గుజరాత్ పటీదార్ ఉద్యమ నేత హార్దిక్ పటేల్‌కు విస్నగర్ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. 2015 అల్లర్ల కేసుకు సంబంధించి కోర్ట తీర్పు వెల్లడించింది. విస్‌నగర్‌లోని బీజేపీ ఎమ్మెల్యే కార్యాలయాన్ని ధ్వంసం చేసినట్లు హార్దిక్‌తో పాటు మరో ఇద్దరిపై ఆరోపణలు ఉన్నాయి. హార్దిక్‌తో పాటు లాల్జీ పటేల్, ఏకే పటేల్‌లకు రెండేళ్ల జైలుశిక్షతో పాటు రూ. 50వేల జరిమానా కోర్టు విధించింది. కోర్టు తీర్పు వెలువరించే ముందే తన మద్దతు దారులతో హార్దిక్ పటేల్ సమావేశమయ్యారు. …












