పురాతన భారతదేశం యంత్రాలను ఉపయోగించిందా? అయితే అప్పట్లో ఎలాంటి టెక్నాలజీ ఉండేది?
Hey guys, ఈ వీడియోలో, పురాతన భారతదేశంలో రాళ్లను cut చేసే technique వెనుక ఉన్న అసలైన technologyనే నేను మీకు చూపించబోతున్నాను. ఇండియాలో ఉన్న అద్భుతమైన గుడులన్నింటినీ సాధారణమైన ఉలి మరియు సుత్తితో నిర్మాంచలేదని, ఈ వీడియో చివరిలో మీరు కూడా, నాతో పాటు ఒప్పుకుంటారు. ఈ పెద్ద పెద్ద రాళ్లను, ఉలి మరియు సుత్తి లాంటి సాధనాలు తప్ప, వేరే ఎలాంటి వాటిని ఉపయోగించి, cut చేయడానికి అవకాశం లేదని archeologistలు చెప్తున్నారు.
పురాతన నిర్మాణ దారులు, ఈ పెద్ద పెద్ద రాళ్లను ఎలా cut చేశారని, archeologist లు చెప్పే theory ని మనం first చూద్దాం. పురాతన నిర్మాణ దారులు, ఒక రాయిని ఎంచుకున్న తరువాత, అందులో ఒక అంగుళం వెడల్పు మరియు రెండు అంగుళాల లోతు ఉండే రంధ్రాలను ఒకే వరుసలో వేసుకుంటూ వస్తారంట. ఆ తరువాత చెక్కతో చేసిన చీలికను, ఆ రంధ్రాల లోకి సుత్తితో కొట్టి పెడతారంట. దీని తరువాత, వాళ్ళు చెక్క చీలికపై, వేడి నీటిని పోస్తారంట, అలా చేసినప్పుడు అదంతా ఆ రాయి లోపలే బాగా విస్తరిస్తుందంట. ఈ విధంగానే, వాళ్ళు ప్రతిరోజు వేడి నీటిని, ఈ చీలికలపై పోస్తూ ఉంటే, చివరికి ఆ రాయి సగానికి చీలిపోతుంది.
ఇప్పుడు, ఇది చిన్న చిన్న రాళ్లను మాత్రమే కాకుండా, నా పక్కన ఉన్నటువంటి ఈ పెద్ద రాళ్లను కూడా రెండుగా చీల్చుతుంది. ఈ రాయి ఒక 25 అడుగుల వెడల్పు మరియు 15 పొడవు ఉంది, కానీ, మీరు దీన్ని బాగా గమనించి చూస్తే, దీని పైన ఉలితో చెక్కిన గుర్తులను మీరు clear గా చూడవచ్చు. ఇలాంటి పెద్ద పెద్ద బండరాళ్లను కూడా చీలికలు మరియు వేడి నీటి వంటి సాధారణ వస్తువులను ఉపయోగించి ఎలా cut చేశారని ఇప్పటివరకు మీరు చూసుంటారు. ఈ evidence నిజంగానే మనం నమ్మే విధంగా ఉంది, దీనికి ముందు వీడియోలో ఇదే process గురించి నేను clear గా చెప్పాను, అయినప్పటికీ, నేను ఎందుకు పురాతన భారతీయ ప్రదేశాలన్నింటిలో ఇలా తిరుగుతున్నాను?
ఎందుకంటే, ఈ technique ని ఉపయోగించి, రాయిని cut చేయాలంటే, కొన్నినెలల సమయం పడుతుంది! ఈ బండరాయిని రెండు భాగాలుగా విడదీయడానికి, పురాతన నిర్మాణ దారులు, చాలా నెలలుగా వేడి నీటిని పోస్తూనే ఉండాలి. అయితే, అనేక గుడులను, కేవలం కొన్ని సంవత్సరాలలో నిర్మించేశారని clear అయిన evidences ఉన్నాయి. ఒక రాయిని, రెండు భాగాలుగా విభజించడానికి చాలా నెలల సమయం పడుతుందంటే, మరి వేలకొలది పెద్ద పెద్ద రాళ్లతో నిర్మించిన ఈ అద్భుతమైన గూడులన్నిటిని ఎలా కొన్ని సంవత్సరాలలోనే, నిర్మించారు? ఈ లెక్క సరిపోవడంలేదు కదా.
ఈ కొండలు మరియు పర్వతాల నుండి ఈ పెద్ద పెద్ద రాళ్లను cut చేసి తీయడానికి, ఇంకేదైనా technology ఉండుండాలి. Karnataka లో హంపి అనే ప్రదేశంలో ఉన్న కొండలలో, నేను మొట్టమొదటిగా విచిత్రమైన ఈ rock cutting techniqueని చూసాను. అక్కడ ఒకటి నుండి రెండు అడుగుల వరకు వేసిన ఒక drill mark ఉంది. ఈ రాయిపై, ఉలిని ఉపయోగించి చెక్కినట్టు ఎలాంటి గుర్తులు లేవు, కానీ ఈ రాయి సగానికి ముక్కలు అయినట్టు మనం చూడవచ్చు. ఒకవేళ ఇదే పురాతన rock cutting technique అయ్యుంటే, అయితే ఇప్పటికి వరకు మనకు తెలిసిన ప్రతిదాన్ని ఇది మారుస్తుంది. అయితే, ఇది నిజంగానే పురాతనమైనదా లేదా ఇప్పుడు recent గా చేశారా?
ఈ techniqueకి సంబంధించిన మరిన్ని సాక్ష్యాలను నేను కనిపెట్టాలి, ఎందుకంటే ఇది గత 10 సంవత్సరాలలో, modern machinesతో చేసిన, పని అని experts చాలా easyగా చెప్పేస్తారు. అందువల్ల, నేను ఇప్పుడు చెన్నైకి పక్కన ఉన్న మహాబలిపురం వెళ్లాలని decide అయ్యాను, ఎందుకంటే ఇది archeology department కాపాడుతూ వస్తున్న, ఒక పురాతన ప్రదేశం. మహాబలిపురం, అనేక మైళ్ల వరకు విస్తరించి ఉన్న ఒక ప్రాంతం, ఈ ప్రాంతంలో ఉన్న పురాతన స్మారక చిహ్నాలను రక్షించడానికి, గత 50 సంవత్సరాలుగా ఇక్కడ రాళ్లను cut చేయడాన్నీ ban చేశారు. మనం ఇప్పుడు మహాబలిపురం ఉన్న గుడులను కాకుండా, వాటి వెనుక ఉన్న అడవుల్లోకి వెళ్లి, అదే rock cutting techniqueని మనం చూడగలమా లేదా అని కనిపెడదాం రండి.
ఇక్కడ కూడా అదేలాంటి, ఒకే ఒక drill mark ఉన్న రాయి, ఇదే రకమైన rock cutting techniqueని ఉపయోగించి రెండుగా split అయినదాన్ని మనం చూడవచ్చు. ఇక్కడ వివిధ రాళ్లపై ఈ డ్రిల్లింగ్ markను వరుసగా వేసి ఈ రాళ్లను రెండుగా ఎలా split చేశారో చూడండి. ఇవన్నీ ఇప్పుడు, recentగా చేసినవి కావు, ఎందుకంటే ఒకప్పుడు ఈ రాయి యొక్క ఇంకొక సగం ఉండుంటుంది, కానీ ఇప్పుడే ఈ ప్రదేశంలో చెట్లు మరియు పొదలు కనిపిస్తున్నాయి. So, నిజంగానే, ఒక పెద్ద రాయిలో, ఒక holeని drill చేసి, దానిని రెండుగా split చేయడాన్నే పురాతన rock cutting technology అంటారు.
మహాబలిపురంలో ఉన్న పురాతన స్మారక చిహ్నాలకు సమీపంలోనే, finish అవ్వని కొన్ని రాళ్లను కూడా నేను చూసాను, ఈ technologyని, కనీసం 1300 సంవత్సరాలకు ముందే ఉపయోగించారని ఇది మనకు prove చేస్తుంది. ఈ విధమైన drill markలను finish ఐన, monumentsపై చూడలేము, ఎందుకంటే, వాటన్నిటిని పాలిష్ చేసి, remove చేసేస్తారు. Finish అవ్వని రాళ్లపై ఇలాంటి డ్రిల్ mark లను మనం చూడవచ్చు. ఇంచుమించు, 20 అడుగుల ఎత్తున్న ఈ పెద్ద రాయి రెండుగా చీలిపోయింది. And దీని sideలో, ఎలాంటి ఉలి గుర్తులను మీరు చూడలేరు, కేవలం ఒకే ఒక డ్రిల్ mark మాత్రమే ఉంది చూడండి. ఇంకా బాగా గమనించి చూశామంటే, ఈ రాయిలో సుమారు 10 అడుగుల ఎత్తులో ఉన్న, ఒక డ్రిల్లింగ్ tool నేరుగా ఈ రాయిలోకి వెళ్లడం మనం చూడవచ్చు. ఈ విధంగానే, పురాతన నిర్మాణ దారులు, అతి వేగంగా రాళ్లను cut చేసుంటారని, ఇది మనకు clearగా prove చేస్తుంది.
- Praveen Mohan Telugu










