటుందని కూడా చెప్తున్నారు. గోళ్ళపై సూర్యకిరణాలు పడినప్పుడు reflect అవుతున్నప్పుడు 7 రకాల రంగులను చూపుతుందని కూడా కొంతమంది చెప్తున్నారు.
ఇది మార్చి 23న మాత్రమే ఎందుకు జరుగుతుంది? పురాతన నిర్మాణదారులు ఇంత కష్టపడి ఇలాంటి ఒక అద్భుతమైన డిజైన్తో ఈ గుడిని ఎందుకు కట్టారు? మీరు ఈ గుడి aerial viewను చూస్తే, ఇది పురాతన భారతదేశపు యొక్క architectural masterpiece అని మీరు గ్రహిస్తారు, దురదృష్టవశాత్తూ ఇలాంటి దేవాలయం ఇప్పటికి కూడా ఉందని చాలా మందికి తెలియదు. ఈ డిజైన్ చూడండి, ఇది complicated గా ఉండడం మాత్రమే కాకుండా చాలా అందంగా కూడా ఉంది కదా.
దీని unique styleని చూసి Archaeologistsలు కూడా ఆశ్చర్యపోతున్నారు, ఇది హోయసలేశ్వర గుడిని అలానే చెన్నకేశవ గుడిని కట్టిన కాలంలోనే ఈ గుడిని కూడా కట్టారు, అయితే ఈ గుడి ఆ గుడుల మాదిరిగా లేదు, దీనికి గోపురాలు ఉన్నాయి. ఒకటి మాత్రమే కాదు, దీనికి మూడు వేర్వేరు గోపురాలు ఉన్నాయి. లోపల ఉన్న అనేక గదులను ఇక్కడ ఉన్న అనేక తలుపుల ద్వారాలు ఒకదానికొకటి connect చేస్తున్నాయి. ప్రపంచంలోనే అత్యంత మెరిసే లాత్ స్తంభాలు ఈ గుడిలో ఉన్నాయని Archaeologistsలు చెబుతున్నారు.
అవి దాదాపు గాజుతో తయారు చేసినట్లుగా చాలా smooth గా మెరుస్తున్నాయి ఇంకా మీరు దీన్ని జాగ్రత్తగా గమనిస్తే మీ reflection ని కూడా మీరు చూడవచ్చు. ఇక్కడ మొత్తం నూట ఎనిమిది స్తంభాలు ఉన్నాయి, ఈ సంఖ్య హిందూ మతంలో ఒక పవిత్రమైన సంఖ్య, ఎందుకంటే 108 జీవితానికి ఆధారం అని చెప్పవచ్చు. ఈ architecture మనలను చాలా ఆశ్చర్యపరుస్తుంది, ఏఒక్క advanced అయిన machinesలను ఉపయోగించకుండా వాళ్లు ఇంత అద్భుతమైన నిర్మాణాన్ని ఎలా సృష్టించగలిగారు? ఒకవేళ ఈ ప్రశ్నకు సమాధానం ఈ గుడిలో ఉన్న చెక్కడాల్లో దాగి ఉండవచ్చు.
ఇక్కడ చాలా అద్భుతమైన పనిముట్లను పట్టుకుని ఉన్న విష్ణు భగవానుని శిల్పాలు ఉన్నాయి, అవి చూడడానికి చాలా complicatedగా కనిపిస్తాయి. కానీ ఈ చెక్కడంలో దాగి ఉన్న కొన్ని details నన్ను చాలా attract చేస్తున్నాయి. కొంచం కింద ground level ని చూడండి. రెండు వైపులా gear లు లాంటి కొన్ని gadgets ఉన్నాయి. మొదట్లో దీన్ని చూసినప్పుడు అవి పువ్వులు అని అనుకున్నాను, కానీ నేలపైన ఈ angle లో పువ్వులను పెట్టలేము. దాని తర్వాత, నేను ఈ చెక్కడాన్ని గమనించాను. ఇక్కడ ఈ రెండు objectsలు సగం నేల కింద పాతిపెట్టబడి ఉన్నాయి, దాని మిగిలిన సగం మాత్రమే నేల మట్టం పైన కనిపిస్తుంది. కాబట్టి, ఇవి ఖచ్చితంగా పువ్వులు కావు, ఎవరైనా 90 డిగ్రీల angleలో పువ్వులు పెట్టి, వాటిని నేల మట్టం కింద ఎందుకు పాతిపెడతారు?
ఇక్కడ మరొక చెక్కడం ఉంది చూడండి, ఈయన ఎవరని మనం అందరికి బాగానే తెలుసు, విష్ణు భగవానుని వాహనమైన గరుడ, ఈయన్ని కూడా ఈ రెండు పరికరాలతో ఉన్నట్టు చూపించాడు. ఇక్కడ, ఈ పరికరాల దంతాలను అంటే వీటి teeth యొక్క thicknessని చూడండి. అవి ఖచ్చితంగా పువ్వులు కావు; పువ్వులు ఇటువంటి thick అయిన petals ఉండవు. ఇవి ఖచ్చితంగా తిరిగే ఫ్యాన్ బ్లేడ్లతో ఉన్న కొన్ని రకాల machines అయ్యుంటుంది. ఇక్కడ మరికొన్ని అద్భుతమైన వివరాలను మనం గమనించవచ్చు, అతన్నీ రెండు వైపులా రెక్కలతో ఉన్నటు చూపించబడ్డాడు, పురాతన గ్రంథాలు అతన్ని ఎగిరే దేవుడిగా పదేపదే పేర్కొన్నాయి.
- Praveen Mohan Telugu


















