మా ఇలవేలుపు నీవేనయ్యా (Maa Ila Velupu Neevenayya)
NASA
$LAYYYTER
d e v o n
Stranger Things
PUT YOUR BEARD IN MY MOUTH
cherry valley forever
styofa doing anything
One Nice Bug Per Day

if i look back, i am lost

#extradirty
Misplaced Lens Cap
occasionally subtle

Origami Around
taylor price

oozey mess

Kaledo Art

roma★
Aqua Utopia|海の底で記憶を紡ぐ
2025 on Tumblr: Trends That Defined the Year
todays bird
seen from United States
seen from Mexico

seen from Canada

seen from United States
seen from South Africa

seen from Argentina
seen from United States
seen from United States

seen from Romania
seen from United States
seen from United States
seen from United States

seen from United States
seen from United States

seen from United States
seen from United States

seen from United States

seen from United States
seen from United States

seen from United States
@subhashithalu
మా ఇలవేలుపు నీవేనయ్యా (Maa Ila Velupu Neevenayya)
దేవుడేమన్నరోయ్.. మన గరుదేవులేమన్నరోయ్
దేవుడేమన్నరోయ్.. మన గరుదేవులేమన్నరోయ్
బ్రహ్మీ ముహూర్తములో లేవమన్నరోయ్ .. యోగసాధన చేయమన్నరోయ్
యోగసాధన చేయమన్నరోయ్.. ఆరోగ్యవంతులుగా వుండమన్నరోయ్
ప్రాణాయామం చేయమన్నరోయ్.. మనస్సు శుధ్ధిగా వుండునన్నరోయ్
శాంతముగా మనలను వుండమన్నరోయ్.. వాదనలసలే వద్దన్నరోయ్
భగవన్నామం చెప్పమన్నరోయ్.. భవరోగములన్నీ తొలగునన్నరోయ్
తల్లితండ్రుల సేవించమన్నరోయ్.. సద్గురువులను పూజించమన్నరోయ్
పెద్దలను గౌరవించమన్నరోయ్.. పెద్దల దీవెనలందునన్నరోయ్
సత్యమార్గమున నడవమన్నరోయ్.. ధర్మబద్ధంగా జీవించమన్నరోయ్
న్యాయముగా సక్రమముగా సంపాదించమన్నరోయ్.. సద్వినియోగం చేయమన్నరోయ్
శాశ్వతంగా వుండేది కుదరదన్నరోయ్.. శాశ్వత కీర్తిని పొందమన్నరోయ్
తృప్తి గా మనలను వుండమన్నరోయ్.. తృప్తి లేనివారికే బాధలన్నరోయ్
సాత్వికాహారమును తినమన్నరోయ్.. సత్యగుణము మనలో పెరుగునన్నరోయ్
రాక్షస గుణములు వదలమన్నడోయ్.. దైవగుణములు పెంచమన్నడోయ్
రుచులకు బానిసలు కావద్దన్నరోయ్.. రుచులను బట్టే జబ్బులన్నరోయ్
నోటిని అదుపులో వుంచమన్నరోయ్.. జగడాలు, జబ్బులు రావన్నరోయ్
నేను నాదనే మాటలు మానమన్నరోయ్.. అహంకార మమకారాలుండవన్నరోయ్
హింస మార్గమును వదలమన్నరోయ్.. హంసలుగా అందరు అవ్వాలన్నరోయ్
అతిగా మనలను వుండద్దన్నరోయ్.. అనర్ధాలెన్నో జరుగునన్నరోయ్
సొంత ఖర్చులు తగ్గించమన్నరోయ్.. పరులకు సాయం చేయమన్నరోయ్
అర్ధవంతమైన పనులు చేయమన్నరోయ్.. ఆదర్శవంతంగా బ్రతకమన్నరోయ్
సద్గ్రంధ పఠనం చేయమన్నడోయ్.. సజ్జన సాంగత్యం మంచిదన్నడోయ్
ఆనందముగా అందరు వుండాలన్నరోయ్.. ఆనందమునందరికి పంచమన్నడోయ్
అందరి క్షేమం కోరమన్నడోయ్.. మన క్షేమం పరమాత్మ చూస్తానన్నడోయ్
నిత్యం ధ్యానం చేయమన్నడోయ్.. ఆత్మఙ్నానము కలుగునన్నరోయ్
💢పూజా విధానంలో అంతరార్థము.హిందూ ధర్మచక్ర💢
🔔1. గంటలు :- దేవాలయాల్లో పూజ సమయంలో గంటలు వాయిస్తారు. దీనివల్ల రెండు విధాల ప్రయోజనం ఉంది. ఒకటి-బయటి ప్రపంచంలో శబ్దాలు లోపలికి ప్రవేశించకుండా చేయడం, రెండవది-మనస్సును దేవుని మీదికి ఏకాగ్రంగా మళ్లించడంలో తోడ్పడుతుంది.
♨2.దీప హారతి :- దీపాన్ని వెలిగించి దేవుని విగ్రహం ముందు తిప్పడం. దీనిలోని అంతరార్థం ఏమిటంటే దైవాన్ని జ్యోతి స్వరూపంగా భావించడం. దైవమే కాంతి. ఆ సమయంలో భక్తుల భావన ఈ విధంగా ఉంటుంది. ” స్వామీ! నీవే ఈ విశ్వంలో స్వయం ప్రభవమైన జ్యోతివి. సూర్యుడు, చంద్రుడు అన్నీ వీటిలోని తేజస్సు. కాంతివి నీవే. నీ దివ్య కాంతిచే మాలోని చీకటిని తొలగించి, మా బుద్ధిని ప్రభావితం చేయి” అని.
♨3. ధూపం :- భగవంతుని ముందు పరిమళాలు వెదజల్లే అగరువత్తులను వెలిగిస్తాము. వాటి సువాసనలు అన్ని దిక్కులా వ్యాపిస్తాయి. వీటి ధూపం క్రిమిసంహారిణిగా కూడా పనిచేస్తుంది. భగవంతుడు సర్వవ్యాపి. విశ్వమంతా నిండియున్నాడు అన్న భావన అందరిలో కలుగుతుంది. ఈ విషయం అక్కడ ఉన్న వారందరికీ మాటి మాటికీ జ్ఞప్తి చేసినట్లవుతుంది.
♨4. కర్పూర హారతి :- వ్యక్తిగతమైన అహంకారము కర్పూరమువలె కరిగిపోవాలని ఈ హారతిలోని అంతరార్థం. ఈ విధంగా జీవాత్మ పరమాత్మతో ఐక్యం కావాలని భక్తులు కోరుకుంటారు.
♨5. గంధపు సేవ :- ఈ సేవలో చాలా అర్థం ఉంది. భగవంతుని విగ్రహానికి పూయడానికి గంధాన్ని మెత్తగా నూరుతారు. అంత శ్రమకు లోనయినప్పటికీ గంధం ఓర్పుతో సహించి, మంచి పరిమళాన్ని వెదజల్లి ఆహ్లదం కలిగిస్తుంది. ఆ విధంగానే ఎన్ని కష్టాలకు లోనయినప్పటికీ భక్తుడు చలించక కష్టాలను చిరునవ్వుతో స్వీకరించాలి. ఎటువంటి పరిస్థితుల్లోనూ శత్రువుకైనా అపకారం తలపెట్టకూడదు. ఇదే ఈ గంధసేవలోని అంతరార్థం.
🕉6. పూజ :- దేవునికి పత్రం, పుష్పం, ఫలం, తోయం అనే వాటిని భక్తులు పూజలో సమర్పిస్తారు. కాని భగవంతునికి వీటితో పనిలేదు. నిజానికి ఏ విధమైన వస్తువులు భక్తులు సమర్పించాలని భగవంతుడు కోరడు. కాని ఆ అర్పణలో ఎంతో పరమార్థం ఉంది.
🍃7 పత్రం(శరీరము) :- ఇది త్రిగుణాలతో కూడుకున్నది. పూజలో దీనిని భగవంతునికి అర్పిస్తాడు.
🌷8 పుష్పం (హృదయము) ఇక్కడ పుష్పం అంటే చెట్ల మీద పూచే పూవు అని అర్థం కాదు. సుగంధ పరిమళాలను వెదజల్లే హృదయ కుసుమం అని అర్థం. ఇటువంటి హృదయ కుసుమాన్ని దైవపరంగా అర్పించాలి.
🍌🍋9 ఫలం (మనస్సు) మనస్సు ఫలాలను అంటే మనం చేసే కర్మల ఫలితాలను మనం ఆశించక భగవంతునికి అర్పితం చేయాలి.దాన్నే త్యాగం అంటారు.
💦10. తోయం(నీరు) :- భగవంతుని అర్పించవలసిన నీరు అంటే మనలోని హృదయపూర్వకమైన ప్రేమ, ఆనందం మొదలైన దివ్య భావాల వల్ల వెలువడే ఆనంద భాష్పాలు దైవానికే అర్పితం కావాలి.
🍘11 కొబ్బరికాయలు :- హృదయం అనే కొబ్బరికాయ కోరికలు అనే పీచుతో కప్పబడి ఉంటుంది. దానిలో ఉండే నీరు సంస్కారము. కోరికలు అనే పీచును హృదయం అనే కొబ్బరికాయ నుంచి వేరుజేసి, తీయనైన కొబ్బరిని భగవంతునికి అర్పితం చేయాలి. అదే నిజమైన నివేదన. లోపల సంస్కారము అనేవి వున్నంతకాలం, హృదయం శరీరాన్ని కదలకుండా అంటిపెట్టుకొని ఉంటుంది. హృదయము అనే కొబ్బరికాయను పీచు అనే కోరిక వాసన వదలదు. మనంచేసే పనులను విత్తనాలతో పోలుస్తారు.మంచి విత్తనం వేస్తే మంచి మొక్క ఎట్లా మొలుస్తుందో మంచి పనులు చేస్తే మంచి ఫలితాలు లభిస్తాయి.
12👏. నమస్కారము :- చేతులు జోడించగానే పదివేళ్లు కలసివుంటాయి. ఈ పదివేళ్లు పది ఇంద్రియములకు గుర్తు. ఇందులో కర్మేంద్రియ,జ్ఞానేంద్రియములను హృదయములోని పరమాత్మకు కైంకర్యము చేయుచున్నాను అని చేతులు జోడించుటయే నమస్కారములోని అంతరార్థము.
🚶🏻13. ప్రదక్షిణము :- ముల్లోకములన్నియు భగవంతుని స్వరూపముతో నిండివున్నాయి. ఆ భగవంతుని సగుణాకరామైన విగ్రహమునకు గాని, లింగమునకు గాని, ప్రదక్షిణము చేసినట్లయిన ముల్లోకములు చుట్టి సర్వదేవతలకు నమస్కారములు చేసిన ఫలితము వుంటుంది.. అందుకే ప్రదక్షిణము పూజాంగములలో ఒకటిగా చేర్చారు. .....✍ హిందూ ధర్మచక్రం☸
మంచి మాట
దనవంతుడు తన ధనంతో మరణం రాకుండా చేసుకోగలడా?
పోనీ బలవంతుడు తన బలంతో మరణాన్ని ఆపుకోగలడా ?
తెలివిగలవాడు తన తెలివితో మరణం తప్పించుకోగలడా?
పోనీ వైద్యుడు తనకు తెలిసిన వైద్యంతో మరణించకుండా ఉండగలడా?
లేదు కదా మనం బ్రతికినన్ని రోజులు మన కుటుంబసభ్యులతో, స్నేహితులతో,బంధువులతో కష్టసుకాల్ని పంచుకుందాం.....!స్వార్థాన్ని వీడి మనుషులుగా జీవిధ్ధాం
దీనిలోని ప్రతి లైన్ జీవితంలో ఎక్కడో ఒక దగ్గర తప్పక ఉపయోగపడుతుంది.!
దేనికైనా కాలం కలసి రావాలి. అందరికీ అవకాశం కల్పిస్తాడు దేవుడు. అందుకోసం వెయిట్ చెయ్యాలన్నారు.అలాగే నాటకం చూడాల్సి వస్తే ముందు వరుసలో కూర్చుంటాం. అదే సినిమా చూడాల్సి వస్తే వెనుక వరుసలో కూర్చుంటాం. ముందు వెనుకలన్నవి సాపేక్షం.
సబ్బును తయారు చెయ్యాలంటే ఆయిల్ కావాలి! అదే చేతికి అంటిన ఆయిల్‌ను పోగొట్టుకోవాలంటే…సబ్బు కావాలి.చిత్రంగా లేదు? జీవితమూ ఇంతే అన్నారు. సమస్య వచ్చి పడింది. జీవితం అయిపోయింది అనుకోకూడదు. దానిని ఓ మలుపుగా భావించాలి.
ఈ ప్రపంచంలో ఇద్దరే ఇద్దరు ఆనందిస్తారట! ఒకరు పిచ్చివాళ్ళు. మరొకరు చిన్నపిల్లలు. గమ్యాన్ని చేరుకోవాలంటే పిచ్చితనం కావాలి. చేరుకున్న గమ్యాన్ని ఆనందించాలంటే చిన్నపిల్లలైపోవాలన్నారు.
తాళం తో పాటే తాళం చెవి కూడా తయారు చేయబడుతుంది. ఒకటి లేకుండా రెండోది తయారు కాబడదు. అలాగే పరిష్కారం లేకుండా సమస్య కూడా రాదు
: తూట కంటే శక్తివంతమైనది మాట! ఒక్క మాటతో సంబంధం తెంచుకోవచ్చు, ఒకే మాటతో లేని బందాన్ని పంచుకోవచ్చు
మనిషి సమాజంలో సూదిలా బ్రతకాలి, కత్తెర లాగ కాదు. సూది పని ఎప్పుడూ జోడించడమే, కత్తెర పని ఎప్పుడూ విడదీయడమే, అందరిని కలుపుకుంటూ బ్రతకాలి. కత్తెర లాగా విడదీస్తూ కాదు..
నిజాన్ని మార్చే శక్తి ఈ ప్రపంచంలో ఎవ్వరికీ లేదు, కానీ ప్రపంచాన్ని మార్చే శక్తి నిజానికి ఉంది.
నీవు సంతోషంగా ఉన్నావంటే నీకు సమష్యల్లేవని కాదు, వాటిని ఎదుర్కోగల శక్తి, ధైర్యం నీకున్నాయని…
స్నేహితుడిని నీ దుఃఖసమయంలోను, యోధుడిని యుద్ధంలోను, భార్యను పేదరికంలోను, గొప్పవ్యక్తిని అతని వినయంలోను పరీక్షించాలి.
చేసిన తప్పుకు క్షమాపణ అడిగినవాడు ధైర్యవంతుడు. ఎదుటి వారి తప్పును క్షమించగలిగిన వాడు బలవంతుడు.
: కష్టం అందరికీ శత్రువే, కానీ కష్టాన్ని కూడా చిరునవ్వుతో స్వీకరిస్తే, సుఖమై నిన్ను ప్రేమిస్తుంది.
ఓటమి లేనివాడికి అనుభవం రాదు, అనుభవం లేనివాడికి జ్ఞానం రాదు. గెలిచినప్పుడు గెలుపును స్వీకరించు, ఓడినప్పుడు పాఠాన్ని స్వీకరించు. ఎలా నిలదొక్కుకున్నావన్నది కావల్సింది. ఓడిపోయి విశ్రాంతి తీసుకుంటునప్పుడు ఆ ఓటమి నేర్పిన పాఠాన్ని చదువుకో, గెలుస్తావు.
ఎవరికైనా ఉండేది రోజుకు 24 గంటలే, గెలిచేవాడు ఆ 24 గంటలూ కష్టపడుతుంటాడు. ఓడేవాడు ఆ 24 గంటలు ఎలా కష్టపడలా అని ఆలోచిస్తుంటాడు. అదే తేడా…
గెలవాలన్న తపన, గెలవగలను అన్న నమ్మకం, నిరంతర సాధన. ఈ మూడే నిన్ను గెలుపుకు దగ్గర చేసే సాధనాలు.
నేను గెలవటంలో ఓడిపొవచ్చు, కానీ ప్రయత్నించడంలో గెలుస్తున్నాను… ప్రయత్నిస్తూ గెలుస్తాను.. గెలిచి తీరుతాను.
స్వయంకృషితో పైకొచ్చినవారికి ఆత్మవిశ్వాసం ఉంటుంది గానీ, అహంకారం ఉండదు.
మూర్ఖుడు తాను ఇతరులకు మోసం చేయగలుగుతున్నాను కాబట్టి తెలివి గలవాణ్ణి అనుకుంటాడు. అది తన పిచ్చితనమని, తన నాశనానికి దారితీస్తుందని గ్రహించడు.
🌷 నీ విలువ ఎంత --?🌷
ఒక వ్యేక్తి దేవునిని అడిగాడు ”నా జీవితం విలువ ఏంత” అని. అప్పుడు దేవుడు అతనికి ఒక రాయిని ఇచ్చి “ ఈ రాయి విలువ తెలుసుకునిరా... కానీ దీనిని అమ్మకూడదు” అని చెప్పి పంపించారు. ఆ వ్యేక్తి ఒక పండ్ల వ్యాపారి దగ్గరికి ఆ రాయిని తీసుకుని వెళ్లి ”దీని విలువ ఎంత ఉంటుంది ? అని అడిగాడు.... ఆ పండ్ల వ్యాపారి ఈ రాయికి నేను ఒక ఐదు పండ్లు ఇస్తాను, అమ్ముతావా ఏంటి అని అడిగాడు. కానీ దేవుడు ఈ రాయి విలువను మాత్రమే తెలుసుకోమన్నారు, అమ్మమనలేదు. కనుక ఆ వ్యేక్తి ఆ పండ్ల వ్యాపారి దగ్గరినుండి వెళ్ళిపోయాడు. తరువాత ఒక కూరగాయల వ్యాపారి దగ్గరికి ఆ రాయిని తీసుకుని వెళ్లి ”దీని విలువ ఎంత ఉంటుంది ? అని అడిగాడు.... ఆ కూరగాయల వ్యాపారి ఈ రాయికి నేను ఒక పది కేజీల కూరగాయలు ఇస్తాను, నాకు అమ్ముతావా అని అడిగాడు. కానీ దేవుడు ఈ రాయి విలువను మాత్రమే తెలుసుకోమన్నారు, అమ్మమనలేదు. కనుక ఆ వ్యేక్తి ఆ కూరగాయల వ్యాపారి దగ్గరి నుండి కూడా వెళ్ళిపోయాడు. తరువాత.... ఆ వ్యేక్తి ఒక బంగారు నగల వ్యాపారి దగ్గరికి ఆ రాయిని తీసుకుని వెళ్లి ”దీని విలువ ఎంత ఉంటుంది ? అని అడిగాడు.... ఆ బంగారు నగల వ్యాపారి ఈ రాయిని చూసి ఆశ్చర్యపోయి నేను ఒక 50 లక్షాలు ఇస్తాను, నాకు అమ్మవా అని అడిగాడు. ఆ రాయిని అమ్మకూడదు అని దేవుడు చెప్పారు కనుక ఆ వ్యేక్తి ఆ బంగారు నగల వ్యాపారి దగ్గరినుండి కూడా వెళ్లిపోతుంటే ఆ నగల వ్యాపారి “సరే 4 కోట్లు ఇస్తాను” అని అడిగాడు.... ఈ వ్యేక్తికి కొంచం ఆశ కలిగింది కానీ ఆ రాయిని అమ్మకూడదు అని దేవుడు ప్రత్యేకంగా చెప్పారు కనుక ఆ వ్యేక్తి అమ్మను అని చెప్పి అక్కడినుండి వెళ్ళిపోయాడు. తరువాత.... ఆ వ్యేక్తి ఒక వజ్రాల వ్యాపారి దగ్గరికి ఆ రాయిని తీసుకుని వెళ్లి ”దీని విలువ ఎంత ఉంటుంది ? అని అడిగాడు....ఆ వ్యాపారి ఆ రాయిని పరీక్షించి “మీకు ఎక్కడిది అండి ఈ ఇంత విలువైన రాయి ? నేను నా ఆస్తిని, చివరికి నన్ను నేను అమ్ముకున్న మీ దగ్గరి నుండి ఈ సంపదను కొనటం నావల్ల కాదు అండి.... చివరికి ఈ ప్రపంచం మొత్తం అమ్మినా దీని విలువకు సరిపోదు” అని చెప్పాడు.... ఆ మాటలు వినగానే ఈ వ్యేక్తికి ఏం మాట్లాడాలో తెలియలేదు.... వెంటనే ఆ రాయిని తీసుకుని దేవుని దగ్గరికి వచ్చాడు.... అప్పుడు దేవుడు.... నీ జీవితం విలువ ఏంత అని అడిగావు కదా.... ఈ రాయిని నువ్వు పండ్ల వ్యాపారిదగ్గరికి, కూరగాయల వ్యాపారికి, బంగారు నగల వ్యాపారికి చూపినప్పుడు వాళ్ళు ఇచ్చిన విలువను చూసావా ఆ విలువ వారి స్థాయిని బట్టి వారు నిర్ణయించారు.... కానీ నిజంగా ఈ రాయి విలువ తెలిసిన వజ్రాలవ్యాపారి మాత్రం దీని అసలు విలువనుకూడా చెప్పలేక పోయాడు.... నువ్వు కూడా వెలకట్టలేని ఈ రాయి వంటివాడివే.... నీ జీవితం కూడా వెలకట్టలేనిది.... కానీ మనుషులు వారివారి స్థాయిని బట్టి నీ జీవితానికి వెల కడతారు, నీ స్థాయిని బట్టి నిన్ను వెల కడతారు.... నువ్వు వారికీ ఉపయోగపడే విధానాన్ని బట్టి నీ జీవితానికి వెల కడతారు అంతే.... అది వారి స్థాయి. కానీ నీ విలువ నాకు ఒక్కడికే తెలుసు.... నువ్వు నాకు వెలకట్టలేని అమూల్యమైన నిధివి...
ఇవి మీకు తెలుసా ?🍒
🍐అల్లం తింటే ఎక్కిళ్ళు తగ్గుతాయి.
🌿కరివేపాకు రక్తహీనతను తగ్గిస్తుంది.
🍒నేరేడు పండ్ల గింజల్లో ఉండే జంబోలిన్ అనే గ్లూకోసైట్, మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది.
🍑గుమ్మడికాయ మూత్ర సంబంధిత వ్యాధులను తగ్గిస్తుంది.
🍇అవకాడో ఫలాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇవి తరచుగా తింటే మలబద్దకం పోతుంది.
🍏జామపళ్ళు హార్మోన్ల హెచ్చుతగ్గులను నివారిస్తాయి.
🍷బ్లాక్ టీ మధుమేహాన్ని దూరంగా ఉంచుతుంది.
🍪సజ్జల్ని ఎక్కువగా తీసుకుంటే, పైల్స్ బాధ నుంచి ఉపశమనం లభిస్తుంది.
🍋మామిడిపండుకి మూత్రపిండాల్లోని రాళ్ళను కరిగించే శక్తి ఉంది.
🍓దానిమ్మరసం కామెర్లకు మంచి మందుగా పనిచేస్తుంది.
🍲ఆవాల్ని క్రమం తప్పకుండా తీసుకుంటే ఇన్సులిన్ వృద్ది చెందుతుంది.
🍍అల్లం కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తుంది. మలబద్దకాన్ని కూడా వదిలిస్తుంది.
🍈కీరదోసలో ఉండే సిలికాన్, సల్ఫర్ లు శిరోజాలకు మేలు చేస్తాయి.
🍃మునగాకు గ్యాస్ట్రిక్ అల్సర్ ని దరికి చేరనివ్వదు.
🍒ద్రాక్షలో అధికపాళ్ళలో ఉండే బోరాన్.. ఆస్టియో పొరాసిస్ రాకుండా కాపాడుతుంది.
🍠బీట్ రూట్ రసం ‘లో బీపీ ‘ సమస్య నుంచి గట్టేక్కిస్తుంది.
🍉క్యారెట్ జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది.
🌽మూత్రపిండాల వ్యాధులున్న వారికి మొక్కజొన్న మంచి ఔషదం.
🍅ఉల్లిపాయ శ్వాసకోశ సమస్యలను తగ్గిస్తాయి.
🍑అనాసపళ్ళలో బ్రోమిలిన్ అనే ఎంజైమ్ ఉంటుంది. వాపుల్ని తగ్గిస్తుంది. 🍐పుచ్చకాయలో ఉండే లైకొపీన్.. గుండె, చర్మ సంబందిత వ్యాధుల నుంచి కాపాడుతుంది.
🍊సపోటాపళ్ళు మలబద్దకాన్ని నివారిస్తాయి.
🍜దాల్చిన చెక్కకు పంటి నొప్పిని తగ్గించే శక్తి ఉంది.
🍲ఆవాలు అజీర్తిని తగ్గిస్తాయి.
🐬🐟చేపలు తింటే రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశాలు తగ్గుతాయి.
🍊కమలాఫలాలు న్యుమోనియాకు చక్కని మందు.
🍉క్యారెట్లు నరాల బలహీనత నుండి కాపాడతాయి.
🍎యాపిల్ తింటే నిద్ర బాగా పడుతుందని పరిశోధనలో తేలింది.
🍵వాము దంత వ్యాధులను తగ్గిస్తుంది.
🍏పచ్చి జామకాయలో ఉండే టానిస్ మాలిక్, ఆక్సాలిన్ ఆమ్లాలు నోటి దుర్వాసనను పోగోడుతాయి.
☕ఉలవలు ఊభకాయాన్ని తగ్గిస్తాయి.
🍇ఖర్జూరం మూత్ర సంబంధిత వ్యాధుల్ని తగ్గించి, మూత్రం సాఫీగా అయ్యేలా చేస్తుంది.
🍒ద్రాక్షలో ఉండే పైటోకెమికల్స్.. కొలెస్ట్రాల్ ని దరి చేరనివ్వవు.
🍏జామపళ్ళు ఎక్కువగా తింటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
🍎ప్రోస్త్రేట్ క్యాన్సర్ సోకకుండా అడ్డుకునే శక్తి టొమాటోలకు ఉంది.
🍒నేరేడు పళ్ళు తింటే కడుపులో పురుగులు చచ్చిపోతాయి.
🍑మొలల వ్యాధికి బొప్పాయి మంచి మందు.
🌾మునగ కాయలు ఆకలిని పెంచుతాయి.
గుణానికి మనకన్నా ఎక్కువ వారితో
ధనానికి మనకన్నా తక్కువ వారితో పోల్చుకోవాలి
యోగసాధన
యోగాకు వెళ్తున్నారంటే ఎదో బాగలేదేమో లేకుంటే ఎందుకు వెళ్తున్నారు యోగాకు అనేవాళ్ళు కూడవున్నారు సమాజంలో.
యోగసాధన 10సం!!ల నుండి చేయవచ్చును. యోగ ఏ జబ్బు లేనప్పుడు ఏదైనా జబ్బు ఉన్నప్పుడు జబ్బు తగ్గిన తర్వాత కూడ చేయదగినది.
యోగసాధనకు పోవడమంటే హాస్పిటల్ కు పోవడం లాంటిది కాదని తెలుసుకోవాలి.
రామలక్ష్మణజానకి పాట
పల్లవి
హనుమాహనుమాహనుమా - అంజనితనయహనుమా (2)
చరణం. అతిబలవంతాహనుమా - శ్రీరామధూతహనుమా(2) గగనమార్గానహనుమా - సముద్రందాటినహనుమా(2) సీతాన్వేషణహనుమా - చింతలుబాపేహనుమా(2) లంఖినిసంహార హనుమా - లంకాదహనాహనుమా(2) వాయుపుత్రుడాహనుమా - వారథిబంధన హనుమా(2)!!హనుమా!! మామొరలనువినుమా - మాభాధలనుగనుమా,మాభజలనువినుమా(2)!!హనుమా!!
జైబోలోహనుమాన్ కీ
జైగురుదేవ్
మనసు - బంధాలు
నిజం చెప్పాలంటే ఒక మనిషి తన జీవితకాలంలో సగం సమస్యలు తన ఆలోచనలవల్లో, తన ప్రవర్తనలవల్లో కొని తెచ్చుకొనేవే. ఈ ప్రపంచంలో అవసరం కోసం ఎదుటివాడిని మెాసం చేసే వారి కన్నా...... తమ వారి మీదున్న అక్కసుతో తమను తాము మెాసగించుకునే వారే ఎక్కువ.
ముక్కు, మొహం తెలియని పరాయి వారు పలకరిస్తే పళ్ళికిలించుకొని ముఖంలో చాటంత చిరునవ్వు తెచ్చుకొని మరీ పలకరిస్తాం. వారి తరపునుండి మనకు ఏదైనా
కష్టమెా, నష్టమెా కలిగినా క్షమించేసి వారి దృష్టిలో చాలా మంచివాళ్ళం అయిపోవడానికి ప్రయత్నిస్తాం. అదే జీవితాంతం కలిసి ఉండాల్సిన వారితో మాత్రం ఒక నియంతలా ప్రవర్తిస్తుంటాం.
మనవారి దగ్గరకొచ్చేసరికి ఎక్కడ లేని రాక్షసత్వం బైటికొచ్చి విలయతాండవం చేస్తుంటుంది. అస్సలు మనసు విప్పి మాట్లాడటం పరాయి వారికిచ్చే ప్రాధాన్యతలో పదోవంతు మనవారికిచ్చినా బంధాలు బలపడవా??
మనసు మెచ్చిన క్షణం నచ్చినోళ్ళు మనసు నొచ్చిన క్షణం సచ్చినోళ్ళు ఇలా క్షణానికోసారి మనసు మారిపోతుంటే బంధాలకు బీటలు వారవా??
నిత్యసత్యాలు
జీవితం చివరివరకుా ఎంత డబ్బు అవసరమెా అంతా సంపాదించాక మనం ఆలోచించవలసిన విషయాలు డబ్బు కాకుండా వేరే ఉన్నాయి.(తుది శ్వాస వరకు డబ్భు సంపాదించాలని ఆలోచన మానుకోవాలి.) తనంత వాళ్ళయిన పిల్లలకు డబ్బు విషయం వారికి అప్పజెప్పాలి.
Quote of the day
జ్వరం (జబ్బు) వచ్చిన వానికి ఏమి తిన్నా రుచించదు
అలా అఙ్ఞానికి, అహంకారికి పారమార్ధిక విషయాలు అస్సలు రుచించవు.
-Nanna
మనం ఉషారుగా ఉండి, ఒంట్లొ శక్తి ఉన్నప్పుడే (స్వేచ్చగా ఉన్నప్పుడు) చేతనైనంత వరకు, అవకాశమున్నంత మేరకు సేవ, పూజలు, తీర్ధయాత్రలు, భజనలు, మంత్రోఛ్ఛారణ, పారాయణ మరియు, ఆర్ధిక సహాయం, యెాగసాధన, సత్సంగం, మొదలైనవి చేయాలి.
శక్తుడిగిన తరువాత మనకే ఇతరుల సహాయం అవసరమౌతుంది. ఆ స్థితిలో మనం ఇతరులకు ఏం చేయగలం.
కాబట్టి మిత్రులారా! వర్తమానంలో జీవిస్తూ కర్మయోగంలో సత్కర్మలు చేస్తూ కొనసాగుదాం.
జైగురుదేవ్ 🙏