జ్వలించే ముక్కంటిని దోపిడీ చేసిన బ్రిటీషులు... ఇది ఎవరికీ తెలియని పురాతన అద్భుతం!
Hey guys, ఈ రోజు మనం మహాబలిపురంలో ఉన్న చాలా విచిత్రమైన నిర్మాణాన్ని చూడబోతున్నాం, ఈ మర్మమైన నిర్మాణాన్ని ఒక పెద్ద రాతిపై కట్టారు, కాని ఈ మండపాన్ని సాధారణంగా ఒలక్కన్నేశ్వర ఆలయం అని పిలుస్తారు. పైకి ఎక్కి ఈ నిర్మాణం లోపల అలా ఏముందో అని చూద్దాం. ఇది కనీసం 1300 సంవత్సరాల నాటిదని Archaeologistsలు confirmగా చేస్తున్నారు, కానీ ఇది చాలా పాతది కూడా కావచ్చు. ఇలా జారే బండరాయి పైన ఈ నిర్మాణాన్ని ఎందుకు నిర్మించారు? ఒకవేళ గుడిలోపల ఉన్న ప్రధాన విగ్రహాన్ని ఒక్కసారి చూస్తే మనం దీన్ని అర్థం చేసుకోవచ్చు అని అనిపిస్తుంది. ఇక్కడ ఒక పెద్ద మెటల్ తలుపు ఉంది, కానీ అది లాక్ చేయబడింది, రండి లోపల ఉన్న విగ్రహాన్ని చూద్దాం, మధ్యలో ఒక పెద్ద స్తంభం మాత్రమే ఉంది, లోపల విగ్రహం ఏమి లేదు.
ఏ ఆలయంలో ఐనా ఇలా స్థంభం ఉంటుందా? ఏ ప్రధాన గదిలోనైనా మధ్యలో ఇలా స్తంభం ఉంటుందా చెప్పండి? ఆగండి.. అక్కడ ఎడమవైపు ఏదో ఉంది చూడండి. అది ఏంటి? అక్కడ పైకి వెళ్ళడానికి రాతి మెట్లు ఉండడం మీరు స్పష్టంగా చూడవచ్చు, ఇంకా పైన square షేప్ లో ఒక పెద్ద opening ఉంది. ఇక్కడి నుండి చూస్తుంటేనే మనకు ఆకాశం కనబడుతుంది కదా, ఇంకా ఆ రంధ్రం నుండి సూర్యరశ్మి లోపల పడడం మనం చూడవచ్చు. ఇది ఒక గుడి కాదని దీని నుండే మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఇక్కడ ప్రధాన విగ్రహం ఏమి లేదు, ceiling ఉన్న రంధ్రం దగరకు వెళ్ళడానికి మెట్లు మాత్రమే ఉన్నాయి, ఇంకా కుడి వైపు ఏముంది? ఒక చెక్క తలుపు ఉంది, దాన్ని క్లోస్ చేసి పెట్టారు. దీని లోపల ఇంకో చాంబర్ ఉండాలి.
ఆ చాంబర్ లోపల ఏముంది? ఈ ద్వారాన్ని మెటల్ గేటుతో ఎందుకు లాక్ చేశారు? లోపల చెక్కడాలైనా, విగ్రహాలైనా ఎందుకు లేవు? ఈ నిర్మాణం యొక్క full డిజైన్ చాలా వినోదంగా ఉంది, ఎందుకంటే దాదాపు అన్ని హిందూ దేవాలయాల పైభాగంలో వినామం అనే ఏరోడైనమిక్ గోపురాలు ఉంటాయి. కానీ ఈ నిర్మాణంలో అది లేదు, పైభాగంలో గోపురాలకు బదులుగా flat గా ఉంది, ప్రజలు పైకి ఎక్కి నిలబడడానికి దీన్ని flat గా డిజైన్ చేసినట్టు ఉంది కదా. then, అక్కడ పైకి ఎక్కడానికి మెట్లు ఉన్నాయి top level ని చేరుకోడానికి ఒక రంధ్రం కూడా ఉంది, ప్రజలు సులభంగా పైకి ఎక్కడానికి ఈ రంధ్రాన్ని ఉద్దేశపూర్వకంగానే పెద్దదిగా చేసారు. కానీ ఈ నిర్మాణం పైన వెళ్లి ప్రజలు ఏం చేస్తారు? అయితే దీని వెనుక ఏదో ఒక మర్మం దాగిఉంది?
ఈ నిర్మాణం యొక్క పేరు మరింత మర్మంగా ఉంది. 'ఒలకన్నేశ్వర' అనే ఈ పదాన్ని మనం ఎక్కడ వినని పేరును పెట్టారు. ఈ పదం గురించి ఎవరికీ ఏమీ తెలియదు. ఉలైకన్నేశ్వర అనే పదం ప్రాచీన తమిళ భాష నుండి వచ్చింది, దీని అర్థం ఏంటంటే, జ్వలించే 'మూడు కళ్ళు ఉన్నవాడు' అని అర్ధం. ఇది శివునుని సూచిస్తుందని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే ఆయనికి మాత్రమే మూడు కళ్ళు ఉంటాయి, కానీ దీని లోపల మూడు కన్నుల శివుని విగ్రహమూ లేదు, పైన ఏ విమాన గోపురం కూడా లేదు. అయితే ఈ గుడిని 'జ్వలించే 3 కళ్ళు’అని ఎందుకు పిలుస్తున్నారు? బహుశా ఈ శిల్పాలను గమనిస్తేనే ఈ నిర్మాణం యొక్క ఉద్దేశ్యాన్ని మనం అర్థం చేసుకోగలం.
ఇక్కడ అత్యంత విచిత్రమైన శిల్పాలు ఏంటంటే, ఈ ద్వారానికి రెండు వైపులా ఉన్న సంరక్షకులే. ఇద్దరు కూడా చాలా ప్రత్యేకంగా ఉన్నారు, ఎందుకంటే side pose లో పక్కకు తిరిగి ఉన్నారు. ఈ సంరక్షకులను ద్వారపాలకులు అని పిలుస్తారు, నేను already మీకు వివిధ హిందూ దేవాలయాలలో ఉన్న ఈ విగ్రహాలను చాలా చూపించాను. వీళ్ళు ఎప్పుడు కూడా ద్వారం నుండి నేరుగా మనవైపు చూస్తూ ఉంటారు. కానీ, వాళ్లు పక్కకి ఎదురుగా నిలబడి, చేతులను కట్టుకుని, ప్రధాన గది లోపలికి శ్రద్ధగా చూస్తున్నారు. లోపల ఏదో చాలా interesting అయినది జరిగుంటుంది అందుకే దీన్ని చాలా విచిత్రంగా చూపించారు. ఇంకా గోడ పైన చాల వినోదమైన శిల్పాలు కూడా ఉన్నాయి. ఇక్కడున్న ఈ చిన్నారులు ఎవరు? వాళ్లు తమ చేతుల్లో ఏం పట్టుకుని ఉన్నారు?
ప్రతి ఒక్కరు ఒక శంఖం పట్టుకొని ఉన్నారు, ఎవరైనా వస్తే సిగ్నల్ చేయడానికి ఈ శంఖాన్ని ఊదడానికి ready గా ఉన్నారు. ఈ చిన్నగా ఉన్న వ్యక్తుల expression చాలా అందంగా ఉంది కదా, వాళ్లు ఏదో దూరంగా వస్తున్నదాన్ని గమనించి చూస్తున్నారు. వాళ్లు అలా దేనిని గమనిస్తున్నారు? అసలు ఎవరు వస్తున్నారు? వాళ్లు అంతరిక్షం నుండి ఏలియన్స్ వస్తున్నారని చూస్తున్నారా? చుట్టూ తిరుగుతున్నప్పుడు, శంకాన్ని పట్టుకుని ఉన్న మరింత మంది చిన్నవాళ్ళను నేను ఇక్కడ చూస్తున్నాను. వాళ్లకు పైన, ఒక వ్యక్తి దూరంలో ఉన్న ఏదో ఒక వస్తువును వేలితో చూపుతున్నట్టు ఉన్నడు. ఆయన expression చూస్తుంటే, ఒక strict officer లాగా seriousగా ఉన్నాడు చుడండి. ఈయనకు కింద ఉన్న ఈ ఇద్దరు వ్యక్తులు, వాళ్ళ కళ్ళను బయటికిపెట్టి చూస్తున్నారు, పైన ఉన్న ఆఫీసర్ కమాండ్ చేసిన వెంటనే alert చేయడానికి సైరెన్ సౌండ్ లాగా శంఖం ఊదడానికి ready గా ఉన్నారు.
వాళ్ళు దేని కోసం చూస్తున్నారు? అదే లాంటి ఆకారంలో మరొకటి ఇక్కడ ఉంది. ఈ గోడలలో officers లను, వాళ్ళతో పాటు ఈ చిన్న వ్యక్తులను ఎందుకు చెక్కారు? మన పురాతన శిల్పులు మనకు ఏమి చెబుతున్నారని అర్థం కావడం లేదు కదా, మనం ఈ నిర్మాణం యొక్క నిజం ఏంటని తెలుసుకోవడానికి ఇక్కడ ఒక క్లూ మాత్రమే ఉంది, అది ఈ చెక్కడాలే, ఇవే మనకు నిజాన్నిచెప్తాయి. ఇక్కడ, నిజంగానే చాలా interesting ఐన ఒక చెక్కడం ఉంది. ధ్యానం చేసే postureలో కూర్చున్న శివుని రూపం చెక్కారు.పురాతన శిల్పులు అనుకుంటే, యొక్క వందల అవతారాలలో దేనినైనా ఒకదాన్ని చెక్కవచ్చు కదా. కానీ ఈ ధ్యానం చేసే శివుని పోస్ అంత ప్రసిద్ధ రూపం కాదు.
- Praveen Mohan Telugu













