Mana Voice is a Telugu language & entertainment portal with a plethora of features like News, Cinema/Movies, Celeb photos, Videos, Full length movies, Web Radio, Kids Zone, e-Library, Bhakti/Devotional, Vinodam/Comedy, Shopping, NRI Corner, Charity with Corporate office in India while the support, maintenance & development is operated from Hyderabad,Mana Voice represents- a lifestyle, youthfulness, responsibility, and change - through fun, all the way. Mana Voice entertainment educates you, makes you think and inspires you to act. Just like our programing philosophy think, feel, act. Mana Voice is considered a bridge connecting widely scattered Telugu NRI community throughout the World to their motherland.
1998లో కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన చిత్రం పెళ్లి కనుక. ఇందులో జగపతి బాబు, లక్ష్మీ, భానుమతి రామకృష్ణ ముఖ్యపాత్రల్లో నటించారు. ఎంఎం కీరవాణి సంగీతం అందించారు. SVS క్రియేషన్స్ నిర్మించింది. ఇందులో “మనించమ్మ” పాట మీకోసం... ఈవారం.
నివేదా థామస్... ఈ కేరళ కుట్టి 02 నవంబర్ 1995న జన్మించింది. తండ్రి వ్యాపారవేత్త థామస్, తల్లీ లిల్లీ, తమ్ముడు నిఖిల్ థామస్. ఎస్.ఆర్.ఏం విశ్వవిద్యాలయంలో చదువుకుంది. 2002లో బాలనటిగా, పలు టీవీ ఛానెల్లో నటించింది. నటనకు గానూ కేరళ ప్రభుత్వం నుండి, వివిధ జాతీయ అవార్డులు వచ్చాయి. పవన్ కళ్యాణ్ తో నటించిన వకీల్ సాబ్ చిత్రం, ntr తో నటించిన జై లవ కుశ, నాని నిను కోరి వంటి చిత్రాలు పేరు తెచ్చాయి. మలయాళం, తమిళం, తెలుగు భాషల్లో ఎక్కువ నటించింది.
టాలీవుడ్ కి ఐకాన్ స్టార్, కేరళలో మల్లు అర్జున్, అందరికీ ముద్దుగా బన్నీ, అతడే టాలీవుడ్ పుష్ప రాజ్ అల్లు అర్జున్. 08 ఏప్రిల్ 1982న తమిళనాడులోని చెన్నైలో పుట్టిన బన్నీ. చిన్నతనం నుండే నటనపై, నృత్యంపై ఆసక్తి చూపించే వాడు, తాత అల్లు రామలింగయ్య నట వారసత్వాన్ని అందిపుచ్చుకొని 2003 గంగోత్రి సినిమాతో చిత్ర రంగంలోకి అడుగుపెట్టాడు. ఇప్పటి వరకు దాదాపుగా 30పైగా చిత్రాల్లో నటించిన బన్నీ, పుష్ప చిత్రంతో అంతర్జాతీయ ఖ్యాతిని సాధించాడు. 2011 స్నేహారెడ్డి వివాహమాడిన అర్జున 2పిల్లలకు తండ్రి అయ్యాడు. మీకు తెలుసా అల్లు అర్జున్ కూతురు అర్హా పూర్తిగా తెలుగులోనే మాట్లాడుతుంది. అల్లు అర్జున్ తండ్రి ఆహా అధినేత అల్లు అరవింద్ నిర్మాతగా, మామ చిరంజీవి, బావ రామ్ చరణ్, తమ్ముడు అల్లు శిరీష్ వంటి ప్రముఖులు బన్నీ కుటుంబ సభ్యులు.