భగవత్ బందువులందరికి శుభాకాంక్షలు!! తెలుగు నేలలో అడుగడుగునా గుడి ఉంది,గుడి లో ఒక రాయి ఉంది దానికి ఒక శక్తి ఉంది..దానికి ఒక రూపం ఉంది దానికి అనేక నామాలు ఉన్నాయి.వాటినే మనం భక్తి తో,శ్రద్ద తో శక్తి కొద్దీ కొలుస్తాము..ఏ రీతిని కొలిచిన.. కొలిచిన వారికి కొంగు బంగారం! మనమేమో పాశ్చత్య అలవాట్లు ఏర్పర్చుకుంటుంటే వాళ్ళు ఏమో ఇ వేద భూమి లో ఉన్న గొప్పతనాన్ని,సాంస్కృతిక వైభవాన్ని,రాళ్లలో, చెట్లలో దాగి ఉన్న శక్తిని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.మన ఆచారాలు,పద్ధతులు,మన దేవాలయాల్లో దాగి ఉన్న నిగూడ శక్తిని మనలో మమేకమై జ్ఞానాన్ని సంపాదించుకోడానికి అన్ని వదిలి పెట్టి ఇక్కడికి వస్తున్నారు.అడవుల్లో,గుట్టలో కష్టమైన,నష్టమైనా తిరుగుతూ సంపాదిస్తున్నారు. సంప్రదాయ దుస్తుల్లో దైవ దర్శనం చేసుకోవడం,వెళ్లిన ప్రతి ప్రదేశం లో క్షేత్ర మహత్యం అడిగి తెలుసుకోవడం,వెళ్లిన ప్రతి గుడి లో పేర్లు, గోత్రాల తో సహా అర్చన చేయించుకోవడం నిజంగా నాకు మహనందాన్ని ఇచ్చింది.అప్పుడు అనిపించింది మారాల్సింది ఎవరో కాదు మనమే! చదవడానికి కఠినంగా ఉన్న మంత్రాలు సునాయాసంగా చదువుతుంటే,భజనలు చేస్తుంటే నాకు అనిపించింది..రాబోయే తరాలకు మనం ఆస్తులు అంతస్తులు కాదు ఇవ్వాల్సింది మన వారసత్వ సంపద,మన వేద భూమి లో అడుగడుగునా గుళ్లలో దాగి ఉన్న గొప్పతనాన్ని తెలిసేలా చేయడమే దానిని కాపాడే బాధ్యత తీసుకునేలా చేయడమే! సుమారు ఒక రోజు అంత నేను ఎక్కడికి వెళ్తే వాళ్ళు అక్కడికి వచ్చారు వాళ్ళను దగ్గరగా చూడడం,వాళ్ళతో మాట్లాడడం చేసాక రాయలనిపించింది. ఇంతా మంచి అవకాశాన్ని నాకు ఆ అహోబిల నరసింహుడు కల్పించాడు. మన దేవాలయాలను,మన ఆధ్యాత్మిక సంపదను,మన చరిత్ర ను,మన సాంస్కృతిక మూలలను కాపాడాల్సిన బాధ్యత మనదే..ఎక్కడెక్కడో వెళ్లి వస్తుంటాము..వాటితో పాటు మన తెలుగు నెలాలో ఉన్న పురాతన,శిథిలావస్థలో ఉన్న దేవాలయాలను సందర్శిద్దాం..వాటి పురోభిరుద్దికి చేయూతనిద్దాం..వెలుగులో లేని దేవాలయాలను వెలుగులోకి తెద్దాం.. ఓ హిందు మేలుకో.. ధర్మ పరిరక్షణకై శ్రీమన్నారాయణుడి అవతారమే నృసింహ అవతారం –అహోబిలం --------------------------------------------------- హిరణ్యకశాపుని చిలిచి చెండాడిన నరసింహ స్వామి ఉగ్ర రూపాన్ని చూసి దేవతలు అహో .. బలం ,అహో బలం అని ఆశ్చర్యంతో పొగడరటా అందుకీ ఈ క్షేత్రానికి అహోబిలమ నరసింహ స్వామి దేవాలయం గా పేరు వచ్చింది అని చెబుతారు . బ్రహ్మాండ పురాణం లో ఈ క్షేత్ర మహత్యం బాగా వివరించడం జరిగింది . #ahobilam #ahobilamtemple https://www.instagram.com/p/CIsNTUas4rN/?igshid=1f4c20vjogeh6